మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా
మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా | |
---|---|
దర్శకత్వం | తిరుపతి రావు |
రచన | తిరుపతి రావు |
మాటలు | రాధా మోహన్ గుంటి |
నిర్మాత | ఆరేం రెడ్డి, ప్రశాంత్, భవాని కాసుల |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సిద్దార్థ స్వయంభూ |
కూర్పు | రవితేజ గిరిజాల |
సంగీతం | సంజీవ్. టీ |
నిర్మాణ సంస్థలు | కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ |
విడుదల తేదీs | 23 ఫిబ్రవరి 2024(థియేటర్) 29 మార్చి 2024 ( అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా 2024లో విడుదలైన తెలుగు సినిమా. వంశీ నందిపాటి సమర్పణలో కాసుల క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై ఆరేం రెడ్డి, ప్రశాంత్, భవాని కాసుల నిర్మించిన ఈ సినిమాకు తిరుపతి రావు దర్శకత్వం వహించాడు. అభినవ్ గోమఠం, వైశాలి రాజ్, అలీ రెజా, మొయిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2024 ఫిబ్రవరి 10న విడుదల చేయగా[1], సినిమా ఫిబ్రవరి 23న విడుదలైంది.[2]
ఈ సినిమా మార్చి 29 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]
కథ
[మార్చు]ఒక చిన్న పలెటూళ్లో మనోహర్ (అభినవ్ గోమఠం) పెయింటర్ అవ్వాలని, అలాగే తన ఊరిలోనే దానిపై మంచి వ్యవహరం పెట్టి జీవితంలో సెటిల్ అవుదామని కలలు గంటూ ఉంటాడు. ఈ క్రమంలో ఫ్లెక్సీల ప్రింటింగ్ ప్రెస్ పెట్టాలని నిర్ణయించుకోగా అనేక సవాళ్లను ఎదురుకుంటాడు. మనోహర్ ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? అసలు మనోహర్‌కు తాను కలలు గన్న జీవితం దొరుకుతుందా లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[4]
నటీనటులు
[మార్చు]- అభినవ్ గోమఠం[5]
- వైశాలి రాజ్[6]
- అలీ రెజా
- మొయిన్
- నిళల్గళ్ రవి
- ఆనంద చక్రపాణి
- తరుణ్ భాస్కర్
- రవీందర్ రెడ్డి
- లావణ్య రెడ్డి
- జ్యోతి రెడ్డి
- సూర్య
- రాకెట్ రాఘవ
- శ్వేతా ఆవాస్తి
- సాయి కృష్ణ
- ఫణి చంద్రశేఖర్
- ఎంవీవీ సత్యనారాయణ (అతిధి పాత్ర)
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: కాసుల క్రియేటివ్ వర్క్స్
- నిర్మాత: ఆరేం రెడ్డి, ప్రశాంత్, భవాని కాసుల
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరుపతి రావు
- సంగీతం: సంజీవ్. టీ
- సినిమాటోగ్రఫీ: సిద్దార్థ స్వయంభూ
- ఎడిటర్: రవితేజ గిరిజాల
- మాటలు: రాధా మోహన్ గుంటి
- ప్రొడక్షన్ డిజైనర్: శరవణన్ వసంత్
- పాటలు: కిట్టు విస్సాప్రగడ
- గాయకులు: సిద్ శ్రీరామ్, హేమచంద్ర
మూలాలు
[మార్చు]- ↑ Namaste Telangana (11 February 2024). "'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా నీలో'.. ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్". Archived from the original on 11 February 2024. Retrieved 11 February 2024.
- ↑ Eenadu (30 January 2024). "షేడ్స్ చూపించేది అప్పుడే". Archived from the original on 11 February 2024. Retrieved 11 February 2024.
- ↑ Chitrajyothy (29 March 2024). "చప్పుడు లేకుండా.. ఓటీటీలోకి వచ్చేసిన కామెడీ డ్రామా". Archived from the original on 4 April 2024. Retrieved 4 April 2024.
- ↑ Sakshi (23 February 2024). "'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా'మూవీ రివ్యూ". Archived from the original on 4 April 2024. Retrieved 4 April 2024.
- ↑ Andhrajyothy (22 January 2024). "అభినవ్ గోమఠం హీరోగా.. 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా'!". Archived from the original on 11 February 2024. Retrieved 11 February 2024.
- ↑ Andhrajyothy (5 February 2024). "మస్త్ షేడ్స్‌తో హలో అమ్మాయి". Archived from the original on 11 February 2024. Retrieved 11 February 2024.