ఎస్.పి.పరశురాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎస్.పి.పరశురాం
దర్శకత్వంరవిరాజా పినిశెట్టి
నిర్మాతఅల్లు అరవింద్
తారాగణంచిరంజీవి,
శ్రీదేవి
ఛాయాగ్రహణంకె. ఎస్. ప్రకాష్
కూర్పువేమూరి రవి
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
మార్చి 4, 1994 (1994-03-04)[1]
భాషతెలుగు

ఎస్. పి. పరశురాం రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో 1994 లో విడుదలైన చిత్రం. ఇందులో చిరంజీవి, శ్రీదేవి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాను అల్లు అరవింద్, జి. కె రెడ్డి, ముకేష్ ఉదేషి నిర్మించారు. ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. తెలుగులో కథానాయికగా శ్రీదేవికిది చివరి సినిమా.[2]

పరశురాం విధినిర్వహణ పట్ల కఠినంగా వ్యవహరించే ఒక పోలీసు అధికారి. అతని తమ్ముడు నీలి చిత్రాల కేసులో పట్టు పడితే అతన్ని అరెస్టు చేయడానికి వెనుకాడడు. ఈ నేరంలో రాణి అనే చిన్న దొంగ కూడా బాధితురాలు అవుతుంది. ఆమె తప్పించుకుంటుంది కానీ సాక్షిగా ఉండటానికి ఒప్పుకుంటుంది. ఆమె సాక్షిగా ఉండటం వలన గూండాలు ఆమె మీద దాడి చేస్తారు. ఆ దాడిలో ఆమె చూపు కోల్పోతుంది. పరశురాం ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. కానీ ఆమెను, కుటుంబాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తుంటారు. వాళ్ళ నుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడన్నది మిగతా కథ.

తారాగణం

[మార్చు]

సంగీతం

[మార్చు]

ఈ చిత్రానికి రాజ్ - కోటి సంగీతం అందించారు.

  • ఆరింటదాక అత్తకొడకా - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర
  • ఏమి స్ట్రోకురో - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర
  • చంపేయి గురు - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర
  • ఓ బాబా కిస్ మి - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర
  • ఏడవ కేడవ కేడవకమ్మా - కె. ఎస్. చిత్ర
  • ముద్దబంతి - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర

మూలాలు

[మార్చు]
  1. "S. P. Parashuram Movie". TOI.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. Nadadhur, Srivathsan (2018-02-26). "Sridevi: Star for all seasons". The Hindu. ISSN 0971-751X. Retrieved 2020-07-30.