ఎందుకో ఏమో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎందుకో ఏమో
దర్శకత్వంకోటి వద్దినేని
కథకోటి వద్దినేని
నిర్మాతమాలతి వద్దినేని
తారాగణంనందు
పునర్నవి భూపాలం
నోయెల్ సీన్
ఛాయాగ్రహణంజియస్‌ రాజ్‌
సంగీతంప్రవీణ్‌
నిర్మాణ
సంస్థ
మహేశ్వర క్రియేషన్స్‌
విడుదల తేదీ
12 సెప్టెంబర్ 2018 [1]
సినిమా నిడివి
134 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

ఎందుకో ఏమో 2018లో విడుదలైన తెలుగు సినిమా. మహేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై మాలతి వద్దినేని నిర్మించిన ఈ చిత్రానికి కోటి వద్దినేని దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నందు , నోయెల్ సీన్, పునర్నవి భూపాలం ముఖ్య పాత్రల్లో నటించారు.[2][3]

కార్తిక్ (నందు ) సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తూ తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని ఆశపడుతాడు. నందు ఉంటున్న అపార్ట్ మెంట్ లోకి హారిక (పునర్న‌వి భూపాలం) కూడా అద్దెకు దిగుతుంది. నందు ప‌ని చేసే సాఫ్ట్ వేర్ కంపెనీలోనే హారిక కూడా జాబ్ జాయిన్ అవుతుంది. ఆఫీసులో వారి ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారుతుంది. ఒక చిన్న సంఘటనతో కార్తీక్ ను అపార్థం చేసుకొని హారిక అతని మీద కోపం పెంచుకుంటుంది. కొన్నాళ్లకు కార్తీక్ మనుసు తెలుసుకొని హారిక ప్రేమించడం మొదలు పెడతుంది. కార్తీక్, హారిక పెళ్లి చేసుకుందామని అనుకొనేలోపు వాళ్ళిద్దరి కార్తీక్ చిన్ననాటి మిత్రుడు ప్రిన్స్ (నోయల్) వస్తాడు. పునర్న‌విని చూసిన ప్రిన్స్ ఆమెపై మోజుప‌డ‌తాడు. కార్తీక్ ను రెచ్చగొట్టి హరికను నెలరోజుల్లో ప్రేమలో దించుతా అంటూ కార్తీక్ తో ప్రిన్స్ పందెం కాస్తాడు. మ‌రి ఆ పందెంలో ఎవ‌రు గెలిచారు? మరి ప్రిన్స్ అనుకున్నట్టుగా హారికను దక్కించుకున్నాడా? అనేదే మిగితా కథ.

న‌టీన‌టులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • నిర్మాత: మాలతి వద్దినేని [4]
  • కథ-స్క్రీన్‌ ప్లే-దర్శకత్వం: కోటి వద్దినేని [5]
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గొల్లపూడి గౌరీశంకర్ రావు
  • సంగీతం: ఎం.జి.కె. ప్రవీణ్‌
  • కెమెరా: జియస్‌ రాజ్‌
  • ఎడిటింగ్‌: మధు
  • ఆర్ట్‌: వర్మ
  • ఫైట్స్‌: డ్రాగన్‌ ప్రకాష్‌

మూలాలు

[మార్చు]
  1. The Times of India (3 September 2018). "'Enduko Emo' is all set to release on the occasion of Vinayaka Chaturthi - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 9 జూన్ 2021. Retrieved 9 June 2021.
  2. Sakshi (2 September 2018). "ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ!". Sakshi. Archived from the original on 9 జూన్ 2021. Retrieved 9 June 2021.
  3. Vaartha (29 January 2018). "ఎందుకో ఏమో". Archived from the original on 9 జూన్ 2021. Retrieved 9 June 2021.
  4. Sakshi (9 September 2018). "ముగ్గురి ప్రేమ". Sakshi. Archived from the original on 9 జూన్ 2021. Retrieved 9 June 2021.
  5. Sakshi (30 January 2018). "పేరు.. డబ్బులు రావాలి – వినాయక్‌". Sakshi. Archived from the original on 9 జూన్ 2021. Retrieved 9 June 2021.