Jump to content

మాధవయ్యగారి మనవడు

వికీపీడియా నుండి
మాధవయ్యగారి మనవడు
దర్శకత్వంముత్యాల సుబ్బయ్య
నిర్మాతవి. దొరస్వామి రాజు
తారాగణంఅక్కినేని నాగేశ్వరరావు, హరీష్, సుజాత
ఛాయాగ్రహణంకె. ఎస్. హరి
కూర్పుగౌతంరాజు
సంగీతంవిద్యాసాగర్
నిర్మాణ
సంస్థ
వి. ఎం. సి క్రియేషన్స్
విడుదల తేదీ
ఏప్రిల్ 16, 1992 (1992-04-16)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

మాధవయ్యగారి మనవడు 1992లో విఎంసి ప్రొడక్షన్స్ లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, సుజాత, హరీష్ ముఖ్యపాత్రల్లో నటించారు.

మాధవయ్య ఊర్లో ధనవంతుడు. సరదా మనిషి. ఆయనకు వంశీ అనే మనవడు ఉంటాడు. మాధవయ్య ఆస్తికంతటికీ వంశీనే వారసుడు కావడంతో బంధువులంతా ఆయన చుట్టూ చేసి వంశీని వలలో వేసుకుని ఆస్తి ఎలా కాజేయాలా అని చూస్తుంటారు. ఒకసారి వంశీ తీవ్ర అనారోగ్యానికి లోనవడంతో ముంబైలో ఉన్న తన స్నేహితుడి డాక్టర్ సత్యం దగ్గరకు తీసుకెళతాడు. కానీ అక్కడి నుంచి వచ్చక ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో వంశీ మరణిస్తాడు. కానీ ఆ విషయం తెలిస్తే తన భార్య తట్టుకోలేదని ఆమెకు చెప్పకుండా దాస్తాడు. ఒకరోజు మాధవయ్య భార్య వంశీ తిరిగొస్తున్నాడని స్వాగతానికి అంతా ఏర్పాట్లు చేస్తుంది. అదే సమయంలో మాధవయ్య ఆమెకు నిజం చెప్పాలని ప్రయత్నిస్తాడు. కానీ ఆశ్చర్యకరంగా వంశీ రూపురేఖలతోనే ఉన్న మరో వ్యక్తి వస్తాడు. మాధవయ్య ఏం జరిగిందో తెలుసుకోవడానికి మళ్ళీ నిజం చెప్పకుండా దాస్తాడు. వంశీ తెలివిగా అన్ని పనులు చక్కబెట్టి మాధవయ్య గర్వపడేలా చేస్తాడు. మాధవయ్య కూడా అతన్ని అభిమానించడం మొదలుపెడతాడు. కానీ వంశీ వచ్చింది మాధవయ్య మీద పగ తీర్చుకోవడానికి అని తెలుస్తుంది. వంశీ మోహన్ మాధవయ్య కొడుక్కి మొదటి భార్య కొడుకు. మాధవయ్య వల్ల తన తండ్రికి అన్యాయం జరిగిందని చెబుతాడు. మాధవయ్య భార్య తన భర్త మీద పగ సాధించవద్దని చెబుతుంది. మాధవయ్యకు కూడా కొడుకు విషయంలో తాను చేసిన పొరపాటు వల్ల ఎంత అన్యాయం జరిగిందో తెలుస్తుంది. ఈలోపు వంశీ గురించి తెలుసుకున్న కొంతమంది దుండగులు అతను ఆస్తికి వారసుడవుతాడని చంపడానికి వస్తారు. కానీ మాధవయ్య తెలివిగా అతన్ని కాపాడుకుంటాడు. వంశీ కూడా తాత మంచితనం తెలుసుకుని అందరూ కలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.

తారాగణం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • గోవర్ధనాల కొండ , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • నీచూపు సుప్రభాతం , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , కె ఎస్ చిత్ర
  • అదరాలే పిల్లా, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • రా రా మాఇంటి దాకా , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • యమ్మ యమ్మ , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర .

మూలాలు

[మార్చు]
  1. "Madhavaiah Gari Manavadu (1992)". Indiancine.ma. Retrieved 2020-05-20.[permanent dead link]