రఘుపతి సూర్యప్రకాష్
రఘుపతి సూర్యప్రకాష్ (1901 -1956) (రఘుపతి సూర్య ప్రకాశరావు, ఆర్.ఎస్.ప్రకాష్) దక్షిణ భారతదేశ సినిమా దర్శకుడు, ఛాయాగ్రాహకుడు. అతను ఎక్కువగా తమిళ, తెలుగు సినిమాలకు పనిచేసాడు.
జీవిత విశేషాలు
[మార్చు]సూర్య ప్రకాశరావు ఆంధ్రపదేశ్ లోని వ్యాపారవేత్త, ఫోటోగ్రాఫర్ అయిన రఘుపతి వెంకయ్య కుమారుడు. అతని తండ్రి రఘుపతి వెంకయ్య 1910 లలో దక్షిణ భారతదేశంలో సినిమా ప్రదర్శనలను ప్రారంభిచాడు. అతను 1914 లో మద్రాసులో మొదటి సినిమాను నిర్మించాడు.
సూర్యప్రకాష్ వెపేరీలోని మిషనరీ పాఠశాలలో చదివాడు. సినిమా నిర్మాణం నేర్చుకునేందుకు దేశాంతరం వెళ్ళాడు. 1918లో లండన్ వెళ్ళి ఈలింగ్ లోని బార్కర్స్ మోషన్ ఫోటోగ్రఫీ లో చేరాడు. తరువాత జర్మనీ వెళ్లాడు. తరువాత హాలీవుడ్ కు వెళ్లాడు. అతను అనేక యూరోపియన్ దేశాలను సందర్శించాడు. అతను 1920లో 36 mm కెమేరాను తీసుకు వచ్చాడు. లోపభూయిష్ట కెమెరా అతని మొదటి సినిమా మీనాక్షి కళ్యాణం ను నాశనం చేసింది. అతను "స్టార్ ఆఫ్ ద ఈస్ట్" స్టుడియోను (గ్లాస్ స్టుడియోగా సుపరిచితం) ను 1921లో పురసవల్కంలో ప్రారంభించాడు. ఇది తన తండ్రి వెంకయ్య స్వంత సంస్థ. ఆ సినిమా బ్యానర్ పై 1921 లో అతను భీష్మ ప్రతిజ్ఞ సినిమాను నిర్మించాడు. ఆ స్టుడియోలో అతని వద్ద ఎ.నారాయణన్, సి.పుల్లయ్య వంటి మహామహులు పనిచేసారు. ఈ చిత్రాలు భారత ఉపఖండం అంతటా వివిధ భాషలలో అంతర్గత టైటిల్స్ తో పంపిణీ చేయబడ్డాయి. పాండిచ్చేరి లోని పారిస్ ఫారిన్ మిషన్ సొసైటీకి నిధులు అందించే వ్యక్తి అయిన బ్రూస్ గోర్డాన్‌తో కలిసి ఐరిష్ పూజారి థామస్ గావిన్ డఫీ నిర్మించిన, వ్రాసిన కాథలిక్ ప్రచార చిత్రం ది కాటేచిస్ట్ ఆఫ్ కిల్-ఆర్ని కి బహుశా దర్శకత్వం వహించాడు. డిస్ట్రిబ్యూటర్ (1924-25) గా పనిచేస్తూ అతను 1926 లో వ్యాపారవేత్త-భూస్వామి మోతీ నారాయణరావు మద్దతుతో గ్యారంటి పిక్స్ ను స్థాపించాడు. కానీ అది కూడా దివాళా తీసింది. జనరల్ పిక్స్ (అతను "లీలా ద స్టార్ ఆఫ్ మంగ్రిలియా" అనే హిట్ సినిమా నిర్మించాడు[1]) , శ్రీనివాస సినెటోన్ స్టూడియో (1928-39) లను ఏర్పాటు చేయడానికి నారాయణన్ సహాయం చేసాడు. అతను 1930లో లేబొరేటరీని ప్రారంభించాడు. 1930లలో నారాయణన్ తో వేరుపడి సుందరం సౌండ్ స్టూడియోలో చేరాడు. గోవర్ధన్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్‌తో కలిసి పనిచేశారు, మద్రాసులో 3 సినిమాలను సొంతం చేసుకున్నాడు. అతని ప్రారంభ చిత్రాలన్నింటినీ చిత్రీకరించి, అభివృద్ధి చేశాచి, సవరించాడు. తెలివైన టెక్నీషియన్‌గా పేరుపొందాడు: ద్రౌపది వస్త్రపహారణంలో ఆప్టికల్ ఎఫెక్ట్‌లను ఆశ్రయించకుండా, ఒక చిత్రం సన్నివేశంలో 5 చోట్ల ఒక నటుడిని కనిపించగలిగేలా చేయగలిగాడు. 1930ల మధ్య భాగంలో ఫ్రీలాన్స్ డైరక్టరుగా ఉన్నాడు. అతను నిర్మించిన గజేంద్ర మోక్షంలో నటించిన వై.వి.రావుకు ప్రభావితుడైనాడు. అతను ఎక్కువగా పౌరాణికాలతో సంబంధం కలిగి ఉండేవాడు. తరచుగా మద్రాసు సమీపంలోని జింగీ కోట వద్ద చిత్రీకరించేవాడు. అతను సంస్కరణ వాదిగా నిర్మించిన అనాథై పెన్ రెండవ ప్రపంచయుద్ధానికి ముందు జాతీయవాద ప్రచారానికి ప్రారంభ ఉదాహరణ. ప్రకాష్ ప్రారంభ తమిళ ధ్వని చిత్రాల గురించి విరుద్ధమైన ఆధారాలు ఉన్నాయి, కొన్నింటి మూలాలు ప్రకాష్‌కు, మరికొన్ని అతని సహకారి అయిన నారాయణన్‌కు ఆపాదించాయి; ఉదా. ద్రౌపది వస్త్రాపహరణం, కృష్ణ అర్జున, ఇంద్రసభ, రాజశేఖరన్.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Leila the Star of Mingrelia (1931)". Indiancine.ma. Retrieved 2020-09-04.
- ↑ "Bhishma Pratigya (1921)". Indiancine.ma. Retrieved 2020-09-04.