నిహారిక రైజాదా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిహారిక రైజాదా
నిహారిక రైజాదా (2018)
జననం
నిహారిక కుమారి రైజాదా

(1990-04-18) 1990 ఏప్రిల్ 18 (వయసు 34)
జాతీయతలక్సెంబర్గిష్[1]
విద్యాసంస్థజాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం
ఇంపీరియల్ కళాశాల
న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2013–ప్రస్తుతం
బిరుదు
  • మిస్ ఇండియా యూకె 2010
  • మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ (2010) రన్నరప్‌
కుటుంబంఓపి నయ్యర్ (తాత)

నిహారిక రైజాదా (1990 ఏప్రిల్ 18)[2] లక్సెంబర్గిష్ సినిమా నటి.[1][3][4][5][6] బాలీవుడ్ సంగీత దర్శకుడు ఓపి నయ్యర్ మనవరాలు[7][8] అయిన నిహారిక 2010లో మిస్ ఇండియా యూకె కిరీటాన్ని పొందింది, 2010లో మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ (2010)లో రన్నరప్‌గా నిలిచింది.[9] మసాన్, 6-5=2, డమడోల్ [10][11] సినిమాలతోపాటు అజయ్ దేవగన్, అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్‌లతో కలిసి టోటల్ ధమాల్ [12] (2018) సినిమాలో నటించింది.

జీవిత విశేషాలు

[మార్చు]

నిహారిక 1990, ఏప్రిల్ 18న లక్సెంబర్గ్‌లో జన్మించింది. నిహారిక మాతృభాష ఫ్రెంచ్ అయినప్పటికి లక్సెంబర్గిష్, జర్మన్, ఇంగ్లీష్, స్పానిష్, హిందీ భాషలు కూడా మాట్లాడుతుంది.[2][13][14] నిహారికకు ఒక సోదరి నిరేఖ్నా రైజాదా, ఒక సోదరుడు అవనీష్ రైజాదా ఉన్నారు.[15] నిహారిక పరిశోధకురాలిగా,[16] ఇంపీరియల్ కాలేజ్ లండన్‌లో అనువాద వైద్యంలో ఎంఆర్ఈఎస్ చదివింది.[17] ఆ తరువాత ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్ కింద జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ (బాల్టిమోర్)లో కార్డియాలజీలో పరిశోధన చేసింది. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుండి నటనలో శిక్షణ కూడా పొందింది.[2] భారతీయ శాస్త్రీయ సంగీతం, బ్యాలెట్‌లో కూడా శిక్షణ తీసుకుంది.[2][13]

సినిమారంగం

[మార్చు]

నిహారిక 2013లో వచ్చిన డమడోల్‌ అనే బెంగాలీ సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించింది.[18] 2016లో గుజరాతీ చిత్రం వర్ టూ ఎన్నారై జె సినిమాలో నటించింది.[19] 2016లో నిహారిక కృష్ణ అభిషేక్‌తో కలిసి ఫుల్ 2 జుగాడు అనే సినిమాలో నటించింది.[20][21]

గుర్తింపులు

[మార్చు]
  1. 2010లో మిస్ ఇండియా యూకె కిరీటాన్ని గెలుపొందింది.[22]
  2. 2010లో మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ 2010లో మొదటి రన్నరప్‌గా కూడా నిలిచింది.[14]
  3. నిహారిక ఫ్రెంచ్‌లో ఛాంబర్ బ్రాండ్ కోసం ఒక పాటను విడుదల చేసింది.
  4. టైమ్స్ 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆఫ్ 2013 జాబితాలో 45వ స్థానంలో ఉన్న నిహారిక, 2015లో 44వ స్థానంలో నిలిచింది.[23]
  5. గ్రాండ్ డచీ ఆఫ్ లక్సెంబర్గ్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మధ్య గౌరవ సాంస్కృతిక, కళల అంబాసిడర్ గా నియమించబడింది.[13]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర వివరాలు
2013 డమడోల్ నర్తకి బెంగాలీ
2014 6-5=2 ప్రియా హిందీ
2015 మసాన్ ట్రావెలర్ గర్ల్ హిందీ
2015 ఎలోన్ అను హిందీ
2015 బేబీ రిపోర్టర్ హిందీ
2015 ఏక్ కలి హిందీ షార్ట్ ఫిల్మ్[24]
2016 వారియర్ సావిత్రి సావిత్రి హిందీ
2016 వర్ టూ ఎన్నారై జె తేజస్విని గుజరాతీ
2017 ద్వారక తెలుగు "అల్లబి అల్లాబి"[25] పాటలో ప్రత్యేక ప్రదర్శన
2019 ది పర్ఫెక్ట్ మర్డర్ కరోల్ హిందీ షార్ట్ ఫిల్మ్[26][27][28]
2019 టోటల్ ధమాల్ స్వప్న సుందరి హిందీ [29]
2021 సూర్యవంశీ ఇన్‌స్పెక్టర్ తారా మంచందాని హిందీ [30]
2021 హిమ్బీరెన్ మిట్ సేన్ఫ్ జంగే ఎహెఫ్రావ్ జర్మన్ [31]

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం వెబ్ సిరీస్ పాత్ర భాష మూలాలు
2021 కొయెట్స్ ఫ్రెంచ్ [31]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Bauldry, Jess (28 June 2018). "A Luxembourger in Bollywood". Delano.
  2. 2.0 2.1 2.2 2.3 "NIHARICA RAIZADA". Association des actrices et des acteurs du Luxembourg. Archived from the original on 2022-02-08. Retrieved 2022-03-31.
  3. Schulke, Sophia (21 December 2018). "Morgens Bollywood, nachmittags Forschung". Luxemburger Wort.
  4. Kugener, Jean Claude. "INDIA - LUXEMBOURG: VIBRANT INVESTMENT IN LONG TERM TIES" (PDF). Chambre de Commerce Luxembourg.
  5. "Niharica Raizada". Human Capital Europe. Archived from the original on 2022-02-07. Retrieved 2022-03-31.
  6. Gupta, Rachit (28 June 2018). "Actress Niharica Raizada's Luxembourg connection". The Times of India.
  7. "'Waarrior Savitri' gets a release date". The Times of India.
  8. "Niharica Raizada: It was not an easy job to trek". www.mid-day.com (in ఇంగ్లీష్). 14 November 2014. Retrieved 2022-03-31.
  9. "Miss India UK Niharica Raizada bags Madhuri Dixit, Ajay Devgn starrer Total Dhamaal". Deccan Chronicle (in ఇంగ్లీష్). 27 December 2017. Retrieved 2022-03-31.
  10. "She's no item girl!". Telegraph Indiaః.
  11. "OP Nayyar's granddaughter Niharica to act in a comedy film". The Times of India.
  12. Pauly, Serge (7 December 2018). "Mam Niharica Raizada, indesch Actrice mat Lëtzebuerger Wuerzelen". RTL Télé Lëtzebuerg.
  13. 13.0 13.1 13.2 Paknikar, Sheetal (23 January 2019). "Niharica Raizada has hearts beating from Luxembourg to India!". Openingdoorz.
  14. 14.0 14.1 Sharma, Garima (13 November 2014). "Niharica Raizada: I like to be in the limelight". The Times of India.
  15. "Niharika Raizada Biography". CrunchWood. Archived from the original on 2018-02-21. Retrieved 2022-03-31.
  16. "Musician O P Nayyar's cardiologist grand-daughter Niharica Raizada in an item number".
  17. "Page 21 Niharica Molecular Biosciences 2011 Postgraduate Awards" (PDF). Archived from the original (PDF) on 2016-08-17. Retrieved 2022-03-31.
  18. "Tollywood gets a new item girl". The Times of India.
  19. "Var To NRI J being shot in Vadodara". The Times of India.
  20. "कृष्णा और उनकी लीड एक्ट्रेस निहारिका रायजादा ने मीडिया से बातचीत की". Dainik Bhaskar.
  21. "Photos: Krushna Abhishek Starts Shooting for His Film Full2 Jugadu!". Dainik Bhaskar.
  22. "Is this the start to a new chapter in Shekar Kapur's life March 2010". Mid-day.
  23. "Deepika Padukone: 2013's Most desirable woman". The Times of India.
  24. Ek Kali - Short Film (HD) | Feat : Niharica Raizada, Hemant Somaiya, Aayan Shinde | YouTube (in ఇంగ్లీష్), retrieved 2022-03-31
  25. "Allabi Allabi|Niharica Raizada" YouTube.
  26. "'Doctoring' a perfect murder!". www.afternoondc.in. Archived from the original on 2022-05-04. Retrieved 2022-03-31.
  27. Quest Mercury (29 January 2019), The Perfect Murder - Crime Drama Short Film | YouTube, retrieved 2022-03-31
  28. TellyTalkIndia (28 January 2019), The Perfect Murder short film screening | Hiba Nawab, Rohan Gandotra, Niharica Raizada & more, retrieved 2022-03-31
  29. Hoover, Mashoor (18 January 2022). "All About Niharica Raizada". Retrieved 2022-03-31.
  30. "रोहित शेट्टी की फिल्म में नजर आएंगी निहारिका रायजादा?". mumbailive.com. 11 May 2019. Archived from the original on 11 May 2019. Retrieved 2022-03-31.
  31. 31.0 31.1 "DE LUXEMBOURG À BOLLYWOOD". PREMIUM. 23 February 2021.

బయటి లింకులు

[మార్చు]