Jump to content

బి.నరసింగరావు

వికీపీడియా నుండి
బి. నరసింగరావు (ముఖచిత్రం)

ప్రపంచ చలన చిత్రపటంపై తెలంగాణ సినిమాకి ప్రత్యేక గుర్తింపును తెచ్చిన కళాత్మక చిత్రాల దర్శకుడు బి. నరసింగరావు. ఇంటిపేరు బొంగు. నిర్మాతగా, నటుడిగా, దర్శకుడిగా, స్వరకర్తగా, పెయింటర్‌గా, కవిగా ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈయన మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్లో 1946లో జన్మించారు. ఆయన తీసిన సినిమాలు తక్కువే అయినా వాటి ప్రభావం, ప్రత్యేక ముద్ర మాత్రం విశ్వానికి వ్యాపించింది. తెలంగాణ జీవన చిత్రాలనే తన సినిమాలుగా రూపొందించిన అచ్చమైన స్వచ్ఛమైన ప్రజాకళాకారుడు. ఆయన. ఆయన తీసిన ఒక్కో సినిమా ‘తెలంగాణ సినిమా’కు ఓ గ్రామర్, బలమైన పునాదిని సృష్టించింది. రంగుల కల, దాసి (1988 సినిమా), మట్టి మనుషులు, సినిమాలే అందుకు ఉదాహరణ. అందుకే రాష్ట్ర ప్రభుత్వం బీఎన్ రెడ్డి జాతీయ అవార్డును ఇచ్చి సత్కరించింది. నాలుగు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, అనేక అంతర్జాతీయ గౌరవాలు పొందారు. మా భూమి సినిమాను 1979 లో కైరో, సిడ్నీ ఫిల్మ్ ఫెస్టివల్స్, కార్లోవీ ఫిల్మ్ ఫెస్టివల్ లో వారీ ప్రదర్శించారు. 1989లో దాసి, 1991లో మట్టి మనుషులు మాస్కో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో మెరిట్ అవార్డు డిప్లొమా గెలిచింది. మా ఊరు హంగేరి అంతర్జాతీయ ఉత్సవంలో మీడియా వేవ్ అవార్డును గెలుచుకుంది. ఈయన దర్శకత్వం వహించిన హరివిల్లు (ఫిచర్ ఫిల్మ్) 2003 లో 56వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఎంపికైనది.

2014 లో ఆయన సంపాదకత్వంలో తెలంగాణా లోని చిత్రకారుల, శిల్పుల పరిచయాలతో, చిత్రాలతో "ఆర్ట్ యట్ తెలంగాణా" పుస్తకం వెలువడింది.

ఆయనను 2025 జూన్ 30న తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుల కమిటీ సభ్యుడిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]

చిత్రసమాహారం

[మార్చు]

డైరెక్టర్ గా

[మార్చు]
  • రంగుల కల (1983)
  • ది కార్నివాల్ (డాక్యుమెంటరీ, 1984)
  • ది సిటీ (డాక్యుమెంటరీ, 1985)
  • మా ఊరు (డాక్యుమెంటరీ, 1987)
  • దాసి (1988)
  • మట్టి మనుషులు (1990)
  • హరివిల్లు (2003)

స్క్రీన్ ప్లే రచయితగా

[మార్చు]
  • మా భూమి (అనుకరణ / డైలాగ్, 1979)
  • దాసి (రచయిత, 1988)
  • హరివిల్లు (అనుకరణ / కథ, 2003)

సంగీత దర్శకుడు గా

[మార్చు]
  • మా భూమి (1979)
  • హరివిల్లు (2003)

నిర్మాతగా

[మార్చు]
  • మా భూమి (1979)
  • దాసి (1988)

నటుడిగా

[మార్చు]
  • రంగులకల (1983)

అవార్డులు

[మార్చు]

తెలుగు లో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు

[మార్చు]

ఉత్తమ మానవశాస్త్ర / ఎథ్నోగ్రాఫిక్ సినిమా జాతీయ సినిమా పురస్కారం

[మార్చు]

ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డు

[మార్చు]

ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]
  1. 2014లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం

మూలాలు

[మార్చు]

https://web.archive.org/web/20160306232119/http://mangocinewoods.blogspot.in/2012/05/blog-post_07.html

  1. "భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుల కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ కోదండరాం". NT News. 30 June 2025. Archived from the original on 1 July 2025. Retrieved 1 July 2025.