దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
Lbnagar MLA.jpg
శాసనసభ్యుడు, తెలంగాణ
In office
2018-ప్రస్తుతం
నియోజకవర్గంఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ్యుడు, ఆంధ్రప్రదేశ్
In office
2009-2014
నియోజకవర్గంఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం
చైర్మన్, హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ
In office
2004-2008
వ్యక్తిగత వివరాలు
జననం (1962-07-27) 1962 జూలై 27 (వయసు 60)
హైద్రాబాద్
రాజకీయ పార్టీభారత్ రాష్ట్ర సమితి (2019 మార్చి నుండి)
ఇతర రాజకీయ
పదవులు
భారత జాతీయ కాంగ్రెస్ (2019 మార్చి వరకు)
జీవిత భాగస్వామికమలారెడ్డి
సంతానంఇద్దరు కుమారులు
తల్లిదండ్రులుజయచంద్రారెడ్డి - చంద్రకళ
కళాశాలఉస్మానియా విశ్వవిద్యాలయం
వెబ్‌సైట్http://dsudheerreddy.com/

దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1][2] 2004 నుండి 2008 వరకు హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పనిచేశాడు.[3] 2020 ఫిబ్రవరిలో మూడేళ్ళపాటు తెలంగాణ ప్రభుత్వం మూసీ రివర్ డెవలప్‌మెంట్ ఫ్రంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్‌గా నియమించింది.[4]

జననం, విద్య[మార్చు]

సుధీర్ రెడ్డి 1962, జూలై 27న జయచంద్రారెడ్డి - చంద్రకళ దంపతులకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు. తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశాడు. సుధీర్ రెడ్డి బిఏ వరకు చదువుకున్నాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

సుధీర్ రెడ్డికి కమలారెడ్డితో వివాహం జరిగింది.[5] వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

రాజకీయ విశేషాలు[మార్చు]

1986లో హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో పోటీచేసి తొలిసారి మలక్‌పేట నుంచి కార్పొరేటర్ గా ఎన్నికయ్యాడు.[6] కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2008 మధ్య హుడా చైర్మన్‌గా పనిచేశాడు. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎల్బీ నగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ పార్టీ అభ్యర్థి ఎస్.వి.కృష్ణ ప్రసాద్ పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు.[7] 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ పై పోటీ చేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆర్. కృష్ణయ్య పై ఓడిపోయాడు. 2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి ముద్దగోని రామోహన్ గౌడ్  పై 17,848 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[8] 2019లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన ఆయనకు, 2020లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూసీ నది తీరప్రాంత అభివృద్ధి సంస్థ (మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ) ఛైర్మన్‌గా నియమించింది.[9][10]

సుధీర్ రెడ్డి, కుటుంబం (2018)

మూలాలు[మార్చు]

  1. https://nocorruption.in/politician/sudheer-reddy-devireddy/
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-06. Retrieved 2019-05-21.
  3. "Andhra Pradesh / Hyderabad News : Sudheer Reddy takes charge as HUDA chief". The Hindu. 2004-06-12. Retrieved 2019-01-12.[dead link]
  4. "MLA Sudheer Reddy named chairman of Musi Corpn". The New Indian Express. Retrieved 2020-03-12.
  5. India, The Hans (2018-11-17). "Spouse campaigns for Sudhir Reddy". www.thehansindia.com. Retrieved 2019-05-31.
  6. "Americanteluguassociation" (PDF). Archived from the original (PDF) on 2019-05-31. Retrieved 2019-06-01.
  7. "Andhra Pradesh Assembly Election Results in 2009". www.elections.in. Retrieved 2019-08-27.[permanent dead link]
  8. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  9. News18 telugu, News18 telugu (8 February 2020). "పార్టీ మారిన ఎమ్మెల్యేకు కేబినెట్ ర్యాంక్ పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్..." News18 Telugu. Archived from the original on 5 April 2021. Retrieved 5 April 2021.
  10. ఈనాడు, ఈనాడు (5 February 2021). "ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యేకు కీలక పదవి". m.eenadu.net. Archived from the original on 5 April 2021. Retrieved 5 April 2021.