లక్ష్మీనరసింహా
| లక్ష్మీనరసింహా (2004 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | జయంత్ సి. పరాంజి |
|---|---|
| నిర్మాణం | బెల్లంకొండ సురేష్ |
| తారాగణం | నందమూరి బాలకృష్ణ, ఆశిన్, రక్షిత, ప్రకాష్ రాజ్, కె. విశ్వనాధ్, కృష్ణ భగవాన్ |
| సంగీతం | మణిశర్మ |
| సంభాషణలు | పరుచూరి బ్రదర్స్, హరి |
| కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
| నిర్మాణ సంస్థ | శ్రీసాయి గణేష్ ప్రొడక్షన్స్ |
| విడుదల తేదీ | జనవరి 14, 2004 |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
లక్ష్మీనరసింహా, 2004 జనవరి 14వ తేదీన సంక్రాంతికి విడుదలైన ఒక తెలుగు సినిమా. శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం లో నందమూరి బాలకృష్ణ , ఆసిన్, రక్షిత నటించారు. ఈచిత్రానికి దర్శకత్వం జయంత్ సి పరాన్జీ కాగా, సంగీతం మణిశర్మ అందించారు. ఇది ఇంతకు ముందు తమిళంలో విజయవంతమైన "సామి" అనే సినిమాకు తెలుగు పునర్నిర్మాణం.
నటీనటులు
[మార్చు]- నందమూరి బాలకృష్ణ
- ఆసిన్
- రక్షిత
- ప్రకాష్ రాజ్
- కె.విశ్వనాథ్
- మురళీమోహన్
- పరుచూరి వెంకటేశ్వరరావు
- కృష్ణ భగవాన్
- మల్లికార్జునరావు
- ఎం.ఎస్.నారాయణ
- సునీల్
- ఎల్.బి.శ్రీరామ్
- నర్రా వెంకటేశ్వరరావు
- వల్లభనేని జనార్ధన్
- తోటపల్లి మధు
- ఆహుతి ప్రసాద్
- లక్ష్మీపతి
- దువ్వాసి మోహన్
- మల్లేష్ యాదవ్
- గాదిరాజు సుబ్బారావు
- చంద్రమౌళి
- కళ్ళు కృష్ణారావు
- వల్లం నరసింహారావు
- సుధ
కథ
[మార్చు]"లక్ష్మీ నరసింహ" (బాలకృష్ణ) ఒక నిజాయితీగల, చాలా స్ట్రిక్ట్ అయిన పోలీస్ ఆఫీసర్. కాని నేరగాళ్ళను అణచి వేయడానికి ముదురుగా, ఒకోమారు చట్టం పరిధికి అతీతంగా వ్యవహరిస్తుంటాడు. ఒకానొకప్పుడు ధర్మభిక్షం (ప్రకాష్ రాజ్) అనే గూండా నాయకుని కారణంగా హీరో చిన్నతనంలో పల్లెటూరిలో అతని చెల్లి దూరమయ్యింది, ఆస్తి నాశనమయ్యింది. తరువాత విజయవాడలో పోలీస్ ఆఫీసర్‌గా వెళ్లీన కథానాయకుడు అక్కడి రౌడీనాయకుడు ధర్మభిక్షం నుండి ఒకటిన్నర కోట్ల "లంచం" తీసుకొని తన వూరిలో దగాపడినవారిని ఆదుకొంటానికి వాడుతాడు. తరువాత ధర్మభిక్షం అసలు సంగతి తెలుసుకొంటాడు. ఇక హీరో, విలన్ల మధ్య ప్రత్యక్షమైన యుద్ధం ప్రారంభమౌతుంది.
హిట్టయిన డైలాగులు
[మార్చు]రాజూ అప్పటికప్పుడే చంపుతాడు,దేవుడు ఆ పాపం పండాక చంపుతాడు,కాని నేను సాక్ష్యం లేకుండా చంపుతాను.
పాటలు
[మార్చు]సంగీతాన్ని పూర్తిగా సమకూర్చినవారు: మణిశర్మ.
| సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "దేవున్నే పిలిచావంటే" | చంద్రబోస్ | శంకర్ మహదేవన్ | 5:43 |
| 2. | "అందంలో ఆంధ్రకోస్తా" | వేటూరి | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, శ్రేయా ఘోషల్ | 5:32 |
| 3. | "జడతోటి కొడితే" | చంద్రబోస్ | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సుజాత | 5:44 |
| 4. | "మరుమల్లి జాబిల్లి" | చంద్రబోస్ | శంకర్ మహదేవన్, శ్రావణ భార్గవి, మురళీధర్ | 5:24 |
| 5. | "పప్పేసుకో చారేసుకో" | చంద్రబోస్ | మల్లికార్జున్, మహాలక్ష్మి అయ్యర్ | 4:23 |
| 6. | "నాతోటి నీకు పనుంది" | చంద్రబోస్ | కార్తీక్, మహాలక్ష్మి అయ్యర్ | 5:44 |
| మొత్తం నిడివి: | 32:32 | |||
బాక్సాఫీసు
[మార్చు]- 272 కేంద్రాలలో 50 రోజులు, 87 కేంద్రాలలో 100 రోజులు
బయటిలింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- 2004 తెలుగు సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- నందమూరి బాలకృష్ణ సినిమాలు
- మణిశర్మ సంగీతం అందించిన సినిమాలు
- ప్రకాష్ రాజ్ నటించిన సినిమాలు
- కె. విశ్వనాధ్ నటించిన సినిమాలు
- పరుచూరి బ్రదర్స్ సినిమాలు
- మురళీమోహన్ నటించిన సినిమాలు
- సునీల్ నటించిన సినిమాలు
- ఎం.ఎస్.నారాయణ నటించిన సినిమాలు
- మల్లికార్జునరావు నటించిన సినిమాలు
- రఘుబాబు నటించిన సినిమాలు
- ఎల్. బి. శ్రీరాం నటించిన సినిమాలు
- ఆహుతి ప్రసాద్ నటించిన సినిమాలు
- కృష్ణ భగవాన్ నటించిన సినిమాలు
- సుధ నటించిన సినిమాలు