చలసాని శ్రీనివాసరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్‌ చలసాని శ్రీనివాసరావు.

భావాలు[మార్చు]

  • రాష్ట్రం విడిపోతే భవిష్యత్తు చీకటే.చత్తీస్‌ఘడ్‌, ఉత్తరాఖండ్‌ తదితర రాష్ట్రాలు ఏర్పడి మూడేళ్లు గడిచినా ఇప్పటికీ రాజధాని పట్టణాలు పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు.ఒక్క రాజధానిని నిర్మించాలంటే 30 ఏళ్ల కాలం పడుతుంది.పోలవరానికి జాతీయ హోదా అనేది ఆచరణ సాధ్యం కాదు.భవిష్యత్తు కార్యాచరణను ఇప్పుడే నిర్ధేశించుకోకపోతే నీటియుద్ధాలు తప్పవు.సీమాంధ్ర ప్రాంతానికి సాగునీరుతోపాటు హైదరాబాదు రాజధాని విషయాన్ని పరిష్కరించిన తర్వాతే తెలంగాణను ప్రకటించాలి.తెలంగాణను ప్రకటించేముందు రాయలసీమ కోస్తాంధ్ర ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోవాలి.తెలుగుజాతి ఎప్పుడు ఒక్కటే, రెండు వేల సంవత్సరాల క్రితం ప్రపంచానికి చొక్కా తొడగడం నేర్పింది తెలుగువాడే.తెలుగుజాతి ఎప్పటికీ విడిపోదు.మన లిపి ప్రపంచానికి మార్గదర్శకమైంది.ట్యాంక్‌బాండ్‌పై జరిగిన సంఘటన తెలుగుజాతికి జరిగిన అవమానం.హైదరాబాదు‌ మహా నగరాన్ని దేశానికి రెండవ రాజధానిగా చేసివుంటే ఆంధ్రప్రదేశ్‌ ఎంతో అభివృద్ధి సాధించివుండేది.సమైక్య ఆంధ్రలో సంతోషం వుందని భావించా, కొంతమంది ప్రాంతీయవాదుల మాటలు తీవ్రంగా గాయపర్చాయి.మూడుప్రాంతాలు కలిసిననాటి నుండి కూడా ఆంధ్రా ప్రాంతం దోపిడీ గురై, హైదరాబాదు‌ చుట్టూ అభివృద్ధి జరిగింది.హైదరాబాదు‌ చరిత్ర ఒక్కసారి తిరగేస్తే భాగ్యనగరం నిర్మాణంలో ఆంధ్రా, రాయలసీమ ప్రాంత ప్రజలు ఎంత శ్రమించారో తెలుస్తుంది.చివరికి బ్రిటీష్‌వారు కూడా ఆంధ్రా ప్రాంతంలో కప్పం వసూలు చేసి హైదరాబాదు‌ నిర్మాణానికి ఖర్చు చేశారు. రాష్ట్రం విడిపోయే పరిస్థితి వస్తే మూడు అంశాలపై ప్రధానంగా చర్చ జరగాల్సివుంది.నీటి పం పిణీ, రాజధాని నిర్మాణం, విద్యా, ఉపాధి అవకాశాలపై ఆంధ్రాకు అనుకూల నిర్ణయాలతోనే సమస్యకు పరిష్కారం.