మర్రి రాజశేఖర్‌రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మర్రి రాజశేఖర్‌రెడ్డి
మర్రి రాజశేఖర్‌రెడ్డి


రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త, విద్యావేత్త

వ్యక్తిగత వివరాలు

జననం (1970-06-17)1970 జూన్ 17
హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి మమతారెడ్డి
సంతానం అనుశ్రయ రెడ్డి (కుమార్తె)
ధీరేన్ రెడ్డి (కుమారుడు)
నివాసం హైదరాబాదు

మర్రి రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త, విద్యావేత్త. ఈయన మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (దుండిగల్), మరికొన్ని విద్యాసంస్థలకు చైర్మన్, డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. మర్రి రాజశేఖర్‌రెడ్డి 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాడు.[1]

జీవిత విషయాలు[మార్చు]

రాజశేఖర్‌ 1970, జూన్ 17న హైదరాబాదులో జన్మించాడు. రాజశేఖర్‌ రెడ్డి తన గ్రాడ్యుయేషన్ చదువును మధ్యలోనే ఆపేసి, తన తండ్రి లక్ష్మణ్ రెడ్డికి వ్యాపారంలో సహాయం చేశాడు.[2]

విద్యారంగ సేవలు[మార్చు]

తరువాతికాలంలో రాజేశేఖర్ రెడ్డి హైదరాబాదులో పలు విద్యాసంస్థలు స్థాపించాడు. ప్రస్తుతం ఆయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఎం.ఎల్.ఆర్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎం.ఎల్.ఇర్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ లకు చైర్మన్ గా, వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కు వైస్ చైర్మన్ గా, సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కళాశాలకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు.

సామాజిక సేవ[మార్చు]

తన కళాశాలలలో పేద విద్యార్థులకు సహాయం చేస్తున్నాడు. క్రీడల పల్ల ఆసక్తివున్న 30మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను ఇస్తున్నాడు.[3] మేడ్చల్ జిల్లాలో ఆరు గ్రామాలను దత్తత తీసుకొని, ఆ గ్రామాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశాడు. కరోనా వైరస్ 2019 మహమ్మారి లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులకు, దినసరి కూలీలకు ప్రతిరోజూ నాలుగు కేంద్రాలలో దాదాపు 3వేల మందికి మధ్యాహ్న భోజనం అందించాడు. అనాథాశ్రమాలకు నిత్యావసరాలను పంపిణీ చేశాడు. సీఎం రిలీఫ్ ఫండ్ కు 30 లక్షల విరాళం ఇచ్చాడు.[4]

రాజకీయరంగం[మార్చు]

రాజశేఖర్‌రెడ్డి సమీప బంధువు సి.హెచ్. మల్లారెడ్డి రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ని ఆదర్శంగా తీసుకొని రాజకీయల్లోకి వచ్చిన రాజశేఖర్‌రెడ్డి ప్రస్తుతం టిఆర్‌ఎస్ పార్టీ మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం ఇన్‌చార్జిగా ఉన్నాడు.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 మన తెలంగాణ, రాష్ట్ర వార్తలు (3 April 2019). "కంటోన్మెంట్ సమస్యలు పరిష్కరిస్తా". Chauhan Ramesh. Archived from the original on 22 July 2021. Retrieved 22 July 2021.
  2. The New Indian Express, Telangana (4 April 2019). "Malla Reddy's son-in-law is confident". Archived from the original on 4 April 2019. Retrieved 22 July 2021.
  3. "Marri Rajashekar Reddy, Secretary of Marri Laxman Reddy Institute of Technology speaks about the future of education". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2021-07-22.
  4. ఆంధ్రప్రభ, హైదరాబాదు (19 April 2020). "మనసున్న రాజశేఖరుడు". epaper.prabhanews.com. p. 8. Archived from the original on 22 July 2021. Retrieved 22 July 2021.