Jump to content

రోషగాడు

వికీపీడియా నుండి
రోషగాడు
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ఆర్.దాస్
తారాగణం చిరంజీవి,
మాధవి
సిల్క్ స్మిత
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ పి.ఎన్.ఆర్.పిక్చర్స్
భాష తెలుగు

రోషగాడు 1983 లో కె.ఎస్.ఆర్ దాస్ దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం. ఈ చిత్రంలో చిరంజీవి, మాధవి నటించారు . ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.

చిరంజీవి సికిందర్ శ్రీకాంత్ అనే రెండుపాత్రలు పోషించాడు సికిందర్ ఒక పెద్ద రౌడీ, నేరస్థుడు. వజ్రాలు, నగదు, ఆస్తులను స్మగ్లర్ల నుండి దొంగిలించి రహస్య ప్రదేశంలో (దుర్గా ఆలయం) దాస్తూంటాడు. ఒక రోజు స్మగ్లర్లు సికిందర్‌పై దాడి చేస్తారు. తరువాత జరిగే వెంటాడే సీనులో సికిందర్ ప్రమాదానికి గురవుతాడు. అంతకు ముందు అతడు ఓ బిచ్చగాడికి ఓ డైరీ ఇస్తాడు. ఆ డైరీలో సికిందర్ దాచిన దోపిడీ సొమ్ము వివరాలు రాసి ఉంటాయి

సికిందర్ మరణం తరువాత, శ్రీకాంత్ పట్టణానికి వచ్చినపుడు, అతనే సికిందర్ అని భావించి స్మగ్లర్లు పట్టుకుంటారు. స్మగ్లర్లను పట్టుకోడానికి ప్రయత్నిస్తున్న రహస్య పోలీసు అధికారి సిల్క్ స్మితతో పాటు వారంతా అతన్ని హింసిస్తారు. శ్రీకాంత్ సికిందర్ కాదని స్మితకు అర్థమౌతుంది. ఇద్దరూ కలిసి తప్పించుకుంటారు. ప్రధాన విలన్ కన్నడ ప్రభాకర్ శ్రీకాంత్ సోదరితో పట్తుకుని చంపుతాడు. శ్రీకాంత్ తప్పించుకొని ప్రభాకర్తో సహా స్మగ్లర్లందరిపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతాడు.

తారాగణం

[మార్చు]
  • చిరంజీవి
  • మాధవి
  • కన్నడ ప్రభాకర్
  • సిల్క్ స్మిత

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: కె.ఎస్.ఆర్.దాస్
  • రచన: పరుచూరి బ్రదర్స్
  • సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
  • గీత రచయిత: రాజశ్రీ( ఇందుకూరి రామకృష్ణంరాజు)
  • నేపథ్య గాయకులు: శిష్ట్లా జానకి, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
  • నిర్మాత: పింజల నాగేశ్వరరావు
  • నిర్మాణ సంస్థ: పి.ఎఎన్.ఆర్ పిక్చర్స్
  • విడుదల:29:07:1983.

పాటలు

[మార్చు]
క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "చిన్నదాని కోరచూపు"  ఎస్. జానకి  
2. "నేనంటే చూడు నేనే"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం  
3. "యవ్వనమా నికు స్వాగతమ్"  ఎస్. జానకి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం  
4. "అచ్చట్లా ముచ్చట్లా"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల  

5.రాలు గాయి ప్రాయం రావాలి , రచన: రాజశ్రీ, గానం.ఎస్.జానకి కోరస్.

"https://te.wikipedia.org/w/index.php?title=రోషగాడు&oldid=4795988" నుండి వెలికితీశారు