మెర్సి కిల్లింగ్
మెర్సి కిల్లింగ్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. సాయి సిద్ధార్థ్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వేదుల బాల కామేశ్వరి సమర్పణలో సిద్ధార్థ్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మించిన ఈ సినిమాకు సూరపల్లి వెంకటరమణ దర్శకత్వం వహించాడు.[1] సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య ఉల్లింగల, హారిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 2న విడుదల చేసి, సినిమాను ఏప్రిల్ 12న విడుదల చేశారు.[2]
కథ
[మార్చు]అనాధగా బతుకుతున్న స్వేచ్ఛ(హారిక) తన తల్లితండ్రులను ఎవరో కనుక్కోవాలని ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటుంది. అలా తన తల్లితండ్రులను వెతుకుతున్న క్రమంలో మహేష్ (పార్వతీశం), భారతి (ఐశ్వర్య)లు కలుస్తారు. మహేష్ తో పాటు అక్కడ చేపలు పట్టేవాళ్లంతా అక్కడి రాజకీయ నాయకుడు కింద నలిగిపోతుంటారు. వాళ్ళ నుంచి మహేష్, ఐశ్వర్య ఎలా బయటపడ్డారు. స్వేచ్ఛ ఎందుకు మెర్సీ కిల్లింగ్ ద్వారా చనిపోవాలనుకుంటుంది? స్వేచ్ఛ తల్లితండ్రులను దొరుకుతారా ? లేదా అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
[మార్చు]- సాయి కుమార్[4]
- పార్వతీశం
- ఐశ్వర్య ఉల్లింగల
- ఆనంద చక్రపాణి
- హారిక
- రామరాజు
- సూర్య
- ఘర్షణ శ్రీనివాస్
- షేకింగ్ శేషు
- ఎఫ్.ఎం.బాబాయ్
- రంగస్థలం లక్ష్మీ
- ల్యాబ్ శరత్
- హేమసుందర్
- వీరబద్రం
- ప్రమీల రాణి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సాయి సిద్ధార్థ్ మూవీ మేకర్స్
- నిర్మాత: సిద్ధార్థ్ హరియల, మాధవి తాలబత్తుల
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సూరపల్లి వెంకటరమణ
- సంగీతం: ఎం.ఎల్.రాజా
- సినిమాటోగ్రఫీ:జి. అమర్
- ఎడిటర్: కపిల్ బల్లా
- ఆర్ట్ డైరెక్టర్: నాయుడు
- ఫైట్ మాస్టర్: దేవరాజ్
మూలాలు
[మార్చు]- ↑ Mana Telangana (31 March 2024). "చక్కటి కథతో 'మెర్సి కిల్లింగ్'". Archived from the original on 17 April 2024. Retrieved 17 April 2024.
- ↑ Chitrajyothy (30 March 2024). "ఆర్టికల్ 21 ఆధారంగా.. ప్రతి మహిళ కచ్చితంగా చూడాల్సిన చిత్రం | Sai Kumar Excellent Speech at Mercy Killing Pre Release Event KBK". Archived from the original on 17 April 2024. Retrieved 17 April 2024.
- ↑ Sakshi (12 April 2024). "మెర్సీ కిల్లింగ్ మూవీ రివ్యూ". Archived from the original on 17 April 2024. Retrieved 17 April 2024.
- ↑ Hindustantimes Telugu. "ప్రతి మహిళ చూడాల్సిన సినిమా మెర్సీ కిల్లింగ్.. సాయి కుమార్ కామెంట్స్". Archived from the original on 17 April 2024. Retrieved 17 April 2024.