Jump to content

దసరా (2023 సినిమా)

వికీపీడియా నుండి
(దసరా (2022 సినిమా) నుండి దారిమార్పు చెందింది)
దసరా
దర్శకత్వంశ్రీకాంత్ ఓదెల
రచనశ్రీకాంత్ ఓదెల
నిర్మాతసుధాకర్ చెరుకూరి
తారాగణం
ఛాయాగ్రహణంసత్యన్ సూర్యన్
కూర్పునవీన్ నూలి
సంగీతంసంతోష్ నారాయణన్
నిర్మాణ
సంస్థ
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
విడుదల తేదీs
30 మార్చి 2023 (2023-03-30)(థియేటర్)
27 ఏప్రిల్ 2023 (2023-04-27)(నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో)
సినిమా నిడివి
2 గంటల 36 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

దసరా 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, కీర్తి సురేష్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 14న విడుదల చేసి[2] సినిమాను మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన[3], ఈ సినిమా ఏప్రిల్ 27 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.[4]

దసరా సాధారణంగా విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. ఈ చిత్రం 7 ఏప్రిల్ 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా ₹100 కోట్లు రాబట్టింది, తద్వారా 2023లో అత్యధిక వసూళ్లు చేసిన ఎనిమిదో భారతీయ చిత్రంగా నిలిచింది.[5]

ఈ సినిమాకు ఐఫా 2024లో ఉత్తమ తెలుగు సినిమాగా అవార్డు దక్కింది.[6]

చిత్ర నిర్మాణం

[మార్చు]

దసరా సినిమా షూటింగ్ 2022 ఫిబ్రవరి 16న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.[7] గోదావరిఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని లుక్‌ని 2022 మార్చి 20న విడుదల చేశారు.[8] ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో రూ.12 కోట్లతో ఓ పల్లెటూరు సెట్ వేశారు.[9]

వీర్లపల్లి గ్రామంలో ఉండే ధరణి (నాని), సూరి (దీక్షిత్ శెట్టి) , వెన్నెల (కీర్తి సురేష్) ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. వెన్నెల (కీర్తి సురేష్) గ్రామంలోని అంగన్ వాడి టీచర్‌గా పని చేస్తూ ఉంటుంది. వెన్నెలని ధరణి ప్రేమిస్తాడు, కానీ సూరి వెన్నెలని ప్రేమిస్తున్నాడన్న విషయం తెలిసి స్నేహితుడి కోసం తన ప్రేమని త్యాగం చేసి సూరికి, వెన్నెలకి పెళ్లి అయేట్టు చేస్తాడు. వెన్నెల‌ను పెళ్లిచేసుకున్న రోజే సూరిని గుర్తు తెలియని ఆగంతకులు చేతిలో దారుణంగా హ‌త్య‌కు గుర‌వుతాడు? అసలు ఈ హత్య చేసిందెవరు ? వారిని ధరణి (నాని) ఎలా కనిపెట్టి వారిని శిక్షించాడు అనేదే మిగతా సినిమా కథ.[10]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
  • నిర్మాత: సుధాకర్ చెరుకూరి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల[16][17]
  • సంగీతం: సంతోష్ నారాయణన్
  • సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
  • ఎడిటింగ్‌: నవీన్ నూలి
  • ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ చాగంటి
  • ప్రొడక్షన్‌ డిజైనర్‌‌: అవినాష్‌ కొల్లా
  • స్టాంట్స్: రియల్ సతీష్, అంబరీవ్
  • మాటలు: తోట శ్రీనివాస్
  • పాటలు: కాసర్ల శ్యామ్, శ్రీమణి, రెహమాన్, గడ్డం సురేష్
  • కొరియోగ్రాఫర్: ప్రేమ్ రక్షిత్, ఈశ్వర్ పేంటీ

పాటలు

[మార్చు]
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "ధూమ్ ధామ్ దోస్తాన్"  రాహుల్ సిప్లిగంజ్, గొట్టే కనకవ్వ, గన్నోరా దాస లక్ష్మి, పాలమూరు జంగిరెడ్డి, నర్సన్న (నల్గొండ గద్దర్), కాసర్ల శ్యామ్ 4:02
2. "ఓరి వారి"  సంతోష్ నారాయణన్ 3:34
3. "ఛమ్‌కీలా అంగీలేసి ఓ వదినే"  రామ్ మిరియాల, ధీ 3:23

అవార్డ్స్

[మార్చు]
అవార్డు వేడుక తేదీ విభాగం స్వీకర్త(లు) ఫలితం మూ
ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ 3 ఆగస్టు 2024 ఉత్తమ చిత్రం - తెలుగు సుధాకర్ చెరుకూరి నామినేట్ చేయబడింది [18][19][20]
ఉత్తమ దర్శకుడు - తెలుగు శ్రీకాంత్ ఓదెల నామినేట్ చేయబడింది
ఉత్తమ నటుడు - తెలుగు నాని గెలుపు
ఉత్తమ నటి - తెలుగు కీర్తి సురేష్ గెలుపు
ఉత్తమ సహాయ నటుడు - తెలుగు దీక్షిత్ శెట్టి నామినేట్ చేయబడింది
ఉత్తమ సంగీత దర్శకుడు - తెలుగు సంతోష్ నారాయణన్ నామినేట్ చేయబడింది
ఉత్తమ గీత రచయిత - తెలుగు కాసర్ల శ్యామ్ ("చమకీలా ఏంజిలేసి") నామినేట్ చేయబడింది
ఉత్తమ నేపథ్య గాయని - తెలుగు ఢీ ("చమ్కీలా ఏంజిలేసి") నామినేట్ చేయబడింది
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ గెలుపు
ఉత్తమ కొరియోగ్రఫీ ప్రేమ్ రక్షిత్ ("ధూమ్ ధామ్ ధోస్తాన్") గెలుపు
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ కొల్లా అవినాష్ గెలుపు
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల గెలుపు
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 14 సెప్టెంబరు 2024 ఉత్తమ చిత్రం - తెలుగు సుధాకర్ చెరుకూరి నామినేట్ చేయబడింది [21][22]
ఉత్తమ దర్శకుడు - తెలుగు శ్రీకాంత్ ఓదెల గెలుపు
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - తెలుగు సత్యన్ సూర్యన్ నామినేట్ చేయబడింది
ఉత్తమ నటుడు నాని గెలుపు
ఉత్తమ నటి - తెలుగు కీర్తి సురేష్ గెలుపు
ఉత్తమ సహాయ నటుడు - తెలుగు దీక్షిత్ శెట్టి గెలుపు
ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడు - తెలుగు షైన్ టామ్ చాకో నామినేట్ చేయబడింది
ఉత్తమ నూతన దర్శకుడు - తెలుగు శ్రీకాంత్ ఓదెల నామినేట్ చేయబడింది
ఉత్తమ సంగీత దర్శకుడు - తెలుగు సంతోష్ నారాయణన్ నామినేట్ చేయబడింది
ఉత్తమ గీత రచయిత - తెలుగు శ్రీ మణి ("ఓరి వారి") నామినేట్ చేయబడింది
ఉత్తమ నేపథ్య గాయని - తెలుగు ఢీ ("చమ్కీలా ఏంజిలేసి") నామినేట్ చేయబడింది

మూలాలు

[మార్చు]
  1. Andhra Jyothy (17 March 2023). "'దసరా' సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే..?". Archived from the original on 18 March 2023. Retrieved 18 March 2023.
  2. Namasthe Telangana (14 March 2023). "యెట్లైతే గట్లాయె సూస్కుందాం.. ఊర మాస్‌గా నాని దసరా ట్రైలర్‌". Archived from the original on 14 March 2023. Retrieved 14 March 2023.
  3. Andhra Jyothy (14 January 2023). "స్కూటర్‌ పై వన్నెలాడి". Archived from the original on 14 January 2023. Retrieved 14 January 2023.
  4. Prime9 (20 April 2023). "ఓటీటీలో 'ధూం ధాం' చేయనున్న దసరా". Archived from the original on 25 April 2023. Retrieved 25 April 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "Dasara (దసరా) Telugu Movie All Details". FilmiBug. 28 August 2022. Archived from the original on 28 నవంబరు 2022. Retrieved 26 August 2022. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  6. Chitrajyothy (28 September 2024). "IFFA 2004: ఘనంగా ఐఫా వేడుకలు.. విజేతలు వీరే". Archived from the original on 28 September 2024. Retrieved 28 September 2024.
  7. 10TV (16 February 2022). "నాని 'దసరా' మొదలైంది." (in telugu). Archived from the original on 30 March 2022. Retrieved 30 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  8. Prabha News (20 March 2022). "'ద‌స‌రా' మూవీ ఫ‌స్ట్ లుక్ - ఊర‌మాస్ గా నాని". Archived from the original on 30 March 2022. Retrieved 30 March 2022.
  9. A. B. P. Desam (25 January 2022). "నాని సినిమా సెట్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా..?" (in ఇంగ్లీష్). Archived from the original on 30 March 2022. Retrieved 30 March 2022.
  10. Eenadu (25 April 2023). "రివ్యూ: 'దసరా'.. నాని సినిమా ఎలా ఉందంటే?". Archived from the original on 25 April 2023. Retrieved 25 April 2023.
  11. Namasthe Telangana (8 August 2022). "'దసరా' చిత్రంలో నాని". Archived from the original on 8 August 2022. Retrieved 8 August 2022.
  12. Hindustantimes Telugu, Nelki Naresh (17 October 2022). "పెళ్లి కూతురు గెట‌ప్‌లో కీర్తిసురేష్ -ద‌స‌రా ఫ‌స్ట్‌లుక్ రిలీజ్‌". Archived from the original on 17 October 2022. Retrieved 17 October 2022.
  13. Namasthe Telangana (12 March 2023). "తెలంగాణ యాస నేర్చుకున్నా!". Archived from the original on 12 March 2023. Retrieved 12 March 2023.
  14. Andhra Jyothy (12 March 2023). "'దసరా'తో నా కెరీర్‌ మలుపు తిరిగింది". Archived from the original on 12 March 2023. Retrieved 12 March 2023.
  15. "Nani's Next Telugu Film With Director Srikanth Odela Titled 'Dasara'". FilmiBug. 23 March 2023. Archived from the original on 28 నవంబరు 2022. Retrieved 23 March 2022. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  16. Eenadu (30 April 2023). "స్నేహితులు దిద్దిన జీవితం నాది". Archived from the original on 7 May 2023. Retrieved 7 May 2023.
  17. Eenadu (7 May 2023). "ఆయనతో ప్రయాణమే... ఓ పాఠం". Archived from the original on 7 May 2023. Retrieved 7 May 2023.
  18. "Nominations for Filmfare Awards Telugu 2024 are out!". Filmfare (in ఇంగ్లీష్). Retrieved 2024-07-17.
  19. Filmfare (4 August 2024). "Full list of Winners of the 69th SOBHA Filmfare Awards South (Telugu) 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 4 August 2024. Retrieved 4 August 2024.
  20. The Times of India (4 August 2024). "69th Sobha Filmfare Awards South 2024: Check out the winners". Archived from the original on 4 August 2024. Retrieved 4 August 2024.
  21. Bharat, E. T. V. (2024-07-17). "SIIMA 2024 Nominations Revealed: Nani's Dasara and Rajinikanth Starrer Jailer Lead with 11 Nominations Each". ETV Bharat News (in ఇంగ్లీష్). Retrieved 2024-07-21.
  22. "SIIMA Awards 2024: Dasara, Hi Nanna, Kaatera and Sapta Sagaradaache Ello win big on Day 1". The Indian Express (in ఇంగ్లీష్). 15 September 2024. Retrieved 15 September 2024.