భీష్మ ప్రతిజ్ఞ (1921 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భీష్మ ప్రతిజ్ఞ
(1921 తెలుగు సినిమా)
దర్శకత్వం రఘుపతి సుర్యప్రకాష్
తారాగణం రఘుపతి సుర్యప్రకాష్ (భీష్ముడు),
డి కాస్టెల్లో (గంగ)
నిర్మాణ సంస్థ రఘుపతి వెంకయ్య నిర్మాణం
స్టార్ ఆఫ్ ది ఈస్ట్
భాష తెలుగు
రఘుపతి వెంకయ్

భీష్మ ప్రతిజ్ఞ 1921లో నిర్మించిన మూకీ సినిమా. స్టార్ ఆఫ్ ద ఈస్ట్ బ్యానర్ పై రఘుపతి వెంకయ్య కుమారుడు రఘుపతి సుర్యప్రకాష్ దర్శకత్వం వహించి నిర్మించాడు. ఈ సినిమాలో భీష్ముని పాత్రలో రఘుపతి సూర్యప్రకాష్ నటించాడు.[1] ఇది తెలుగు నిర్మాత తీసిన మొదటి చిత్రంగా చారిత్రాత్మకమైంది.

విశేషాలు[మార్చు]

1921లో తీసిన "భీష్మ ప్రతిజ్ఞ" తొలి తెలుగు మూకీ చిత్రంగా చెప్పబడుతుంది. మాటలు లేవు గనుక "తెలుగు" చిత్రం అనడం కొంత అసంబద్ధం. "తెలుగు వాడు" తీసిన చిత్రం అని చెప్పడం సమంజసం.

రఘుపతి వెంకయ్య తన కుమారుడు ఆర్.ఎస్.ప్రకాష్‌ ను సినిమా నిర్మాణం నేర్చుకోవడానికి విదేశాలు పంపాడు. ప్రకాష్ జర్మనీ, ఇటలీ, అమెరికా దేశాలు పర్యటించాడు. "టెన్ కమాండ్‌మెంట్స్ " చిత్రాన్ని "సిసిల్ బి డెమిల్లి" అనే దర్శకుడు నిర్మిస్తున్నప్పుడు అతని వద్ద సహాయకునిగా కొంతకాలం పనిచేసాడు.

ప్రకాష్ తిరిగి వచ్చిన తరువాత ఈయన దక్షిణభారతదేశంలో మొట్టమొదటి సినిమా నిర్మాణ సంస్థ 'స్టార్ ఆఫ్ ద ఈస్ట్' ను స్థాపిచాడు. 1921లో భీష్మప్రతిజ్ఞ మూగచిత్రాన్ని నిర్మించారు . ప్రకాష్ దర్శకత్వం వహించడమే కాకుండా ఈ చిత్రంలో భీష్ముని పాత్రను కూడా పోషించాడు. 'డి కాస్టెల్లో' అనే ఆంగ్లయువతి గంగ పాత్రను ధరించింది.

తరువాత ఈ తండ్రీకొడుకులు "మత్స్యావతార్", "నందనార్", "గజేంద్రమోక్షం" వంటి మరికొన్ని మూగసినిమాలను తీశారు. తరువాత ప్రసిద్ధులైన సి.పుల్లయ్య, వై.వి.రావులూ ప్రకాష్ అనుచరులుగా తమ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

మూలాలు[మార్చు]

  1. "Bhishma Pratigya (1921)". Indiancine.ma. Retrieved 2020-09-04.

బాహ్య లంకెలు[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో భీష్మ ప్రతిజ్ఞ