Jump to content

ఆర్తి చాబ్రియా

వికీపీడియా నుండి
ఆర్తి చాబ్రియా
జననం (1982-11-21) 1982 నవంబరు 21 (వయసు: 43)
ముంబై, భారతదేశం
వృత్తినటి, ప్రచారకర్త

ఆర్తి చాబ్రియా భారతీయ సినిమా నటి, ప్రచారకర్త. 1999లో మిస్ ఇండియాగా ఎంపికయ్యింది. ఒకరికి ఒకరు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. తెలుగు, హిందీ, కన్నడ, పంజాబీ చిత్రాలలో నటించింది.

జననం

[మార్చు]

ఆర్తి చాబ్రియా 1982, నవంబరు 21న ముంబైలో జన్మించింది.[1]

తొలిజీవితం

[మార్చు]

ఆర్తి చాబ్రియా మూడు సంవత్సరాల వయసులోనే మెదటిసారిగా ఫారెక్స్ కు ప్రచారకర్తగా తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించంది. మాగి నూడుల్స్, పెప్సోడెంట్ టూత్ పేస్ట్, క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్, అమూల్ ఫ్రోస్టిక్ ఐస్ క్రీం, ఎల్.ఎం.ఎల్. ట్రెండీ స్కూటర్, క్రాక్ క్రీమ్, కళ్యాణ్ జ్యూవలరీ వంటి అనేక ప్రకటనలలో నటించింది.[1]

సినీరంగ ప్రస్థానం

[మార్చు]

మోడల్ గా మంచి ఉన్నత స్థితిలో ఉన్న సమయంలోనే సినిమాలలో అడుగుపెట్టింది. ఈమె మొదటి హిందీ సినిమా 'తుమ్ సే అచ్చా కౌన్ హై' ద్వారా పరిచయమైంది.

దర్శకురాలిగా

[మార్చు]

ఆర్తి చాబ్రియా 'ముంబై వారణాసి ఎక్స్‌ప్రెస్‌' అనే లఘుచిత్రానికి దర్శకత్వం వహించింది.[2]

నటించిన చిత్రాల జాబితా

[మార్చు]
సంవత్సరంచిత్రంపేరుపాత్రపేరుభాషఇతర వివరాలు
2001లజ్జసుష్మహిందీ
2002ఆవార పాగల్ దివాన్టినా చిప్పాహిందీ
తుమ్సే అచ్చా కౌన్ హైనైనా దీక్షిత్హిందీ
2003రాజా భయ్యారాధహిందీ
ఒకరికి ఒకరుస్వప్నారావుతెలుగు
2004ఇంట్లో శ్రీమతి - వీధిలో కుమారిఅంజలితెలుగు
అబ్ తుమ్హారే హవాలే వతన్ సాతియోత్రైలోక్ భార్యహిందీఅతిథి పాత్ర
2005అహం ప్రేమస్మిఅప్సరకన్నడ
షాదీ నె. 1రేఖ కొఠారిహిందీ
స్సుఖ్భావ్నా రాకేష్ వర్మహిందీ
2006తీస్రీ ఆంక్: హిడెన్ కెమెరాఆర్తీహిందీ
2007షూట్ ఔట్ ఎట్ లోఖాండ్వాలాతారన్నుం తనుహిందీ
పార్ననర్నిక్కిహిందీఅతిథి పాత్ర
అనామికఅనామికహిందీఅతిథి పాత్ర
సాంతసాంత గర్ల్ ఫ్రెండ్కన్నడ
అతిథిపాత్నరఆలీ మాజీ గర్ల్ ఫ్రెండ్హిందీఅతిథి పాత్ర
2008ధూమ్ దడక్కశివాని సావంత్హిందీ
చింతకాయల రవిఐటెం సాంగ్తెలుగు
గోపి (గోడమీద పిల్లి)మోనికాతెలుగు
2009డాడీ కూల్నాన్సి లాజరస్హిందీ
టాస్సశహిందీ
రజనిసంధ్యకన్నడ
కిస్సే ప్యార్ కరూన్నటాశహిందీ
2010మిలేంగే మిలేంగేసోఫియా రాజీవ్ అరోరాహిందీ
దస్ టోలాసువర్ణలత శాస్త్రీహిందీ
2013వ్యాహ్ 70కిలోమీటర్లుప్రీటోపంజాబి

మూలాలు

[మార్చు]
  1. 1 2 టాలీవుడ్ టైమ్స్. "ఆర్తి చ్చాబ్రియా". tollywoodtimes.com. Retrieved 2 May 2017.[permanent dead link]
  2. ↑ నవతెలంగాణ. "దర్శకురాలిగా..!". Retrieved 2 May 2017.[permanent dead link]