నిళల్‌గళ్ రవి
నిళల్‌గళ్ రవి | |
---|---|
జననం | రవిచంద్రన్ శ్యామణ్ణ 1956 ఏప్రిల్ 16 కోయంబత్తూరు, తమిళనాడు, భారతదేశం |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1980–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | విష్ణుప్రియ |
పిల్లలు | రాహుల్ |
నిళల్‌గళ్ రవి ఒక భారతీయ సినిమా నటుడు. టెలివిజన్ నటుడు కూడా. ఇతడు తమిళ, మలయాళ, తెలుగు భాషా చలనచిత్రాలలో, సీరియళ్లలో నటించాడు. ఇతడు 1980లో అనే తమిళ సినిమాతో నటుడిగా తన వృత్తిని ప్రారంభించాడు.[1] ఇతడు 500కు పైగా సినిమాలలో నటించాడు.[2] ta:நிழல்கள் (திரைப்படம்)
వృత్తి
[మార్చు]నిళల్‌గళ్ రవి భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన నిళల్‌గల్ సినిమాతో తన నటజీవితాన్ని ఆరంభించాడు. ఆ సినిమా పేరే ఇతని ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. ఇతడు స్నేహశీలుడైన తండ్రి, నిర్దయుడైన విలన్, వెన్నుపోటు పొడిచే స్నేహితుడు వంటి అనేక విభిన్నమైన పాత్రలను ధరించాడు. అమితాబ్ బచ్చన్ వంటి నటులకు తమిళంలో డబ్బింగ్ చెప్పాడు. ఈటీవిలో ప్రసారమైన లాహిరి లాహిరి లాహిరిలో అనే తెలుగు టెలివిజన్ సీరియల్లో నటించాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఇతడు 1953, ఏప్రిల్ 16న శ్యామణ్ణ, డి.రాజమ్మ దంపతులకు తొమ్మిదవ సంతానంగా ఒక తమిళ సాంప్రదాయ కుటుంబంలో జన్మించాడు. ఇతనికి ఐదుగురు అన్నలు, ముగ్గురు అక్కలు ఉన్నారు. ఇతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు రవిచంద్రన్. ఇతడు కొయంబత్తూరులోని పి.ఎస్.జి.ఆర్ట్స్ కాలేజీ నుండి ఎకనామిక్స్‌లో బి.ఎ. పట్టా పుచ్చుకున్నాడు. ఇతడు విష్ణుప్రియను వివాహం చేసుకున్నాడు. వీరికి రాహుల్ అనే కుమారుడున్నాడు.[3]
తెలుగు సినిమాల జాబితా
[మార్చు]ఇతడు తమిళ, మలయాళ, కన్నడ సినిమాలతో పాటు కొన్ని తెలుగు సినిమాలలో నటించాడు.
ఇతడు నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
విడుదల సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | దర్శకుడు | వివరాలు |
---|---|---|---|---|
1987 | గౌతమి | గిరీష్ | క్రాంతి కుమార్ | టైటిల్స్‌లో ఇతడి పేరును రవిబాబుగా పేర్కొన్నారు. |
1988 | ఇన్‌స్పెక్టర్ ప్రతాప్ | రాంకీ | ముత్యాల సుబ్బయ్య | |
1989 | పగలే వెన్నెల | మణిరత్నం | ||
1989 | సూర్యోదయం | సుందర్ కె.విజయన్ | ||
1990 | అల్లుడుగారు | కె.రాఘవేంద్రరావు | ||
1990 | లక్ష్మి దుర్గ | రామనారాయణ | ||
1992 | గౌరమ్మ | |||
1991 | జైత్రయాత్ర | ఉప్పలపాటి నారాయణ రావు | ||
1991 | ప్రేయసి | మలేషియా వాసుదేవన్ | ||
1993 | ఘరానా కూలి | పి. వాసు | ||
1993 | నిప్పురవ్వ | ఇంజనీర్ | ఎ.కోదండరామి రెడ్డి | |
1994 | అల్లరోడు | నాయుడు | కె.అజయ్ కుమార్ | |
1994 | ఖైదీ అన్నయ్య | రాజశేఖర్ | ||
1995 | గుంటూరు గుండమ్మ కథ | జి.సి.శేఖర్ | ||
1996 | ఆశ ఆశ ఆశ | వసంత్ | ||
2008 | కథానాయకుడు | నిళల్‌గళ్ రవి | పి. వాసు | |
2009 | పున్నమినాగు | హనీ తండ్రి | ఎ.కోదండరామి రెడ్డి | |
2012 | నువ్వెక్కడుంటే నేనక్కడుంటా | శుభ సెల్వం | ||
2018 | కణం | కృష్ణ తండ్రి | ఎ.ఎల్.అజయ్ | డబ్బింగ్ సినిమా |
2019 | NGK | నంద గోపాల కృష్ణ తండ్రి | సెల్వరాఘవన్ | |
2024 | మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా |
మూలాలు
[మార్చు]- ↑ "Grill mill -- 'Nizhalgal' Ravi". The Hindu. 21 November 2008.
- ↑ "It is 500 films for Nizhalgal Ravi". Kolly Insider.
- ↑ వెబ్ మాస్టర్. "Short biography". celebritykick. Retrieved 9 April 2020.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో నిళల్‌గళ్ రవి పేజీ