సన్నాయి అప్పన్న
Appearance
సన్నాయి అప్పన్న (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | దీపక్ |
తారాగణం | శోభన్ బాబు, జయప్రద, నూతన్ ప్రసాద్ |
సంగీతం | జి.కె.వెంకటేష్ |
నిర్మాణ సంస్థ | రమణ చిత్ర |
భాష | తెలుగు |
ఈ చిత్రంలో సన్నాయికి బదులు షహనాయి వాద్యం వాడారు. ఈ సినిమా కన్నడ భాషలో 1977లో వచ్చిన సనాది అప్పణ్ణ అనే చిత్రానికి రీమేక్. కృష్ణమూర్తి పురనిక్ వ్రాసిన కన్నడ నవల "కుణియితు హెజ్జె నలియితు గజ్జె" ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది.
సాంకేతికవర్గం
[మార్చు]- నిర్మాతలు: రవి - హరి
- దర్శకత్వం, చిత్రానువాదం: దీపక్
- సంగీతం: జి.కె.వెంకటేష్
- మాటలు: పినిశెట్టి
- పాటలు: దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆత్రేయ, వేటూరి
- నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి
- ఛాయాగ్రహణం: జె.సత్యనారాయణ
- కళ: సోమనాథ్
- నృత్యం: ఉడిపి జయరాం, పసుమర్తి కృష్ణమూర్తి, నంబిరాజు
- కూర్పు: రవి
నటీనటులు
[మార్చు]- శోభన్ బాబు
- జయప్రద
- ఈశ్వరరావు
- సంగీత
- అల్లు రామలింగయ్య
- సూర్యకాంతం
- మాడా వెంకటేశ్వరరావు
- సాక్షి రంగారావు
- సత్యనారాయణ
- ప్రభాకరరెడ్డి
- నూతన్ ప్రసాద్
- ధూళిపాళ
- త్యాగరాజు
- పండరీబాయి
- చలం
- హేమసుందర్
- కొడాలి ఉమామహేశ్వరరావు
- కాకినాడ శ్యామల
- కవిత
- ఏచూరి
- బిస్మిల్లా ఖాన్
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలకు జి.కె.వెంకటేష్ సంగీతాన్ని సమకూర్చాడు.[1]
క్ర.సం | పాట | రచయిత | గాయకులు |
---|---|---|---|
1 | "అనురాగం దివ్యరాగం ఆనందం జీవనాదం" | ఆత్రేయ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
2 | "ఊయలూపి జోలపాడి ఒడిని దాచినా" | ఆత్రేయ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
3 | "సరిగమ పదనిస సనిదప మగరిస పద పద జయప్రద రావే పోదాం" | వీటూరి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
4 | "కరిగించు ఈ కలికి హృదయం కదిలించు నా కాలి గజ్జెల కడియం" | దేవులపల్లి కృష్ణశాస్త్రి | ఎస్.జానకి |
5 | "సన్నాయి రాగానికీ ఈ చిన్నారి నాట్యానికీ" | ఆత్రేయ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
6 | "అణువు అణువు హరివిల్లు అంతరంగమె వెన్నెల జల్లు" | వీటూరి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
మూలాలు
[మార్చు]- ↑ ఈశ్వర్. సన్నాయి అప్పన్న పాటలపుస్తకం. p. 8. Retrieved 17 August 2020.