కె.విశ్వనాథ్

వికీపీడియా నుండి
(కె . విశ్వనాథ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కాశీనాధుని విశ్వనాధ్
Kviswanath cu.jpg
జననంకాశీనాధుని విశ్వనాధ్
(1930-02-19) 1930 ఫిబ్రవరి 19 (వయస్సు: 90  సంవత్సరాలు)[1]
భారత దేశంతెనాలి,గుంటూరుజిల్లా,ఆంధ్రప్రదేశ్
నివాస ప్రాంతంచెన్నై,తమిళనాడు
ఇతర పేర్లుకళాతపస్వి,కె.విశ్వనాధ్
వృత్తిసినిమా, టి.వి దర్శకుడు
నటుడు
కథా రచయిత
స్క్రీన్ ప్లే రచయిత
శబ్ద గ్రాహకుడు
మతంహిందూ
భార్య / భర్తజయలక్ష్మి
పిల్లలుపద్మావతి దేవి(కూతురు)
కాశీనాధుని నాగేంద్రనాథ్
కాశీనాధుని రవీంద్రనాథ్(కొడుకులు)
తండ్రికాశీనాధుని సుబ్రహ్మణ్యం
తల్లిసరస్వతమ్మ
తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి

కళాతపస్వి గా చిరపరిచితమైన పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్ తెలుగు సినిమా దర్శకుడు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి, కె.విశ్వనాథ్. 2016లో ఆయన సినిమారంగంలో చేసిన కృషికిగాను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకాలోని పెద పులివర్రు అనే గ్రామం. బాల్యం, ప్రాథమిక విద్య పెదపులివర్రులోనే గడిచినా ఆ ఊర్లో ఎక్కువరోజులు నివసించలేదు. అక్కడి నుంచి వారి నివాసం విజయవాడకి మారింది. ఉన్నత పాఠశాల విద్య అంతా విజయవాడలోనూ, కాలేజీ గుంటూరు హిందూకాలేజీ, ఎ.సి కాలేజీల్లోనూ జరిగింది. బి.ఎస్సీ డిగ్రీ చేశాడు.[2][3][4]

సినీ ప్రస్థానం[మార్చు]

చెన్నై లోని ఒక స్టూడియోలో సాంకేతిక నిపుణుడి (సౌండ్ రికార్డిస్టు) గా సినిమా జీవితాన్ని మొదలుపెట్టాడు. అన్నపూర్ణ సంస్థ నిర్మించిన తోడికోడళ్ళు అనే సినిమాకు పనిచేస్తున్నపుడు ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తో పరిచయం ఏర్పడి ఆయన వద్ద సహాయకుడిగా చేరాడు. ఆయనతో కలిసి అన్నపూర్ణ వారి ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అప్పటికే ఆయన ప్రతిభను గుర్తించిన అక్కినేని నాగేశ్వరరావు తర్వాత సినిమాకు దర్శకుడిగా అవకాశం ఇస్తానని వాగ్దానం చేశాడు. అలా డాక్టర్ చక్రవర్తి తర్వాత అక్కినేని నాయకుడిగా నిర్మించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు. అప్పట్లో ఆకాశవాణి హైదరాబాదులో నిర్మాతగా ఉన్న గొల్లపూడి మారుతీరావు, ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి ఈ సినిమాకు కథను సమకూర్చగా, భమిడిపాటి రాధాకృష్ణ, గొల్లపూడి కలిసి మాటలు రాశారు. దుక్కిపాటి మధుసూదనరావు స్క్రీన్ ప్లే రాశాడు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి లభించింది.[5] సిరిసిరిమువ్వ సినిమాతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది.

విశ్వనాథ్ చలనచిత్ర జీవితంలో కలికితురాయి వంటిది శంకరాభరణం. జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా, తెలుగు సినిమా చరిత్రలో కూడా ఒక మైలురాయి వంటిది. పాశ్చాత్య సంగీతపు హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సాంప్రదాయం సంగీతానికి పూర్వవైభవాన్ని పునస్థాపించాలనే ఉద్దేశ్యాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించారు. భారతీయ సాంప్రదాయ కళలకు పట్టం కడుతూ ఆయన మరిన్ని సినిమాలు తీసారు. వాటిలో కొన్ని సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం మొదలైనవి.

కుల వ్యవస్థ, వరకట్నం వంటి సామాజిక అంశాలను కూడా తీసుకుని విశ్వనాథ్ చిత్రాలు నిర్మించారు. సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి సినిమాలు ఈ కోవలోకి వస్తాయి.

శంకరాభరణానికి జాతీయ పురస్కారంతో పాటు సప్తపదికి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది. స్వాతిముత్యం సినిమా 1986లో ఆస్కార్ అవార్డుకు అధికారిక ప్రవేశం పొందింది. భారతీయ సినిమాకు చేసిన సమగ్ర సేవకు గాను విశ్వనాథ్ కు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది.

విశ్వనాథ్ సినిమాల ప్రత్యేకత[మార్చు]

విశ్వనాథ్ సినిమాలలో సంగీతానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తన సినిమాలకు ఎక్కువగా కె.వి.మహదేవన్ నుగానీ, ఇళయరాజాను గానీ సంగీత దర్శకులుగా ఎంచుకునేవాడు. కొన్ని సినిమాలలో పండిత హరిప్రసాద్ చౌరాసియా, కేలూచరణ్ మహాపాత్ర, షరోన్ లోవెన్ వంటి ప్రముఖ కళాకారులతో కలిసి పనిచేసాడు. ప్రస్తుతం దర్శకత్వ బాధ్యతలను తగ్గించుకుని నటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నారు.

కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చిత్రాలు[మార్చు]

కె.విశ్వనాథ్ నటించిన చిత్రాలు[మార్చు]

పురస్కారాలు[మార్చు]

 • జాతీయ చలనచిత్ర పురస్కారాలు
 • 1992 - రఘుపతి వెంకయ్య పురస్కారం
 • 1992 - పద్మశ్రీ పురస్కారం
 • 2016 : దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం.[6][7]

బయటి లింకులు[మార్చు]


మూలాలు[మార్చు]

 1. http://www.imdb.com/name/nm0899649/
 2. Andhra Pradesh / Guntur News : Society needs good films, says K. Viswanath. The Hindu (25 July 2010). Retrieved on 2013-07-28.
 3. Entertainment Hyderabad / Events : Viswanath felicitated. The Hindu (22 July 2005). Retrieved on 2013-07-28.
 4. "Reporter's Diary". The Hindu. 19 September 2006.
 5. షణ్ముఖ (2017). సితార: పాటల పల్లకి శీర్షిక పరువము పొంగే వేళలో షెహనాయి అందుకే. హైదరాబాదు: ఈనాడు. p. 16.
 6. ఆంధ్రజ్యోతి. "కళాతపస్వికి దాదాసాహెబ్ అవార్డు". Retrieved 24 April 2017. Cite news requires |newspaper= (help)
 7. కళాతపస్వి కె.విశ్వనాథ్ కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం