జరీనా వహాబ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జరీనా వహాబ్
జననం (1959-07-17) 1959 జూలై 17 (వయసు 64)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1974– ఇప్పటి వరకు
జీవిత భాగస్వామిఆదిత్య పంచోలి
పిల్లలుసూరజ్ పంచోలి
సన పంచోలి

జరీనా వహాబ్ ఒక భారతీయ నటి. ఈమె 1970వ దశకంలో పలు సినిమాలలో ప్రధాన పాత్రలు ధరించింది. ఈమె హిందీ, తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల చలనచిత్రాలలో నటించింది.

ప్రారంభ జీవితం

[మార్చు]

జరీనా వహాబ్ విశాఖపట్టణంలోని ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఈమెకు మాతృభాష తెలుగు[1] తో పాటు ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషలలో ప్రావీణ్యం ఉంది. ఈమె పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(FTII)లో శిక్షణ పొందింది.[2] ఈమెకు ముగ్గురు సోదరీమణులు ఒక సోదరుడు ఉన్నారు.

వృత్తి

[మార్చు]

ఈమె సినిమాలకు పనికిరాదని సినిమా నిర్మాత రాజ్ కపూర్ తిరస్కరించగా ఈమె పట్టుదలతో తన ఆహార్యంపై దృష్టిపెట్టి మెరుగులు దిద్దుకుని సినిమా పార్టీలకు, కార్యక్రమాలకు హాజరయ్యింది. దానితో ఈమె పలువురి దృష్టిలో పడి సినిమా అవకాశాలు దక్కించుకుంది. ఈమె సాధారణంగా మధ్యతరగతి పాత్రలలో నటించేది. ఈమె 1976లో విడుదలైన "చిత్ చోర్" సినిమాలో నటించింది. ఇదే కాకుండా అమోల్ పాలేకర్ నటించిన "అగర్", రాజ్ బబ్బర్‌తో "జజ్‌బాత్", అరుణ్ గోవిల్‌తో "సావన్ కో ఆనే దో" విక్రంతో "రయీస్ జాదా" మొదలైన సినిమాలలో నటించింది. 1977లో విడుదలైన "ఘరండా" చిత్రంలో నటనకు ఈమె ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేట్ అయ్యింది.[3] ఈమె హిందీ సినిమాలలోనే కాక మళయాల, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో కూడా నటించింది. ఈమె మళయాల చిత్రం క్యాలెండర్ (2009)తో నటిగా పునః ప్రవేశం చేసింది.[4] "మై నేమ్ ఈజ్ ఖాన్" చిత్రంలో షారూఖ్ ఖాన్ తల్లి పాత్రలో దర్శనమిచ్చింది.[5]

జరీనా వహాబ్ ప్రస్తుతం హిందీ టెలివిజన్ సీరియళ్లలో వయసు మళ్లిన పాత్రలలో నటిస్తున్నది.[6]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

జరీనా సినీనటుడు ఆదిత్య పంచోలిని "కళంక్ కా టీకా" అనే సినిమా సెట్లో కలుసుకుంది.[7] పంచోలి ఈమె కన్నా 6 సంవత్సరాలు పిన్నవయస్కుడు. 1986లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి సన అనే కూతురు, సురజ్ అనే కొడుకు కలిగారు.[8][9] వీరి సంతానం ఇరువురూ నటీనటులే.

నట జీవితం

[మార్చు]

ఈమె సుమారు 60 హిందీ సినిమాలలో నటించింది. ఈమె నటించిన తెలుగు సినిమాల జాబితా:

సంవత్సరం సినిమా పేరు పాత్ర
1975 గాజుల కిష్టయ్య
1978 అమర ప్రేమ జయమాల
1980 హేమాహేమీలు
2010 రక్త చరిత్ర జయలక్ష్మి
2013 విశ్వరూపం సైకియాట్రిస్ట్
2021 విరాట పర్వం
2022 దసరా

టెలివిజన్

[మార్చు]

ఈమె అనేక టెలివిజన్ సీరియళ్లలో నటించింది. వాటిలో "క్యోంకి సాస్ భీ కభీ బహూ థీ", "మధుబాల ఏక్ ఇష్క్ ఏక్ జునూన్", "ఏక్ కిరణ్ రోష్నీ కీ","ఎఫ్.ఐ.ఆర్.", "మేరీ ఆవాజ్ హీ పెహచాన్ హై" మొదలైన ప్రజాబాహుళ్యమైన సీరియళ్లు ఉన్నాయి.

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]
 • 2011 "మై నేమ్‌ ఈజ్ ఖాన్" చిత్రంలోని పాత్రకు గ్లోబల్ ఇండియన్ ఫిలిం అండ్ టెలివిజన్ వారి ఉత్తమ సహాయ పాత్ర పురస్కారం.
 • 2011 "రక్త చరిత్ర" స్క్రీన్ అవార్డుకు ఉత్తమ సహాయనటి కేటగరీలో నామినేషన్
 • 2011 "మై నేమ్‌ ఈజ్ ఖాన్", "రక్త చరిత్ర" సినిమాలలోని నటనకు స్టార్ డస్ట్ అవార్డుకు ఉత్తమ సహాయనటి కేటగరీలో నామినేషన్
 • 1977 "ఘరోండ" చిత్రంలో నటనకు ఫిలింఫేర్ అవార్డుకు ఉత్తమ నటి కేటగరీలో నామినేషన్

మూలాలు

[మార్చు]
 1. "Inspiring story of Zarina Wahab: Wonder Woman - Who are you today?". intoday.in. Archived from the original on 22 ఫిబ్రవరి 2015. Retrieved 22 February 2015.
 2. "First batch looks back at good old days TNN,". The Times of India. 2010-03-21.
 3. 1st Filmfare Awards 1953 Archived 2009-06-12 at the Wayback Machine. Deep750.googlepages.com. Retrieved on 2012-09-29.
 4. "Profile of Malayalam Actor Zarina Wahab". En.msidb.org. 2009-01-26. Retrieved 2015-12-23.
 5. Another Addition to the Cast of My Name Is Khan Archived 11 ఫిబ్రవరి 2010 at the Wayback Machine
 6. The Sunday Tribune – Spectrum – Television. Tribuneindia.com (2004-02-08). Retrieved on 2012-09-29.
 7. The Tribune, Chandigarh, India – Chandigarh Stories. Tribuneindia.com (2003-10-30). Retrieved on 2012-09-29.
 8. Adityas rishta with Kangana Archived 20 జూలై 2011 at the Wayback Machine. Entertainment.oneindia.in (2006-05-03). Retrieved on 2012-09-29.
 9. DNA – After Hrs – ‘I have a short memory for bad things’ – Daily News & Analysis. Dnaindia.com (2006-07-03). Retrieved on 2012-09-29.

బయటి లింకులు

[మార్చు]