హరీష్
Jump to navigation
Jump to search
హరీష్ | |
---|---|
జననం | హరీష్ 1975 ఆగస్టు 14 |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1979–1983, 1991–ప్రస్తుతం |
హరీష్ (జననం: ఆగస్టు 1, 1975) ఒక ప్రముఖ సినీ నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలలో దాదాపు 280 సినిమాలలో నటించాడు.
జీవిత విశేషాలు
[మార్చు]హరీష్ ఆగస్టు 14, 1975 న హైదరాబాదులో జన్మించాడు.[1]
కెరీర్
[మార్చు]హరీష్ బాలనటుడిగా తన కెరీర్ ప్రారంభించాడు. తరువాత హీరో గా మారి దక్షిణాది భాషలన్నింటిలోనే కాక హిందీ లో కూడా నటించాడు. 1990 లో ఇ.వి.వి. దర్శకత్వంలో ప్రేమ ఖైదీ సినిమాతో కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమా హిందీలో కూడా ఇదే పేరుతో పునర్నిర్మితమైంది. ఇందులో కరిష్మా కపూర్ కథానాయికగా నటించింది. [2]
పురస్కారాలు
[మార్చు]1983 లో ఆంధ్రకేసరి సినిమాకు గాను ఉత్తమ బాలనటుడిగా అప్పటి ముఖ్యమంత్రి రామారావు చేతులమీదుగా రాష్ట్ర పురస్కారం అందుకున్నాడు. 1996 లో జంధ్యాల దర్శకత్వం వహించిన ఓహో నా పెళ్ళంట సినిమాకు గాను ప్రత్యేక జ్యూరీ పురస్కారాన్ని అందుకున్నాడు.
నటించిన సినిమాలు
[మార్చు]- ఆడపిల్ల
- కొండవీటి సింహం
- ముద్దుల కొడుకు
- త్రిశూలం
- దొంగ
- నా దేశం
- శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర
- డాడీ డాడీ
- గోకులంలో సీత
- ఓహో నా పెళ్ళంట
- ఎస్.పి.పరశురాం
- బంగారు కుటుంబం
- మనవరాలి పెళ్ళి
- ఇన్స్పెక్టర్ ఝాన్సీ
- ప్రాణదాత
- రౌడీ ఇన్స్పెక్టర్
- పెళ్ళాం చెబితే వినాలి
- ప్రేమ పంజరం
- ప్రేమ ఖైదీ
- వివాహ భోజనంబు
- సీతామాలక్ష్మి
- మాధవయ్యగారి మనవడు
- ఏవండీ ఆవిడ వచ్చింది
- కొండపల్లి రత్తయ్య
- పెళ్ళైంది కానీ
మూలాలు
[మార్చు]- ↑ "హరీష్ బయోగ్రఫీ". movies.dosthana.com. Retrieved 6 September 2016.[permanent dead link]
- ↑ "Spotted: Prem Qaidi actor Harish in Delhi". rediff.com. Retrieved 6 September 2016.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో హరీష్ పేజీ