ప్లే బ్యాక్ (2021 సినిమా)
ప్లే బ్యాక్ | |
---|---|
దర్శకత్వం | హరిప్రసాద్ జ |
రచన | హరిప్రసాద్ జ |
నిర్మాత | ప్రసాద్రావు పెద్దినేని |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | కె.బుజ్జి |
కూర్పు | నాగేశ్వర రెడ్డి బొంతల |
సంగీతం | కమ్రాన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ |
విడుదల తేదీs | 5 మార్చి, 2021 |
సినిమా నిడివి | 138 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ప్లే బ్యాక్ థ్రిల్లర్ డ్రామాగా 2021లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రసాద్రావు పెద్దినేని ఈ చిత్రాన్ని నిర్మించగా హరి ప్రసాద్ జక్కా దర్శకత్వం వహించాడు. దినేష్ తేజ్, అనన్య నాగళ్ల, టిఎన్ఆర్, ఆనంద చక్రపాణి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2021, మార్చి 5న విడుదల కాగా, ఆహా ఓటీటీలో 2021, మే 21 నుంచి స్ట్రీమింగ్ అయ్యింది.[1][2]
కథ
[మార్చు]కార్తీక్ (దినేష్ తేజ్) ఓ క్రైమ్ రిపోర్టర్. అతను తన స్నేహితుడితో ఓ ఇంటికి అద్దెకు వస్తాడు. అయితే కార్తీక్ ఆ ఇంట్లో ఓ పాత మోడల్ ల్యాండ్‌లైన్ ఫోన్‌ను చూస్తాడు. ఆ సమయంలో ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న సుజాత ( అనన్య నాగళ్ల) ఆ ఫోన్‌కి కాల్ చేస్తుంది. అలా వారిద్దరూ మాట్లాడుకుంటున్న నేపధ్యంలో సుజాత ఉన్నది 1993లో, కార్తీక్ బ్రతుకుతున్నది 2019లో అని తెలుస్తుంది? అసలు సుజాత-కార్తీక్ ల మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ప్రస్తుతంలో ఉన్న కార్తీక్ ఫోన్ ద్వారా గతంలో సుజాత భవిష్యత్‌ను ఏ విధంగా మార్చాడు? ఈ మొత్తం కథలో అసలు టెలిఫోన్ పాత్ర ఏమిటి? అనేది ఈ సినిమా కథ.[3]
నటీనటులు
[మార్చు]- దినేష్ తేజ్
- అనన్య నాగళ్ల
- టిఎన్ఆర్
- ఆనంద చక్రపాణి
- టీవీ5 మూర్తి
- సూర్య
- ఐశ్వర్య లక్ష్మి
- స్పందన
- అర్జున్ కళ్యాణ్
- మాస్టర్ కార్తికేయ
- అశోక్ వర్ధన్
- దీప్తి
స్పందన
[మార్చు]హెచ్ ఎమ్ టివి కు చెందిన వెంకటా చారి "ప్లే బ్యాక్ సినిమా కచ్చితంగా అందర్ని థ్రిల్లింగ్‌కు గురి చేస్తుంది." అని రాశాడు.[4] జీ సినీమలు యొక్క విశ్లేసకుడు 5 స్టార్లకు 2.5 వేసి, "ఇలాంటి కథకి బలం చేకూర్చే నటీనటులను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. హరిప్రసాద్ ఈ సినిమాకు పెద్దగా అనుభవం లేని నటులను తీసుకోవడం వల్ల ఆ క్యారెక్టర్స్ క్లిక్ అవ్వలేదు. ఉన్నంతలో హీరోయిన్ అనన్య ఫరవాలేదు. మిగతా వాళ్లు క్యారెక్టర్స్ కి బెస్ట్ ఇవ్వలేకపోయారు," అని వ్యాఖ్హానించాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ Andhrajyothy (12 May 2021). "మే 21న 'ఆహా'లో 'ప్లే బ్యాక్'". Archived from the original on 12 మే 2021. Retrieved 12 May 2021.
- ↑ Sakshi (12 May 2021). "TNR 'ప్లే బ్యాక్', ఆహాలో ఎప్పటినుంచంటే?". Sakshi. Archived from the original on 12 మే 2021. Retrieved 12 May 2021.
- ↑ Zee Cinemalu (5 March 2021). "Movie Review - 'ప్లే బ్యాక్'" (in ఇంగ్లీష్). Archived from the original on 12 మే 2021. Retrieved 12 May 2021.
- ↑ Chari, Venkata (2021-03-05). "Playback Review:'ప్లే బ్యాక్' మూవీ రివ్యూ". Retrieved 2021-07-08.
- ↑ "Movie Review - 'ప్లే బ్యాక్'". www.zeecinemalu.com. Archived from the original on 2021-07-08. Retrieved 2021-07-08.