ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య | |
---|---|
![]() | |
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
రచన | కోడి రామకృష్ణ (కథ, స్క్రీన్ ప్లే) గొల్లపూడి మారుతీరావు (సంభాషణలు) |
నిర్మాత | కె.రాఘవ |
నటవర్గం | చిరంజీవి, మాధవి, పూర్ణిమ |
సంగీతం | జె.వి.రాఘవులు |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీలు | 1982 ఏప్రిల్ 23[1] |
నిడివి | 2 గంటల 15 నిమిషాలు |
భాష | తెలుగు |
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య 1982 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో చిరంజీవి, మాధవి ప్రధాన పాత్రలు పోషించగా, ఇతర ముఖ్యపాత్రలలో పూర్ణిమ, పి. ఎల్. నారాయణ, గొల్లపూడి మారుతీ రావు, సంగీత తదితరులు నటించారు.[2] ఇది దర్శకుడిగా కోడి రామకృష్ణకు, నటుడిగా గొల్లపూడి మారుతీ రావుకు తొలిచిత్రం.[2] ఈ చిత్రాన్ని ప్రతాప్ ఆర్ట్స్ పతాకంపై కె. రాఘవ నిర్మించాడు.
1982 ఏప్రిల్ 22 న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించింది. దీన్నే తమిళంలో వీటుల రామన్ వెలియిల కృష్ణన్ పేరుతోనూ, కన్నడంలో మనెలి రామణ్ణ బీధీలి కామణ్ణ (1983), హిందీలో ఘర్ మే రాం గలీ మే శ్యామ్ పేరుతో పునర్నిర్మాణం చేశారు.[2]
కథ[మార్చు]
రాజశేఖరం ఒక సివిల్ ఇంజనీరు. ఓ పనిమీద పల్లెటూరికి వచ్చి జయలక్ష్మి (మాధవి) తో ప్రేమలో పడతాడు. వారిద్దరూ పెళ్ళి చేసుకుని నగరానికి వచ్చి కాపురం పెడతాడు. పైకి మంచి మాటలు మాట్లాడుతూ లోపల కుటిల ప్రవర్తన గల సుబ్బారావు జయలక్ష్మి మీద కన్నేస్తాడు. ఈ సమస్యలన్నింటికీ ఆ జంట ఎలా పరిష్కరించుకున్నారన్నదే ప్రధాన కథ.
తారాగణం[మార్చు]
- రాజశేఖరంగా చిరంజీవి
- జయలక్ష్మిగా మాధవి
- చిట్టితల్లిగా పూర్ణిమ
- సుబ్బారావుగా గొల్లపూడి మారుతీరావు
- సీతగా సంగీత
- జయలక్ష్మి తండ్రిగా పి. ఎల్. నారాయణ
ఫలితం[మార్చు]
ఈ చిత్రం 8 కేంద్రాల్లో 50 రోజులు, 2 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.[1]
పాటలు[మార్చు]
పాట | పాడినవారు | రచన |
---|---|---|
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య | బాలు | |
ఒక వనిత నవ ముదిత | బాలు | |
వచ్చే వచ్చే వయసు జల్లు | బాలు, పి.సుశీల | |
స్వామి శరణం అయ్యప్ప | ||
సీతారాముల ఆదర్శం | బాలు | |
పలికేది వేద మంత్రం |
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 "38 సంవత్సరాల 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య". సితార. Archived from the original on 2020-06-08. Retrieved 2020-06-08.
- ↑ 2.0 2.1 2.2 శ్రీ, అట్లూరి. "Intlo Ramayya Veedhilo Krishnayya (1982)". telugucinema.com. Archived from the original on 2007-01-04. Retrieved 18 అక్టోబరు 2016.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)