విధాత తలపున ప్రభవించినది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"విధాత తలపున ప్రభవించినది"
Vidhatha Thalapuna.jpg
విధాత తలపున ప్రభవించినది పాటలోని దృశ్యం
రచయితసిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతంకె.వి.మహదేవన్
సాహిత్యంసిరివెన్నెల సీతారామశాస్త్రి
ప్రచురణసిరివెన్నెల (1986)
రచింపబడిన ప్రాంతంఆంధ్రప్రదేశ్
భాషతెలుగు
గాయకుడు/గాయనిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

విధాత తలపున ప్రభవించినది పాట 1986లో విడుదలైన సిరివెన్నెల చిత్రంలోని పాట. ఈ పాట రాసినందుకు సిరివెన్నెల సీతారామశాస్త్రి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. కె.వి.మహదేవన్ సంగీతం అందించిన ఈ పాటను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల పాడారు.[1]

పాటలోని సాహిత్యం[మార్చు]

పల్లవి:
విధాత తలపున, ప్రభవించినది, అనాది జీవనవేదం, ఓం...
ప్రాణనాడులకి స్పందననొసగిన ఆది ప్రణవనాదం, ఓం ...
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
యదకనుమలలో, ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం ...
సరసస్వర సురఝరీ గమనమౌ, సామ వేద సారమిది ||2||

నే పాడిన జీవన గీతం, ఈ గీతం ..
విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం

చరణం 1:
ప్రాగ్దిశ వేణియపైన దినకర మయూఖతంత్రుల పైన,
జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన ||2||

పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగ, విశ్వ కావ్యమునకిది భాష్యముగా..
విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం

అర్థాలు[మార్చు]

విధాత = బ్రహ్మ, సృష్టికర్త యొక్క

తలపున = ఊహలో

ప్రభవించినది = మెరిసినది

అనాది = మొదలు లేని

జీవన వేదం = ఈ సృష్టికి మూలమైన వేదం (సృష్టే వేదం, వేదమే సృష్టి)

ప్రాణ నాడులకు = మనలో ప్రాణానికి మూలమైన నాడుల్లో

స్పందన నొసగిన = ఆ ప్రాణాన్ని తట్టి లేపిన

ఆది ప్రణవ నాదం = తొలి ఓంకారము

కనుల కొలనులో = కళ్ళే కొలనులు అయితే

ప్రతిబింబించిన = ఆ కొలనులో ప్రతిబింబించిన

విశ్వరూప విన్యాసం = ఈ సృష్టి యొక్క రూప ఆవిష్కరణ

ఎద కనుమలలో = గుండె అనే పర్వత శ్రేణిలో

ప్రతిధ్వనించిన = మారుమ్రోగిన

విరించి = బ్రహ్మ యొక్క

విపంచి = వీణ

గానం = సంగీతం

సరస = రసముతో కూడిన ( నవరసాల రసం )

స్వర = సంగీత స్వరం (స, రి గ)

సురఝరీ = దేవనది, గంగ

గమనమౌ = ప్రవాహము ఐనట్టి

సామవేద సారమిది = సామవేదం యొక్క సారాంశం ఇది

నే పాడిన జీవన గీతం ఈ గీతం = నే పాడిన ఈ పాట జీవిత గీతం

విరించినై = నేనే బ్రహ్మనై

విరచించితిని = రచించితిని

ఈ కవనం = ఈ కవిత్వం

విపంచినై = వీణనై

వినిపించితిని = వినిపిస్తున్నా

ఈ గీతం - ఈ పాట

ప్రాగ్దిశ వీణియ పైన = తూర్పు దిక్కు అనే వీణ మీద

దినకర మయూఖ తంత్రుల పైన = సూర్యకిరణాలనే తీగలు మీటుతూ

జాగృత విహంగ తతులే += నిద్రలేచిన పక్షి గుంపులు

వినీల గగనపు వేదిక పైన = నీలాకాశం అనే స్టేజి మీద

పలికిన కిలకిల స్వనముల = పలికిన కిల కిల ధ్వనులు

స్వరజతి = స్వరముల అమరిక, కృతి కీర్తన జావళి లాగా ఇది కూడా ఒక లాంటి పాట

జగతికి = ప్రపంచానికి, విశ్వానికి

శ్రీకారము కాగా = మొదలు కాగా

విశ్వకావ్యమునకి = విశ్వమనే కావ్యానికి

ఇది భాష్యముగా = వివరణగా

జనించు = పుట్టిన

ప్రతి శిశు గళమున పలికిన = ప్రతి శిశువు గొంతున పలికిన

జీవన నాథ తరంగం = జీవితమనే ధ్వనికెరటం, అల

చేతన = చైతన్యం, అచ్తివషన్

స్పందన = reverberation, రేసోనన్స్

ధ్వనించు = శబ్దం

హృదయ మృదంగ ధ్వానం - హృదయం మృదంగం వలె ధ్వనిస్తుంది.

అనాది = మొదలు లేని, చాలా పాతదైన, ఎప్పణ్ణించో ఉన్న

ఆది తాళం = ఆది తాళం

అనంత జీవన వాహినిగా = అంతం లేని జీవితమనే నదిలా

సాగిన సృష్టి విలాసమునే = సాగిపోయిన సృష్టి క్రీడ, ఆట, నాట్యం

నా ఉచ్చ్వాసం = పీల్చే ఊపిరి, గాలి

కవనం = కవిత్వం

నా నిశ్వాసం = వదిలే ఊపిరి, గాలి

గానం = పాట

పురస్కారాలు[మార్చు]

  1. సిరివెన్నెల సీతారామశాస్త్రి - ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారాలు - 1986.
  2. కళాసాగర్ అవార్డు -1986
  3. భరతముని అవార్డు -1992

మూలాలు[మార్చు]

  1. హెచ్ఎంటివి, మిక్చర్ పొట్లం (12 November 2018). ""విధాత తలపున ప్రభవించినది" అనే ఈ పాట!". Archived from the original on 22 December 2020. Retrieved 22 December 2020. CS1 maint: discouraged parameter (link)

ఇతర వివరాలు[మార్చు]

  1. నందన్ భవానీభట్ల బ్లాగ్ లో పాట గురించిన వ్యాసం[permanent dead link]
  2. లో పాట వీడియో