ప్లే బ్యాక్ (2021 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్లే బ్యాక్‌
దర్శకత్వంహరిప్రసాద్‌ జ
రచనహరిప్రసాద్‌ జ
నిర్మాతప్రసాద్‌రావు పెద్దినేని
తారాగణం
ఛాయాగ్రహణంకె.బుజ్జి
కూర్పునాగేశ్వర రెడ్డి బొంతల
సంగీతంక‌మ్రాన్
నిర్మాణ
సంస్థ
శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌
విడుదల తేదీs
5 మార్చి, 2021
సినిమా నిడివి
138 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

ప్లే బ్యాక్ థ్రిల్లర్ డ్రామాగా 2021లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రసాద్రావు పెద్దినేని ఈ చిత్రాన్ని నిర్మించగా హరి ప్రసాద్ జక్కా దర్శకత్వం వహించాడు. దినేష్ తేజ్, అనన్య నాగళ్ల, టిఎన్ఆర్, ఆనంద చక్రపాణి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2021, మార్చి 5న విడుదల కాగా, ఆహా ఓటీటీలో 2021, మే 21 నుంచి స్ట్రీమింగ్ అయ్యింది.[1][2]

కార్తీక్ (దినేష్ తేజ్) ఓ క్రైమ్ రిపోర్టర్. అతను తన స్నేహితుడితో ఓ ఇంటికి అద్దెకు వస్తాడు. అయితే కార్తీక్ ఆ ఇంట్లో ఓ పాత మోడల్ ల్యాండ్‌లైన్ ఫోన్‌ను చూస్తాడు. ఆ సమయంలో ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న సుజాత ( అనన్య నాగళ్ల) ఆ ఫోన్‌కి కాల్ చేస్తుంది. అలా వారిద్దరూ మాట్లాడుకుంటున్న నేపధ్యంలో సుజాత ఉన్నది 1993లో, కార్తీక్ బ్రతుకుతున్నది 2019లో అని తెలుస్తుంది? అసలు సుజాత-కార్తీక్ ల మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ప్రస్తుతంలో ఉన్న కార్తీక్ ఫోన్ ద్వారా గతంలో సుజాత భవిష్యత్‌ను ఏ విధంగా మార్చాడు? ఈ మొత్తం కథలో అసలు టెలిఫోన్ పాత్ర ఏమిటి? అనేది ఈ సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]

స్పందన

[మార్చు]

హెచ్ ఎమ్ టివి కు చెందిన వెంకటా చారి "ప్లే బ్యాక్ సినిమా కచ్చితంగా అందర్ని థ్రిల్లింగ్‌కు గురి చేస్తుంది." అని రాశాడు.[4] జీ సినీమలు యొక్క విశ్లేసకుడు 5 స్టార్లకు 2.5 వేసి, "ఇలాంటి కథకి బలం చేకూర్చే నటీనటులను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. హరిప్రసాద్ ఈ సినిమాకు పెద్దగా అనుభవం లేని నటులను తీసుకోవడం వల్ల ఆ క్యారెక్టర్స్ క్లిక్ అవ్వలేదు. ఉన్నంతలో హీరోయిన్ అనన్య ఫరవాలేదు. మిగతా వాళ్లు క్యారెక్టర్స్ కి బెస్ట్ ఇవ్వలేకపోయారు," అని వ్యాఖ్హానించాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (12 May 2021). "మే 21న 'ఆహా'లో 'ప్లే బ్యాక్'". Archived from the original on 12 మే 2021. Retrieved 12 May 2021.
  2. Sakshi (12 May 2021). "TNR 'ప్లే బ్యాక్‌', ఆహాలో ఎప్పటినుంచంటే?". Sakshi. Archived from the original on 12 మే 2021. Retrieved 12 May 2021.
  3. Zee Cinemalu (5 March 2021). "Movie Review - 'ప్లే బ్యాక్'" (in ఇంగ్లీష్). Archived from the original on 12 మే 2021. Retrieved 12 May 2021.
  4. Chari, Venkata (2021-03-05). "Playback Review:'ప్లే బ్యాక్' మూవీ రివ్యూ". Retrieved 2021-07-08.
  5. "Movie Review - 'ప్లే బ్యాక్'". www.zeecinemalu.com. Archived from the original on 2021-07-08. Retrieved 2021-07-08.