Jump to content

రాజేశ్వరి కళ్యాణం

వికీపీడియా నుండి
(రాజేశ్వరి కల్యాణం నుండి దారిమార్పు చెందింది)
రాజేశ్వరి కళ్యాణం
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం క్రాంతి కుమార్
నిర్మాణం విజయ లక్ష్మి
పద్మజా వాణి
కథ క్రాంతికుమార్
చిత్రానువాదం క్రాంతికుమార్
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
వాణిశ్రీ,
మీనా
సంగీతం కె.వి.మహదేవన్
సంభాషణలు ఎల్.బి. శ్రీరామ్
ఛాయాగ్రహణం కె.ఎస్. హరి
కూర్పు అక్కినేని శ్రీకర్ ప్రసాద్
నిర్మాణ సంస్థ శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

రాజేశ్వరి కళ్యాణం 1993 లో వచ్చిన తెలుగు చిత్రం. శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై, మురళీ మోహన్ సమర్పణలో డి. కిషోర్ నిర్మించాడు.[1] దర్శకుడు క్రాంతి కుమార్ .[2] ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, మీనా, వాణిశ్రీ, సురేష్ ప్రధాన పాత్రలలో నటించారు [3] ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు.[4]

1992:మీనా: నంది అవార్డు. 1992: ఉత్తమ ద్వితీయ చిత్రంగా రజిత నంది అవార్డు గెలుచుకుంది.

ఆదర్శ దంపతులైయిన మాస్టర్ (అక్కినేని నాగేశ్వరరావు), సీత (వాణిశ్రీ) గోదావరి నదిలోని ఒక ద్వీపంలో ఒంటరిగా నివసిస్తూంటారు. కిష్టయ్య (బేబీ శ్రేష్ట) అనే పిల్లవాడిని పెంచుతూంటారు. అతన్ని చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ సమయంలో కిష్టయ్య తండ్రి శంకరం (సురేష్) తిరిగి వస్తాడు. ఈ సందర్భంలో ఈ జంట గతాన్ని వివరిస్తారు.

కొన్ని సంవత్సరాల క్రితం, పొరుగు గ్రామంలో ఒక అందమైన, సాంప్రదాయికమైన అమ్మాయి రాజేశ్వరి (మీనా) నివసించేది. వికలాంగుడైన జమీందారు వెంకట్రాయుడు (గుమ్మడి) కుమార్తె ఆమె. దీనిని అలుసుగా తీసుకుని, రాజేశ్వరి దుర్మార్గపు గయ్యాళి సవతి తల్లి భవానీ (జయచిత్ర) ఆస్తిపై అధికారాన్ని సంపాదించి, రాజేశ్వరిని కష్టాలకు గురిచేస్తుంది. ఆ దుస్థితిలో, మాస్టర్, సీతలతో చేసే స్నేహం మాత్రమే రాజేశ్వరికి ఉపశమనంగా ఉండేది. ఆ తరువాత శంకరం పశు వైద్యునిగా గ్రామానికి వచ్చి రాజేశ్వరితో ప్రేమలో పడతాడు. అది తెలుసుకున్న భవానీ రాజేశ్వరిపై హింసను తారస్థాయికి పెంచుతుంది. ఇది తెలుసుకున్న మాస్టర్, వెంకట్రాయుడి వద్దకు వివాహ ప్రతిపాదనతో వెళ్తాడు. రాజేశ్వరికి అప్పటికే పెళ్ళి అయిందనీ, ఆమె ఒక వితంతువనీ భవానీ చెబుతుంది. వాస్తవానికి, రాజేశ్వరి బాల్యంలో ఆమెకు మత్తుమందిచ్చి భవానీ, ఆమెను తన తాగుబోతు తమ్ముడు (శ్రీకాంత్) కిచ్చి పెళ్ళి చేసింది. ఆ సంగతి తెలిసిన మీదట కోపంతో వెంకట్రాయుడు, ఆ వరుణ్ణి చంపేస్తాడు. ఆ హత్యతో అతడు పక్షవాతానికి గురై, భార్యకు లొంగిపోవలసి వస్తుంది.

మాస్టర్ దంపతులు, రాజేశ్వరిని శంకరాన్నీ కలిపి తాము ఈ ద్వీపంలో నివసించడం ప్రారంభిస్తారు. సమయం గడిచేకొద్దీ, రాజేశ్వరి గర్భవతి అవుతుంది. ఇది తెలిసి భవానీ రగిలి పోతుంది. ఆమెను శిక్షించేందుకు గాను వెంకట్రాయుడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ సంఘటనతో భవానీ ప్రతీకారం ఇనుమడించి శంకరం, రాజేశ్వరిలను నిర్మూలించడానికి ప్లాను వేస్తుంది. ఈ దాడిలో, రాజేశ్వరి కిష్టయ్యకు జన్మనిచ్చి మరణిస్తుంది. శంకరం తీవ్రంగా గాయపడతాడు, జ్ఞాపకశక్తిని కోల్పోతాడు. అతడు చనిపోయాడని అందరూ అనుకుంటారు. ప్రస్తుతం, శంకరం తనతో పాటు కిష్టయ్యను తీసుకువెళ్ళాలను అనుకుంటాడు. సీత అందుకు ఒప్పుకోదు. మాస్టర్ ఆమెను ఒప్పించి, పిల్లవాడిని శంకరానికి అప్పగిస్తారు.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]

వేటూరి సుందరరామమూర్తి రాసిన పాటలకు ఎంఎం కీరవాణి బాణీలు కట్టాడు. ఆకాష్ ఆడియో కంపెనీ వీటిని విడుదల చేసింది.

సం.పాటగాయనీ గాయకులుపాట నిడివి
1."ఎందరో మహానుభావులు"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, బేబీ ప్రసన్న3:51
2."నింగీ నేలా"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర4:47
3."చుక్కా చుక్కా"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర5:22
4."దనిసరిగా దనిసరిగా"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, బేబీ ప్రసన్న1:15
5."ఓడను జరిపే"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర,3:51
6."శ్రీ గణపతి"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం4:46
మొత్తం నిడివి:28:04

మూలాలు

[మార్చు]
  1. "Rajeswari Kalyanam (Producer)".
  2. "Rajeswari Kalyanam (Direction)".
  3. "Rajeswari Kalyanam (Cast & Crew)". Archived from the original on 2021-02-25. Retrieved 2020-08-08.
  4. "Rajeswari Kalyanam (Review)".