భలే తమ్ముడు (1969 సినిమా)
| భలే తమ్ముడు (1969 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | బి.ఎ.సుబ్బారావు |
|---|---|
| తారాగణం | నందమూరి తారక రామారావు, కె.ఆర్.విజయ రేలంగి వెంకటరామయ్య |
| సంగీతం | టి.వి.రాజు |
| నిర్మాణ సంస్థ | తారకరామ పిక్చర్స్ |
| భాష | తెలుగు |
భలే తమ్ముడు 1969లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. హిందీలో విజయవంతమైన 'చైనాటౌన్' ఆధారంగా నిర్మంచబడింది. విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములు, ఒకరు దొంగ, ఒకరు గాయకుడిగా మారతారు. పోలిసులు దొంగను బంధించి ఆ స్థానంలో గాయకుడ్ని దొంగల స్థావరంలో ప్రవేశపెడతారు. (తర్వాత కాలంలో వచ్చిన డాన్ (తెలుగులో యుగంధర్) ఇదే ఇతివృత్తంతో తయరయ్యాయి. మహమ్మద్ రఫి తొలిసారిగా తెలుగు సినీ రంగంలోకి పరిచయమై పాడిన ఎంతవారుకాని, గోపాలబాల, నేడే ఈనాడే, ఇద్దరిమనసులు ఒకటాయె' మొదలైన పాటలు ఇప్పటికి వినిపిస్తుంటాయి.
తారాగణం
[మార్చు]- నందమూరి తారక రామారావు_ రామ్ ప్రసాద్/ శ్యామ్ ప్రసాద్
- కె.ఆర్.విజయ_ గీత
- రేలంగి వెంకట్రామయ్య_సాహెబ్
- రాజనాల కాళేశ్వరరావు_ గణపతి
- మందాడి ప్రభాకరరెడ్డి_ ఇనస్పెక్టర్ శేఖర్
- మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి _ ఇనస్పెక్టర్ ప్రసాద్
- డాక్టర్ శివరామకృష్ణయ్య
- శ్రీరంజని జూనియర్
- విజయ గిరిజ _ లీల
- రమాప్రభ
- అరుణ ఇరాని_ డ్యాన్సర్.
సాంకేతిక వర్గం
[మార్చు]- చిత్రానువాదం, దర్శకత్వం: బి.ఎ.సుబ్బారావు
- సంగీతం: తోటకూర వెంకట రాజు
- మాటలు: మద్దిపట్ల సూరి
- పాటలు: సింగిరెడ్డి నారాయణరెడ్డి
- నేపథ్య గాయకులు: పులపాక సుశీల, మహమ్మద్ రఫీ
- ఛాయ గ్రహణం: ఎస్. ఎస్. లాల్
- ఎడిటింగ్: కందస్వామి
- నిర్మాత: అట్లూరి పుండరీకాక్షయ్య
- నిర్మాణ సంస్థ: తారకరామ పిక్చర్స్
- విడుదల:18:09:1969.
పాటలు
[మార్చు]| పాట | రచయిత | సంగీతం | గాయకులు |
|---|---|---|---|
| ఎంతవారుగాని వేదాంతులైనగాని వాలుచూపు సోకగానే తూలిపోదురో | సి. నారాయణ రెడ్డి | టి.వి.రాజు | మహమ్మద్ రఫీ |
| గోపాలబాల నిన్నేచేరి నీసన్నిధి చేరి నీ చుట్టు తిరుగుతు ఉన్నాను | సి నారాయణ రెడ్డి | టి.వి.రాజు | మహమ్మద్ రఫీ, పి.సుశీల |
| నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే | సి.నారాయణరెడ్డి | టి.వి.రాజు | మహమ్మద్ రఫీ, పి.సుశీల |
| ఇద్దరి మనసులు ఒకటాయె సరిహద్దులు లేనే లేవాయె | సి నారాయణ రెడ్డి | టి.వి.రాజు | మహమ్మద్ రఫీ, పి.సుశీల |
గుమ్మా గుమ్మా గుమ్మా,రచన: సి నారాయణ రెడ్డి, గానం. పి సుశీల , మహమద్ రఫీ
యే మజా దేఖ్ లో జిందగీ , రచన: సి నారాయణ రెడ్డి, గానం . పి సుశీల
బంగారు గువ్వను నేను , రచన: సి నారాయణ రెడ్డి గానం.పి.సుశీల, మహమ్మద్ రఫీ.
మూలాలు
[మార్చు]డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.