Jump to content

బహుదూరపు బాటసారి

వికీపీడియా నుండి
బహుదూరపు బాటసారి
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
సుజాత,
శారద
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ తారకప్రభు ఫిలింస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

బహుదూరపు బాటసారి 1983 లో వచ్చిన సినిమా. తన తారక ప్రభు ఫిల్మ్స్ బ్యానర్‌లో దాసరి నారాయణరావు [1] నిర్మించి దర్శకత్వం వహించాడు.[2] ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, సుజాత ప్రధాన పాత్రలలో [3] నటించారు. రమేష్ నాయుడు సంగీతం అందించాడు.[4] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నమోదైంది.[5]

ఈ చిత్రం నిజాయితీ గల పోలీసు ప్రసాద్ (అక్కినేని నాగేశ్వరరావు) పై ప్రారంభమవుతుంది. అతనికి భార్య ప్రభ (సుజాత), ఇద్దరు కుమారులు భాను, రాజా (భాను చందర్, రాజా), చెవిటి & మూగ కుమార్తె సుహాసిని (సుహాసిని) ఉన్నారు. పిల్లలకు అన్నింటినీ అందించడానికి ఈ జంట వారి స్వంత అవసరాలను త్యాగం చేస్తుంది. రాజా తన మామయ్య కుమార్తె గీతతో, భాను ఒక క్రైస్తవ అమ్మాయి జూలీ (సుమలత) తో, సుహాసినికి మధుసూదన రావు (ప్రభాకర్ రెడ్డి) కుమారుడు, చెవిటి & మూగ వ్యక్తి నారాయణరావు (నారాయణరావు) తో పెళ్ళిళ్ళు జరిపిస్తారు. సమాంతరంగా, ప్రసాద్‌కు సన్నిహితుడైన అవతారం (దాసరి నారాయణరావు) తన భార్య సహస్రకోటి సూర్యప్రభ (రమాప్రభ) తో, ముగ్గురు కుమారులతో కష్టాలు పడుతున్నాడు. అంతేకాకుండా, అతను ఆస్తి కోసం తన తండ్రి (అల్లు రామలింగయ్య) చనిపోయినట్లు తప్పుడు ప్రచారం చేస్తాడు.

ప్రసాద్, మధుసూదన రావు చేస్తున్న చట్టవిరుద్ధ కార్యకలాపాలను స్వాధీనం చేసుకున్నాడు. ఆ సమయంలో, మధుసూదన్ రావు పెద్ద కుమారుడు ఈశ్వర్ (ఈశ్వర్ రావు) పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణిస్తాడు. ప్రసాద్ క్రాస్ ఫైరింగ్‌లో తీవ్రంగా గాయపడతాడు. అతని కాలు తీసేస్తారు. ప్రసాద్ తన ఉద్యోగాన్ని కూడా కోల్పోతాడు. తన కొడుకులపై ఆధారపడతాడు కాని వారు అతనిని విడిచిపెడతారు. ఇది చాలదన్నట్లు సుహాసినిని తన అత్తమామలు ఇంట్లోంచి గెంటేస్తారు. ప్రసాద్ పూర్తిగా అప్పుల్లో మునిగి పిల్లల సహాయం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు విషయాలు మరింత దిగజారిపోతాయి. ఇక్కడ, కృతజ్ఞత లేని పిల్లలు తల్లిదండ్రులను పంచుకోవాలని అనుకుంటారు. ప్రసాద్ వాళ్ళను వెళ్ళగొట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటాడు. ఆ దుస్థితి సమయంలో, ప్రసాద్ మంచి వ్యక్తి అయిన సత్యనారాయణ (వంకాయల సత్యనారాయణ) ను ఆపద నుండి రక్షిస్తాడు. కృతజ్ఞతగా అతడు, ప్రసాద్ కోసం పెట్టుబడి పడతాడు. త్వరలో, తన కష్టంతో, ప్రసాద్ కోటీశ్వరుడౌతాడు. సుహాసిని వైవాహిక జీవితాన్ని కూడా పునరుద్ధరిస్తాడు. మరొక వైపు, అవతారం పిల్లలు తమ తాతను కనుగొని తండ్రికి ఒక పాఠం నేర్పుతారు. ప్రస్తుతం, ప్రసాద్ కుమారులు తన సంపద కోసం తండ్రితో కలవవడానికి ప్రయత్నిస్తారు, కాని అతను వారిని తిరస్కరిస్తాడు. చివరి ప్రయత్నంగా, వారు ఆత్మహత్య నాటకం ఆడతారు. అది తెలిసి ప్రభ పరుగెత్తుతుంది. వారి నాటకాన్ని గ్రహించి ప్రసాద్ ఆమెను అడ్డుకున్నపుడు ఆమె అతన్ని తప్పించుకుని వెళ్తుంది. వారిని కలిసిన తరువాత ఆమె సత్యాన్ని గ్రహించి, వారి ముఖాలను ఎప్పుడూ చూపించవద్దని ప్రకటించింది. వెంటనే, ఆమె వెనక్కి వచ్చేస్తుంది. ఆ సమయానికి, బాధపడిన ప్రసాద్ మొత్తం ఆస్తిని ప్రభ పేరిట ఉంచి, ఇంటిని వదలి వెళ్ళిపోతాడు. ప్రభా కూడా అతన్ని అనుసరిస్తుంది. చివరికి, అవతారం వలన తప్పులు తెలుసుకున్న పిల్లలు వాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణ చెబుతారు. అందరూ కలిసిపోతారు

నటవర్గం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
ఎస్. పాట పేరు గాయకులు పొడవు
1 "పంపా నది తీరానా" ఎస్పీ బాలు 4:49
2 "ఎవరు ఎవారో" ఎస్పీ బాలు, పి.సుశీల 5:55
3 "మేఘమా" పి. సుశీల 4:40
4 "అలమటించి పోతునాను" ఎస్పీ బాలు, పి. సుశీల 4:35
5 "ఎక్కడి తలుపులు" ఎస్పీ బాలు 3:38

6 .ఒక కంట నవ్వు ఒక కంట ఏడుపు, ఎస్. పి బాలసుబ్రహ్మణ్యం

7 ఏకవీరం మహాపూజ్యం సర్వ రక్షాకరం (శ్లోకం) ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

[మార్చు]
  1. "Bahudoorapu Batasari (Direction)". Spicy Onion.
  2. "Bahudoorapu Batasari (Banner)". Know Your Films.
  3. "Bahudoorapu Batasari (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-09-19. Retrieved 2020-08-23.
  4. "Bahudoorapu Batasari (Music)". Filmiclub.
  5. "Bahudoorapu Batasari (Review)". The Cine Bay. Archived from the original on 2021-12-05. Retrieved 2020-08-23.