రీటా భాదురి
రీటా భాదురి রীতা ভাদুড়ি रीटा भादुड़ी | |
---|---|
జననం | |
మరణం | 2018 జూలై 17 | (వయసు 62)
వృత్తి | హిందీ చలనచిత్ర నటి, టెలివిజన్ నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1968–2018 |
రీటా భాదురి (బెంగాలీ:রীতা ভাদুড়ি}}, హిందీ: रीटा भादुड़ी) ఒక భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటి.[1] ఈమె 1970 - 90 లలో పలు బాలీవుడ్ సినిమాలలో సహాయనటిగా తన నటప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈమె "సావన్ కో ఆనే దో" (1979), "రాజా" (1995) వంటి సినిమాల ద్వారా ప్రసిద్ధి చెందింది. ఈ సినిమాలలో ఉత్తమ సహాయనటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు ఈమె పేరు ప్రతిపాదించబడింది.[2] 1975లో హిట్టయిన హిందీ సినిమా జూలీలో ఈమె జూలీ స్నేహితురాలిగా నటించింది. ఈ సినిమాలో "యే రాతే నయీ పురానీ" అనే పాట ఈమెపై చిత్రీకరించబడింది.
ఈమె 1973లో పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(FTII)లో శిక్షణ పొందింది. ఈమెతో పాటుగ శిక్షణ పొందినవారిలో జరీనా వహాబ్ కూడా ఉంది.[3] ఈమె "నిమ్కి ముఖియా" సీరియల్‌లో అవ్వ వేషం వేసింది.[4] ఈమె తన 62వ యేట ముంబయిలో మూత్రపిండాల వ్యాధికి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.[5]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]రీటా భాదురికి గుజరాతీ భాషతో సంబంధం లేక పోయినా ఈమె గుజరాతీ చలనచిత్ర పరిశ్రమలో విజయవంతమైన నటిగా రాణించింది.
సినిమాలు
[మార్చు]ఈమె 71 సినిమాలలో నటించింది.
- 2012 కెవి రితె జైష్ (ముసలావిడ)
- 2003 మై మాధురీ దీక్షిత్ బన్‌నా చాహ్తీ హూఁ (కళావతి)
- 2002 దిల్ విల్ ప్యార్ వ్యార్
- 2002 ములాఖాత్ (మిసెస్ పట్కర్)
- 2000 క్యా కెహనా (అజయ్ తల్లి)
- 1999 హోతే హోతే ప్యార్ హో గయా (ఆశా)
- 1998 జానే జిగర్ (మిసెస్ ప్రేమ్ కిషన్)
- 1997 తమన్నా (మదర్ సుపీరియర్)
- 1997 హీరో నెం.1 (మిసెస్ లక్ష్మీ వైద్యనాథ్)
- 1997 విరాసత్ (మౌసీ)
- 1996 ఖూన్ కి ప్యాసీ (పార్వతి)
- 1995 ఆతంక్ హీ ఆతంక్ (మిసెస్ శివచరణ్ శర్మ)
- 1995 డాన్స్ పార్టీ (మిసెస్ లజ్జో శర్మ)
- 1995 ఇంతెఖాం కె షోలే
- 1995 మా కీ మమత (శాంతి)
- 1995 రాజా (సరితా గరేవాల్)
- 1994 స్టంట్‌మాన్ (రీనా తల్లి)
- 1993 దలాల్ (మిసెస్ జూన్-జున్ వాలా)
- 1993 రంగ్ (మిసెస్ జోషి)
- 1993 గేమ్ (విక్రం తల్లి)
- 1993 ఆషిక్ ఆవారా (గాయత్రి)
- 1993 ఇన్సానియత్ కే దేవత (సుమిత్రాదేవి, రంజిత్ భార్య)
- 1993 అంత్ (ప్రియ తల్లి)
- 1993 కభీ హా కభీ నా (మేరి)
- 1992 యుధ్‌పథ్ (మిసెస్ చౌదరి)
- 1992 తిలక్
- 1992 అజీబ్ దస్తాన్ హై యే (స్కూల్ టీచర్)
- 1992 బేటా (నీతా)
- 1991 లవ్ (స్టెల్లా పింటో)
- 1991 హౌస్ నెం.13 (శాంతి)
- 1991 ఖూని పంజా
- 1991 ఆయీ మిలన్ కి రాత్
- 1990 తేరీ తలాష్ మే (శాంత డి.సంధు)
- 1990 ఘర్ తో ఐసా (కంచన్)
- 1990 జంగిల్ లవ్ (రాణి తల్లి)
- 1990 నెహ్రూ: ది జువెల్ ఆఫ్ ఇండియా
- 1990 నయా ఖూన్ (సప్న శ్రీవాత్సవ్)
- 1989 సిందూర్ ఔర్ బందూక్
- 1988 రామా ఓ రామా (మోను తల్లి)
- 1988 ఘర్ మే రామ్ గలీ మే శ్యామ్ (మిసెస్ ధరంచంద్)
- 1987 దిల్‌జలా (మరణించిన శిశువు తల్లి)
- 1986 మై బలవాన్ (గీత, టోనీ తల్లి)
- 1985 ఫూలన్ దేవి (ఫూలన్)
- 1984 మాయాబజార్ (సురేఖ)
- 1983 నాస్తిక్ (శాంతి)
- 1982 బే జుబాన్ (రేవతి/మీరాబాయి)
- 1982 చల్తీ కా నామ్ జిందగీ
- 1981 వో ఫిర్ నహీ ఆయె (రీటా బాధురి)
- 1981 జగ్య త్యాథి సవార్
- 1981 గర్వి నార్ గుజరాతన్
- 1980 గెహ్రాయీ (చెన్ని)
- 1980 ఉన్నీస్-బీస్
- 1980 హమ్ నహీ సుధెరెంగె
- 1980 ఖంజర్
- 1979 రాధ ఔర్ సీత (రాధ ఎస్.సక్సేనా)
- 1979 గోపాల్ కృష్ణ (యశోద)
- 1979 నాగిన్ ఔర్ సుహాగన్ (గౌరి జె.సింగ్/కమల)
- 1979 సావన్ కో ఆనే దో (గీతాంజలి)
- 1979 కాషినొ డిక్రో (రమ)
- 1978 కాలేజ్ గర్ల్
- 1978 విశ్వనాథ్ (మున్నీ)
- 1978 ఖూన్ కి పుకార్ (రాణి)
- 1977 అయినా (పూర్ణ ఆర్.శాస్త్రి)
- 1977 దిన్ అమదర్
- 1977 కుల్‌వధు
- 1977 అనురోధ్ (అంజు)
- 1976 ఉధార్ కా సిందూర్ (సుధ - ప్రేమనాథ్ సోదరి)
- 1975 జూలీ (ఉషా భట్టాచార్య)
- 1974 కన్యాకుమారి
- 1968 తేరీ తలాష్ మే
టెలివిజన్
[మార్చు]పేరు | పాత్ర | ఛానల్ |
---|---|---|
బన్తే బిగాడ్తే | దులారీ | దూరదర్శన్ |
మంజిల్ | మౌసీ | దూరదర్శన్ |
నిమ్కి ముఖియా | దాది | స్టార్ భారత్ |
కాజల్ | బిమ్మో బువా | సోని టివి |
సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ | ఇలా బెన్ మధుసూదన్ | స్టార్ వన్ |
కోయీ దిల్ మే హై | ఆశా తల్లి | సోని టివి |
జమీన్ ఆస్మాన్ | షన్నో | |
గిరిజా దేవి | ఇల్లాలు | జీ టివి |
హద్ కర్ ది | కిరణ్/బీజి | జీ టివి |
సాస్ వర్సెస్ బహు | రీటా బాధురి | సహారా వన్ |
హమ్ సబ్ బరాతి | జీ టివి | |
ఏక్ మహల్ హో సప్నో కా | ఫయిబా | సోని టివి |
థోడా హై థోడేకి జరూరత్ హై | సోని టివి | |
అమానత్ | గాయత్రి కపూర్ | జీ టివి |
గృహలక్ష్మి కా జిన్ | గృహలక్ష్మి | జీ టివి (1994–97) |
గోపాల్‌జీ | రుక్మిణి | జీ టివి (1996) |
ఛోటీ బహూ | శాంతిదేవి పురోహిత్ | జీ టివి |
హస్రతేఁ | సావి అత్త | జీ టివి |
ముజ్రిమ్ హాజిర్ | దూరదర్శన్ | |
కుంకుం | రాజేశ్వరీ వాధ్వా | స్టార్ ప్లస్ |
కిచిడి | హేమలత | స్టార్ ప్లస్ |
బైబిల్ కి కహానియా | డెబొరా | డిడి నేషనల్ |
భాగోవాలి బన్తే అప్నీ తక్దీర్ | అహల్యాదేవి | జీ టివి |
రిష్తే | జీ టివి | |
కృష్ణబెన్ ఖక్రవాలా | సంతు బా | సోని టివి |
చునౌతి | డిడి నేషనల్ | |
మిసెస్ కౌశిక్ కి పాంచ్ బహూయే | నాని | జీ టివి |
బనీ - ఇష్క్ దా కల్మ | బిజి | కలర్స్, రిస్తే |
ఆజ్ కి హౌస్‌వైఫ్ హై... సబ్ జాన్తీ హై | సోనా అమ్మమ్మ | జీ టివి |
ఏక్ నయీ పెహచాన్ | దాదీ మా | సోని టివి |
మోహి | వినయ్ తల్లి | స్టార్ ప్లస్ |
జోష్ ఔర్ శక్తి... జీవన్ కే ఖేల్ | సుమన్ వాలియా | జీ టివి |
మూలాలు
[మార్చు]- ↑ "I'm still learning as an actor: Rita Bhaduri".
- ↑ "Filmfare Nominees and Winners" (PDF). Archived from the original (PDF) on 2009-06-12. Retrieved 2018-07-17.
- ↑ "First batch looks back at good old days TNN,". The Times of India. 21 March 2010. Archived from the original on 2012-07-14. Retrieved 2018-07-17.
- ↑ "I play an aggressive beta in my current show shot in Mirzapur: Bareilly actor Jatin Suri".
- ↑ "Veteran Actress Rita Bhaduri Dies At 62". NDTV. 17 July 2018.