Jump to content

కిరాయి రౌడీలు

వికీపీడియా నుండి

"కిరాయి రౌడీలు" తెలుగు చలన చిత్రం 1981, డిసెంబర్,24 న విడుదల.ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కొణిదెల చిరంజీవి, రాధిక, మంచు మోహన్ బాబు, రావుగోపాలరావు ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం కొమ్మినేని చక్రవర్తి అందించారు.

కిరాయి రౌడీలు
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.కోదండరామిరెడ్డి
తారాగణం చిరంజీవి,
రాధిక,
మోహన్‌బాబు
సంగీతం కె. చక్రవర్తి
భాష తెలుగు

చిత్రకథ

[మార్చు]

శివుడు (ప్రభాకరరెడ్డి), బాబూరావు(రావు గోపాలరావు), చలపతి(జగ్గారావు ప్రాణస్నేహితులు.[1] బ్యాంకులో కొల్లగొట్టబడిన నగల పెట్టె వీరికి దొరుకుతుంది. బాబూరావు చలపతిని చంపివేసి, శివుడిని చావబాది చలపతిని శివుడే చంపాడని పుకార్లు పుట్టించి నగలను కొట్టివేస్తాడు. కాలక్రమేణా బాబూరావు పెద్ద సారావ్యాపారిగా మారి లక్షలు గడిస్తాడు. చలపతి కొడుకు కోటి (మోహన్ బాబు), శివుడి కొడుకు రాజా (చిరంజీవి) పొట్టకూటి కోసం కిరాయి రౌడీలుగా మారతారు. రాజా, బాబూరావు కుమార్తె జ్యోతి (రాధిక) ఇద్దరూ ప్రేమించుకుంటారు. బాబూరావు అమ్మిన కల్తీ సారా తాగి ఎందరో అమాయకులు మరణిస్తారు. ఇది సహించలేక కోటి బాబూరావు గిడ్డంగులను దగ్ధం చేస్తాడు. అందుకు ప్రతీకారంగా బాబూరావు కోటి గుడ్డి చెల్లెల్ని బలవంతంగా రప్పించి అనుభవిస్తాడు. ఆ గుడ్డి చెల్లెలు మరణించడంతో కోటి బాబూరావుపై పగబడతాడు. ఆ పగను ఎలా సాధిస్తాడు అనేది మిగిలిన సినిమా కథ.

తారాగణం

[మార్చు]
  • కొణిదెల చిరంజీవి _రాజా
  • రాధిక_జ్యోతి
  • మంచు మోహన్ బాబు _కోటి
  • రావుగోపాలరావు_బాబూరావు
  • మందాడి ప్రభాకరరెడ్డి_శివుడు
  • అల్లు రామలింగయ్య
  • చలపతిరావు_జగ్గారావు

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: ఎ.కోదండరామిరెడ్డి
  • కథ: సత్యానంద్
  • మాటలు: పరుచూరి బ్రదర్స్
  • సంగీతం: కొమ్మినేని చక్రవర్తి
  • గీత రచయిత: వేటూరి సుందరరామమూర్తి
  • నేపథ్య గాయకులు: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, అనితారెడ్డి
  • నిర్మాత: క్రాంతికుమార్
  • నిర్మాణ సంస్థ: క్రాంతి చిత్ర
  • విడుదల:24:12:1981.

పాటల జాబితా

[మార్చు]

1.ఆ దైవమే నా అన్నగా ఈ దీపమే నా కన్నుగా వెలిగింది మాలో, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.పులపాక సుశీల

2.ఓ కొంటే కోణంగి సరసాల సంపంగి సై అంటే సై అంటాలే, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

3.తమాషా ఇది ఒక తమాషా నాలో దిలాసా నీలో, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.అనితారెడ్డి, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం

4.నిదురించు జీవితాన ఉదయాన....ఆ దైవమే నా అన్నగా, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.పులపాక సుశీల

5 .పంగనామాలు పెట్టుకో వంగి దండాలుపెట్టుకో ఓడిపోయానని, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.పులపాక సుశీల, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం .

మూలాలు

[మార్చు]
  1. వెంకట్రావ్ (1 January 1982). "చిత్రసమీక్ష - కిరాయి రౌడీలు". ఆంధ్రపత్రిక. p. 13. Retrieved 5 October 2016.[permanent dead link]