ఉదయ్ ప్రకాష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉదయ్ ప్రకాష్
జననం1964 జూన్ 19
ఊటీ తమిళనాడు భారతదేశం
మరణం2004 ఆగస్టు 18
చెన్నై తమిళనాడు భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు

ఉదయ్ ప్రకాష్ తమిళ తెలుగు సినిమాలలో నటుడు. ఉదయ్ ప్రకాష్ ఫుట్బాల్ ఆటగాడు కూడా. ఉదయ ప్రకాష్ తెలుగులో విజయశాంతి నటించిన కర్తవ్యంసినిమాలో అట్లూరి పుండరీకాక్షయ్య కుమారుడిగా చక్రవర్తి పాత్రలో నటించాడు.

సినీ జీవితం[మార్చు]

ఉదయ ప్రకాష్ తెలుగులో విజయశాంతినటించిన కర్తవ్యం సినిమాలో అట్లూరి పుండరీకాక్షయ్య కొడుకుగా నటించాడు. ఈ సినిమాలో ఉదయ్ ప్రకాష్ ప్రతినాయకుడిగా కూడా నటించాడు. ఉదయ్ ప్రకాష్ చిన్న తంబి. అనే తమిళ సినిమాలో నటించాడు. ఈ సినిమా ఒక మోస్తరు విజయాన్ని సాధించింది. ఉదయ్ ప్రకాష్ కు ఈ సినిమా ద్వారా గుర్తింపు వచ్చింది.

మరణం[మార్చు]

ఉదయ్ ప్రకాష్‌ మద్యం ఎక్కువగా సేవిస్తుండేవాడు ‌ దీంతో అతనికి సినిమాలలో అవకాశాలు తగ్గిపోయాయి. సినిమాలలో అవకాశాలు రాక ఉదయ్ ప్రకాష్ అప్పులు ఎక్కువగా చేస్తుండేవాడు. తర్వాత చెన్నైకి వెళ్ళిపోయాడు. తర్వాత ఉదయ్ ప్రకాష్ ఒక గుడిసెలో ఒక వృద్ధురాలితో నివసించేవాడు. ఉదయ్ ప్రకాష్ పరిస్థితిని చూసిన నటుడు శరత్ కుమార్ తన దివాన్ సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఉదయ్ ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ.. తానిక తాగుడు మానుకుంటానని చెప్పాడు. ఉదయ్ ప్రకాష్ కాలేయ సమస్యతో ఆస్పత్రిలో చేరారు. దర్శకుడు పి.వాసు ఉదయ్ ప్రకాష్ చికిత్స కొరకు డబ్బులు సమకూర్చారు. ఉదయ్ ప్రకాష్ కోలుకొని ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి మద్యం మత్తులో నడిగర్ సంఘం వద్దకు చేరుకుని కుప్పకూలిపోయి మృతి చెందాడు.

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
1989 వరుషం పదినారు తమిళం
1990 కర్తవ్యం చక్రవర్తి తెలుగు
1990 పుదు పుదు రాగంగళ్ తమిళం
1991 అంబు సంగిలి విశ్వనాథ్ తమిళం
1991 చిన్న తంబి తమిళం
1991 ఇధయ వాసల్ పోలీస్ అధికారి తమిళం
1991 కిజక్కు కరై తమిళం
1991 మన్నన్ తమిళం
1992 ఇదు నమ్మ భూమి తమిళం
1992 సముండి తమిళం
1992 పెద్దరికం తెలుగు
1993 ఉజైప్పాలి తమిళం
1993 బ్యాండ్ మాస్టర్ తమిళం
1993 కట్టబొమ్మన్ రాజప్ప తమిళం
2003 దివాన్ చంద్రన్ తమిళం
2003 కాదల్ కిరుక్కన్ కవిధాంగెల్ తమిళం
2004 జైసూర్య తమిళం
2004 సూపర్ డా తమిళం