శ్రీనగర్ కాలనీ
శ్రీనగర్ కాలనీ | |
---|---|
సమీప ప్రాంతాలు | |
నిర్దేశాంకాలు: 17°24′59″N 78°26′18″E / 17.416471°N 78.438247°ECoordinates: 17°24′59″N 78°26′18″E / 17.416471°N 78.438247°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ |
మెట్రో | హైదరాబాద్ |
ప్రభుత్వం | |
• నిర్వహణ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 500073 |
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు | టి.ఎస్ |
లోకసభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
జాలస్థలి | telangana |
శ్రీనగర్ కాలనీ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. హైదరాబాదు నగరానికి పశ్చిమాన ఉన్న ఈ శ్రీనగర్ కాలనీ వ్యాపారాలకు, నివాసానికి అత్యంత ప్రముఖమైన ప్రాంతంగా ప్రసిద్ధిచెందింది.
వ్యాపార ప్రాంతం[మార్చు]
శ్రీనగర్ కాలనీ చుట్టుపక్కల అనేక బ్యాంకులు, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు, అనేక సాఫ్టువేర్ సంస్థలు ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్, పివిఆర్ సినిమాస్, బిగ్ బజార్ (బిగ్ సినిమాస్), సినిమామాక్స్, జి.వికె వన్ (ఇనాక్స్) వంటి అనేక మాల్స్, థియేటర్లు శ్రీనగర్ కాలనీకి అతి సమీపంలో ఉన్నాయి.
నివాస ప్రాంతం[మార్చు]
శ్రీనగర్ కాలనీ మాధాపూర్ కు సమీపంలో ఉండడంవల్ల అక్కడ పనిచేసి సాప్టువేర్ ఉద్యోగులు కొంతమంది శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అందువల్ల ఇక్కడ ఎక్కువ మొత్తంలో నూతన భవంతులు నిర్మించబడ్డాయి. అంతేకాకుండా గత కొద్ది సంవత్సరాలనుండి ఇక్కడ భూముల ధరలు కూడా పెరిగాయి. 50వేలకుపైగా అద్దె ధరలతో నగరంలో ఇది ఉత్తమ నివాస ప్రదేశంగా ఉంది. ఈ ప్రాంతంలో చాలా భవనం ఐదు అంతస్తులు, రహదారిలో చాలా చిన్న పార్కులు ఉన్నాయి. చలనచిత్ర, టెలివిజన్ నటులకు బాగా ప్రసిద్ధి చెందిన గణపతి కాంప్లెక్స్ కూడా ఇక్కడే ఉంది.
రవాణా[మార్చు]
శ్రీనగర్ కాలనీ నుండి నగరంలోని అన్ని ప్రాంతాలకు వివిధ వాహనాల రవాణా సదుపాయం ఉంది.
దేవాలయాలు[మార్చు]
శ్రీనగర్ కాలనీ నుండి కృష్ణానగర్ వెళ్లే దారిలో వేంకటేశ్వరస్వామి దేవాలయం, సత్యసాయి నిగమాగమం ఉన్నాయి.[1]
మూలాలు[మార్చు]
- ↑ నమస్తే తెలంగాణ (19 June 2016). "సత్యసాయి నిగమాగమంలో జంధ్యాల హాస్యోత్సవం". Retrieved 7 June 2018.[permanent dead link]