అనగనగా ఓ అతిథి
అనగనగా ఓ అతిథి | |
---|---|
దర్శకత్వం | దయాళ్ పద్మనాభన్ |
రచన | ఆనంద్ చంద్ర |
నిర్మాత | రాజా రామమూర్తి, చిదంబరం నడేసన్ |
తారాగణం | పాయల్ రాజ్‌పుత్, చైతన్య కృష్ణ |
ఛాయాగ్రహణం | రాకేశ్ బి |
కూర్పు | ప్రీతి, బాబు ఎ.శ్రీవత్సవ |
సంగీతం | ఆరోల్ కోరెల్లి |
నిర్మాణ సంస్థ | ట్రెండ్ లౌడ్ |
విడుదల తేదీ | 20 నవంబర్ 2020 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అనగనగా ఓ అతిథి 2020లో విడుదలైన సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమా. 2018లో కన్నడలో విడుదలైన ‘ఆ కరాళ రాత్రి' చిత్రాన్ని తెలుగు రీమేక్ చేశారు. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించగా దయాళ్ పద్మనాభన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ట్రైలర్ ను 2020, నవంబరు 17న వెంకటేష్ విడుదల చేశాడు.[1] ఈ సినిమా ఆహా ఓటీటీలో 2020 నవంబరు 20న విడుదలైంది.[2]
కథ
[మార్చు]ఓ ఊరి చివరన తల్లి, తండ్రి, వాళ్ల కూతురుతో కలిసి ఉంటారు. అప్పులు చేసి ఉన్న పొలం కూడా తాకట్టు పెట్టి దరిద్రంగా బతుకుతున్న ఆ ఫ్యామిలీ లోకి అనుకోని ఓ అతిథి వస్తాడు. అతను ఉన్నంతలో బాగా సంపాదించి తన జీవితాన్ని తిరుగుతూ కొత్త కొత్త ప్రాంతాలు చుట్టేస్తూ బతికేయాలనుకునే వ్యక్తి. అలా ఇంటికి వచ్చిన శ్రీనివాస్ కి కావాల్సిందల్లా వండి పెడుతూ అతనికి అతిథి మర్యాదలు చేస్తుంటారు. అయితే అతని దగ్గర పెట్టెనిండా డబ్బు, నగలు చుసిన హీరోయిన్ కి కొత్త ఆశలు పుట్టుకొస్తాయి. ఎలాగైనా సరే ఆ డబ్బు నగలు తన సొంతం చేసుకునేందుకు అతన్ని హతమార్చాలని కుట్ర పన్నుతోంది. మరి అనుకున్నట్లే అతడిని వాళ్ళు హత్య చేసారా,, లేదా ? అనేది మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
[మార్చు]- పాయల్ రాజ్‌పుత్ - మల్లిక
- చైతన్య కృష్ణ - శ్రీనివాస్
- వీణ సుందర్ -మల్లిక, అమ్మ
- ఆనంద చక్రపాణి -మల్లిక, నాన్న
- అశోక్‌కుమార్
- తోటపల్లి మధు
- వేణు
- అప్పాజీ
- నవీన్ కృష్ణ
- వాసు ఇంటూరి
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దయాళ్ పద్మనాభన్
- నిర్మాతలు: రాజా రామమూర్తి, చిదంబరం నడేసన్
- సినిమాటోగ్రఫీ: రాకేశ్ బి
- నేపథ్య సంగీతం: ఆరోల్ కోరెల్లి
- పాటలు: కళ్యాణ్ చక్రవర్తి
- ఆర్ట్: విఠల్ కోసనం
- ఎడిటింగ్: ప్రీతి, బాబు ఎ శ్రీవాత్సవ
- బ్యానర్: ట్రెండ్ లౌడ్
మూలాలు
[మార్చు]- ↑ 10TV (18 November 2020). "పాయల్ కొత్త కోణం.. ఆకట్టుకుంటున్న ట్రైలర్ | Anaganaga O Athidhi Trailer". 10TV (in telugu). Retrieved 24 May 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Andhrajyothy (22 November 2020). "'అనగనగా ఓ అతిథి' మూవీ రివ్యూ". www.andhrajyothy.com. Archived from the original on 24 మే 2021. Retrieved 24 May 2021.
- ↑ Film Companion (21 November 2020). "Review Of Anaganaga O Athidhi On Aha: There's No Fire In This Remake Of Kannada Thriller Aa Karaala Ratri". Film Companion. Archived from the original on 24 మే 2021. Retrieved 24 May 2021.