మైనంపల్లి హన్మంతరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మైనంపల్లి హన్మంతరావు
మైనంపల్లి హన్మంతరావు

మైనంపల్లి హన్మంతరావు


శాసనసభ్యుడు
నియోజకవర్గం మల్కాజ్‌గిరి

వ్యక్తిగత వివరాలు

జననం (1966-01-10) 1966 జనవరి 10 (వయసు 57)
కొర్విపల్లి, మెదక్ జిల్లా
తల్లిదండ్రులు కిషన్ రావు, సరోజినీ
జీవిత భాగస్వామి వాణి
సంతానం మైనంపల్లి రోహిత్, మైనంపల్లి శివాంక్
నివాసం అశోక బిల్డర్స్, దూలపల్లి , మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా

మైనంపల్లి హన్మంతరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2018లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

మైనంపల్లి హన్మంతరావు తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా కొర్విపల్లి గ్రామంలో 1966 జనవరి 10న కిషన్ రావు, సరోజినీ దంపతులకు జన్మించాడు. ఆయన 1992లో యూ.ఎస్ లోని అలబామా యూనివర్సిటీ నుండి బిఎ పూర్తి చేశాడు.[3]

రాజకీయ జీవితం[మార్చు]

మైనంపల్లి హన్మంతరావు 1998లో తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2008 జరిగిన ఉప ఎన్నికలలో రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు . మైనంపల్లి హన్మంతరావు 2009 జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శశిధర్ రెడ్డిపై 21151 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన మెదక్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పని చేశాడు.

తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హన్మంతరావు మల్కాజ్‌గిరి నియోజకవర్గం టీడీపీ టికెట్ ఆశించాడు, 2014లో ఎన్నికల్లో తెలుగు దేశం, బీజేపీ పొత్తుతో భాగంగా ఆయనకు టికెట్ దక్కకపోవడంతో 2014 ఏప్రిల్ 6న మైనంపల్లి హన్మంతరావు టీడీపీకి రాజీనామా చేశాడు.[4][5]ఆయన 8 ఏప్రిల్, 2014న కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ అదే రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో [6] హన్మంతరావు 8 ఏప్రిల్, 2014న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[7]

ఆయన 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి సి.హెచ్. మల్లారెడ్డి పై 28371 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.ఆయన 21 ఏప్రిల్ 2015లో తెలంగాణ రాష్ట్ర సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[8] ఆయన 2017లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[9] మైనంపల్లి హన్మంతరావు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్. రామచందర్ రావు పై 73698 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యేగా గెలవడంతో 12 డిసెంబర్ 2018న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాడు.

మూలాలు[మార్చు]

  1. News18 (2018). "Malkajgiri Assembly constituency (Telangana): Full details, live and past results". Archived from the original on 19 August 2021. Retrieved 19 August 2021.
  2. Namasthe Telangana (6 March 2021). "బండ చెరువు నాలా పనులను జీహెచ్‌ఎంసీకి అప్పగించాలి". Archived from the original on 14 July 2021. Retrieved 14 July 2021.
  3. Suryaa (23 November 2018). "Graduated in 1992 but qualification is intermediate". suryaa. Archived from the original on 19 August 2021. Retrieved 19 August 2021.
  4. The Hans India (6 April 2014). "Miffed TDP MLA Hanumantha Rao resigns" (in ఇంగ్లీష్). Archived from the original on 19 August 2021. Retrieved 19 August 2021.
  5. Sakshi (6 April 2014). "టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి". Archived from the original on 19 August 2021. Retrieved 19 August 2021.
  6. Sakshi (8 April 2014). "బాబుకు మైనంపల్లి.. మైనంపల్లికి కాంగ్రెస్.. షాక్". Archived from the original on 19 August 2021. Retrieved 19 August 2021.
  7. Sakshi (8 April 2014). "కారు ఎక్కిన మైనంపల్లి". Archived from the original on 19 August 2021. Retrieved 19 August 2021.
  8. Sakshi (21 April 2015). "టీఆర్‌ఎస్ గ్రేటర్ అధ్యక్షునిగా మైనంపల్లి". Archived from the original on 19 August 2021. Retrieved 19 August 2021.
  9. Sakshi (31 March 2017). "నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం". Archived from the original on 19 August 2021. Retrieved 19 August 2021.

వెలుపలి లంకెలు[మార్చు]