ద్వారక (2017 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ద్వారక
Dwaraka Movie Poster.jpg
ద్వారక సినిమా పోస్టర్
దర్శకత్వంశ్రీనివాస్ రవీంద్ర
కథా రచయితలక్ష్మీభూపాల్ (మాటలు)
నిర్మాతప్రద్యుమ్న చంద్రపాటి
గణేష్ పెనుబోతు
తారాగణంవిజయ్ దేవరకొండ, పూజ ఝవేరి, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, బలిరెడ్డి పృథ్వీరాజ్, రఘుబాబు, ప్రభాకర్ గౌడ్, కృష్ణభగవాన్‌, షకలక శంకర్, ఉత్తేజ్, నవీన్‌, గిరిధర్‌
ఛాయాగ్రహణంశ్యామ్ కె. నాయుడు
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంసాయి కార్తీక్
నిర్మాణ
సంస్థ
లెజెండ్ సినిమా
పంపిణీదారుసూపర్ గుడ్ ఫిల్స్మ్
విడుదల తేదీ
2017 మార్చి 3 (2017-03-03)
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్4 crore (US$5,60,000)
బాక్స్ ఆఫీసు20 crore (US$2.8 million)

ద్వారక 2017, మార్చి 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీనివాస రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, పూజ ఝవేరి, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, బలిరెడ్డి పృథ్వీరాజ్, రఘుబాబు, ప్రభాకర్ గౌడ్, కృష్ణభగవాన్‌, షకలక శంకర్, ఉత్తేజ్, నవీన్‌, గిరిధర్‌ ముఖ్యపాత్రలలో నటించగా, సాయి కార్తిక్ సంగీతం అందించారు.[1]

చిత్రకథ[మార్చు]

ఎర్ర శీను (విజయ్‌) ఒక చిల్లర దొంగ. అనుకోకుండా ఒక రోజున ఒక అపార్ట్‌మెంట్‌పై బాబా అయిపోతాడు. డబ్బులు బాగా వస్తాయని అతను కమిట్‌ అయిపోతే, అతనెవరో తెలిసిన వాళ్లు శ్రీనుని అడ్డం పెట్టుకుని బిజినెస్‌ చేస్తారు. అక్కడ్నుంచి పారిపోదాం అనుకుంటాడు కానీ తను ప్రేమించిన వసుధ (పూజ) కనిపించే సరికి అక్కడే వుండిపోతాడు. అయితే తనలాంటి మోసగాడిని ప్రేమించలేనని వసుధ చెప్పేసరికి తానొక దొంగనని ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పేస్తాడు. తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది, అతడి ప్రేమ ఏ విధంగా సుఖాంతమవుతుందనేది మిగతా కథ.[2]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • కథ, దర్శకత్వం: శ్రీనివాస రవీంద్ర
  • నిర్మాత: ప్రద్యుమ్న చంద్రపాటి, గణేష్ పెనుబోతు
  • మాటలు: లక్ష్మీభూపాల్
  • కూర్పు: ప్రవీణ్ పూడి
  • సంగీతం: సాయి కార్తీక్
  • ఛాయాగ్రహణం: శ్యామ్ కె. నాయుడు
  • నిర్మాణ సంస్థ: లెజెండ్ సినిమా
  • పంపిణీదారు: సూపర్ గుడ్ ఫిల్స్మ్

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "ద్వారక". telugu.filmibeat.com. Archived from the original on 10 మే 2017. Retrieved 12 March 2018.
  2. తెలుగు గ్రేట్ ఆంధ్ర, సినిమా రివ్యూ. "సినిమా రివ్యూ: ద్వారక". www.telugu.greatandhra.com. గణేష్‌ రావూరి. Archived from the original on 2 ఫిబ్రవరి 2018. Retrieved 12 March 2018.