చూసి చూడంగానే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చూసి చూడంగానే
Choosi Chudangane Movie Poster.jpeg
చూసి చూడంగానే సినిమా పోస్టర్
దర్శకత్వంశేష సింధు రావు
నిర్మాతరాజ్ కందుకూరి
నటులుశివ కందుకూరి
వర్ష బొల్లమ్మ
మాళవిక సతీశన్‌
సంగీతంగోపి సుందర్
ఛాయాగ్రహణంవేద రమణ
రవితేజ గిరిజాల
కూర్పువేద రమణ
రవితేజ గిరిజాల
నిర్మాణ సంస్థ
ధర్మపథ క్రియేషన్స్
పంపిణీదారుసురేష్ ప్రొడక్షన్స్
విడుదల
జనవరి 31, 2020 (2020-01-31)
దేశంభారతదేశం
భాషతెలుగు

చూసి చూడంగానే 2020, జనవరి 31న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై రాజ్ కందుకూరి నిర్మించిన ఈ చిత్రానికి శేష సింధు రావు దర్శకత్వం వహించాడు.[2] శివ కందుకూరి,[3] వర్ష బొల్లమ్మ,[4] మాళవిక సతీశన్‌ తొలిసారిగా నటించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించాడు.

కథా సారాంశం[మార్చు]

తల్లిదండ్రుల బలవంతంతో ఇంజనీరింగ్‌లో చేరిన సిద్ధు (శివ కందుకూరి), ఐశ్వర్య (మాళవిక)తో ప్రేమలో పడతాడు. ఇంజనీరింగ్‌ చివర్లో ఐశ్వర్య సిద్ధును వదిలేస్తుంది. ఆ డ్రిపెషన్‌తో ఇంజనీరింగ్‌ పూర్తిచేయకుండా మూడేళ్లు కష్టపడి వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్‌గా సెటిల్‌ అవుతాడు. ఆ సమయంలో ఒక పెళ్లిలో శృతిని (వర్ష) చూసి ప్రేమిస్తాడు. అయితే, శృతి ఇంజనీరింగ్‌లోనే సిద్ధును ప్రేమిస్తుందికానీ, ఆ విషయం సిద్ధుకు చెప్పదు. ఇదే సమయంలో శృతి బాయ్‌ఫ్రెండ్‌ విరాట్‌ వచ్చి ప్రపోజ్‌ చేయడంతో శృతి కూడా ఓకే చెపుతుంది. ఆ తర్వాత శృతి, సిద్దుల మధ్య ఏం జరిగింది. చివరకు వాళ్లిద్దరు ఒకటయ్యారా. విరాట్‌తోనే శృతి పెళ్లి జరిగిందా అనేది మిగతా కథ.[5][6]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: శేష సింధు రావు
  • నిర్మాత: రాజ్ కందుకూరి
  • సంగీతం: గోపి సుందర్
  • ఛాయాగ్రహణం, కూర్పు: వేద రమణ, రవితేజ గిరిజాల
  • నిర్మాణ సంస్థ: ధర్మపథ క్రియేషన్స్
  • పంపిణీదారు: సురేష్ ప్రొడక్షన్స్

నిర్మాణం[మార్చు]

2019, జనవరిలో చిత్రీకరణ ప్రారంభమై 2019, ఏప్రిల్ నెలలో చిత్రీకరణ పూర్తయింది.[8] జాతీయ అవార్డు గ్రహీత, పెళ్ళి చూపులు, మెంటల్ మదిలో చిత్రాల నిర్మాత, రాజ్ కందుకూరి ధర్మపాత క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించాడు.

పాటలు[మార్చు]

Untitled

ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్ని అందించాడు. మధుర ఆడియో ద్వారా ఈ చిత్రంలోని పాటలు విడుదలయ్యాయి.[9]

పాటల జాబితా
సంఖ్య. పాటగాయకులు నిడివి
1. "నీ పరిచయంతో (రచన: అనంత శ్రీరామ్)"  సిద్ శ్రీరామ్ 3:36
2. "వెనకనే ఉన్నా (రచన: అనంత శ్రీరామ్)"  చిన్మయి 4:49
3. "నీడే నాకు నేను (రచన: రామజోగయ్య శాస్త్రి)"  గోపి సుందర్ 3:36
4. "తూరుపు జాడలో (రచన: విశ్వ)"  ఎల్.వి. రేవంత్ 3:12
5. "ఏమైందో తెలుసా (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"  కాల భైరవ, నూతన మోహన్ 4:04
మొత్తం నిడివి:
19:17

విడుదల[మార్చు]

ఈ చిత్రం 2020, జనవరి 31న సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదలయింది.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Choosi Choodangaane: Shiva Kandukuri's debut film to release on Jan 31". The Times of India. 2 January 2020. Retrieved 6 February 2020.
  2. "Raj Kandukuri's son Shiva makes his debut with Choosi Choodangaane". The Times of India. 4 August 2019. Retrieved 6 February 2020.
  3. "Shiva Kandukuri's character from 'Choosi Choodangaane'". The Times of India. 19 August 2019. Retrieved 6 February 2020.
  4. "Choosi Choodangaane is a triangle love story that has many layers underneath: Varsha Bollamma". The Times of India. 30 January 2020. Retrieved 6 February 2020.
  5. సాక్షి, సినిమా (31 January 2020). "'చూసీ చూడంగానే' మూవీ రివ్యూ". Archived from the original on 6 ఫిబ్రవరి 2020. Retrieved 7 February 2020.
  6. ఈనాడు, సినిమా (31 January 2020). "రివ్యూ: చూసీ చూడంగానే." Archived from the original on 6 ఫిబ్రవరి 2020. Retrieved 7 February 2020.
  7. "A listless narration, held afloat by an effervescent Varsha Bollamma". The Hindu. 1 February 2020. Retrieved 7 February 2020.
  8. "Choosi Choodangaane: Shoot of Shiva Kandukuri's debut film wraps up, post-production begins". The Times of India. 5 August 2019. Retrieved 6 February 2020.
  9. "Choosi Choodangaane Music Review". IndiaGlitz. 10 December 2019. Retrieved 6 February 2020.

ఇతర లంకెలు[మార్చు]