వేణు ఊడుగుల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేణు ఊడుగుల
జననం
వేణు ఊడుగుల

జూలై 20
వృత్తితెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత
జీవిత భాగస్వామిజరీనా

వేణు ఊడుగుల (జ. జూలై 20) తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత. నీదీ నాదీ ఒకే కథ చిత్రం ద్వారా తెలుగు సినిమారంగంలోకి దర్శకుడిగా ప్రవేశించాడు.[1][2]

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

వేణు జూలై 20న [3] వరంగల్ గ్రామీణ జిల్లా, చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో జన్మించాడు.[4] మూడో తరగతి వరకు ఉప్పరపల్లిలో చదువుకున్న వేణు, తర్వాత హన్మకొండ లోని బాలసముద్రంలో చదివాడు. డిగ్రీ చివరి సంవత్సరంలో హైదరాబాద్‌కు వచ్చాడు.

సినిమారంగ ప్రస్థానం

[మార్చు]
తెలంగాణ యువ నాటకోత్సవంలో పాల్గొన్న వేణు ఊడుగులకి సత్కారం

చదువంటే పెద్దగా ఆసక్తి లేని వేణు బస్సు కండెక్టర్ అవ్వాలనుకున్నాడు. చిన్నప్పటినుండి సినిమాలపై ఆసక్తి ఉండడంతో, 2008లో సినిమారంగానికి వచ్చాడు. సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎవరూ అవకాశాలు ఇవ్వకపోవడంతో కొంతకాలం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పనిచేసి, ఆ తరువాత మదన్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాడు.[5] వేటూరి సుందరరామ్మూర్తి దగ్గర సహాయకుడిగా పనిచేసాడు.

దర్శకత్వం చేసినవి

[మార్చు]
  1. నీదీ నాదీ ఒకే కథ - (23.03.2018) [6][7]
  2. విరాట పర్వం (2021) [8]

రచన సహకారం

[మార్చు]
  1. జై బోలో తెలంగాణా (మాటల రచయిత)

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ, జందీగీ, యువ (21 March 2018). "నీదీ నాదీ ఒకే కథ..యువతరం వ్యథ". Archived from the original on 21 March 2018. Retrieved 23 March 2018.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)
  2. Namasthe Telangana (8 June 2023). "వెండితెరపై నిండుగా పరిఢవిల్లుతున్న తెలంగాణ జీవన సౌందర్యం: దర్శకుడు వేణు ఉడుగుల". Archived from the original on 8 June 2023. Retrieved 8 June 2023.
  3. The Times of India (20 July 2020). "Rana Daggubati wishes Virata Parvam director Venu Udugula on his birthday - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2021. Retrieved 5 July 2021.
  4. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (2 June 2019). "మన తెలంగాణ ఘన తెలంగాణ". Archived from the original on 2 June 2019. Retrieved 15 June 2019.
  5. 123తెలుగు. "ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: వేణు ఊడుగుల – సినిమాలో తల్లిదండ్రుల కోసం బలమైన సందేశం ఉంటుంది !". www.123telugu.com. Retrieved 23 March 2018.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Suryaa (19 March 2019). "ప్రతి ఫ్రేమూ వేణు ఊడుగుల ప్రతిభకు అద్దం పడుతుంది!". Archived from the original on 5 July 2021. Retrieved 5 July 2021.
  7. The Hindu (20 January 2018). "By the rule book: Venu Udugula on his debut film Needi Naadi Oke Katha" (in Indian English). Archived from the original on 7 February 2023. Retrieved 7 February 2023.
  8. Sakshi (15 June 2019). "'విరాటపర్వం' మొదలైంది!". Archived from the original on 5 July 2021. Retrieved 5 July 2021.

ఇతర లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.