పూర్ణిమ (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


పూర్ణిమ
Poornima (Sudha).jpg
జననం
వృత్తినటి

పూర్ణిమ ఒక సినీ నటి. జంధ్యాల దర్శకత్వంలో 1981 లో వచ్చిన ముద్ద మందారం సినిమాతో సినీరంగంలో ప్రవేశించింది.[1] 1981 నుంచి 1988 మధ్యలో తెలుగు, తమిళ, కన్నడ సినిమాలతో కలిపి సుమారు 50 సినిమాల్లో నటించింది.[2]

జీవిత విశేషాలు[మార్చు]

పూర్ణిమ వాళ్ళది చెన్నైలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం.[2] పూర్ణిమకు చిన్నప్పటి నుంచి గాయని కావాలని కోరికగా ఉండేది. హరిశ్చంద్రుడు సినిమాలో పాట కోసం వెళ్ళి అనుకోకుండా అందులో చిన్న వేషం వేసింది. ఆ సినిమాలో మహానటి సావిత్రి కూతురుగా నటించింది. పూర్ణిమ తండ్రికి సినిమా రంగం అంటే ఇష్టం లేదు. కానీ జంధ్యాల తదితరులు తమ సినిమాల్లో అసభ్యతకు తావుండదని ధైర్యం చెప్పి ఆమెను ముద్దమందారం సినిమా కోసం ఒప్పించారు.[1]

21 సంవత్సరాల వయసులో వివాహం చేసుకుంది. పెళ్ళైన తరువాత ఆమె కుటుంబం కొద్ది రోజులు చెన్నైలో తరువాత కొద్దిరోజులు విశాఖపట్నంలో ఉన్నారు. ప్రస్తుతం గుజరాత్ లో ఉంటున్నారు.[2] ఆమె ఏప్రిల్ 2014 లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది.[3]

నటించిన సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 పులగం, చిన్నారాయణ. జంధ్యామారుతం 1 (ప్రథమ ed.). హాసం ప్రచురణలు. p. 13.
  2. 2.0 2.1 2.2 సునీత చౌదరి, వై. "She's back". thehindu.com. కస్తూరి అండ్ సన్స్. Retrieved 24 September 2016.
  3. Telugunow. "Actress Purnima joins YSRCP in Visakhapatnam 0". telugunow.com. Archived from the original on 7 June 2017. Retrieved 24 September 2016.