సనత్‌నగర్
సనత్‌నగర్ | |
---|---|
సమీప ప్రాంతాలు | |
![]() కంజర్ల లక్ష్మీనారాయణ యాదవ్ పార్కు | |
నిర్దేశాంకాలు: 17°29′N 78°25′E / 17.483°N 78.417°ECoordinates: 17°29′N 78°25′E / 17.483°N 78.417°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ |
మెట్రో | హైదరాబాద్ |
ప్రభుత్వం | |
• నిర్వహణ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 500018 |
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు | టి.ఎస్ |
లోకసభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
జాలస్థలి | telangana |
సనత్‌నగర్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1][2] ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నందున ఇది పారిశ్రామిక ప్రాంతంగా పిలువబడుతుంది. ఇది సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది. ప్రస్తుతం దీనికి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[3][4][5]
విద్య[మార్చు]
ఈ ప్రాంతంలో 1964లో మొట్టమొదటగా కావెల్స్ హైస్కూల్ ఏర్పాటుచేయబడింది. 1965లో సెయింట్ థెరిస్సా బాలికల హైస్కూల్ ఏర్పడింది. సనత్‌నగర్ లో ఉన్న పాఠశాలల్లో హిందూ పబ్లిక్ స్కూల్ అతిపెద్ద పాఠశాల.
రోజ్ బడ్స్ హైస్కూల్, నీనా హైస్కూల్ (1984లో స్థాపించబడింది), క్రెసెంట్ కాన్వెంట్ హైస్కూల్ (1996 లో స్థాపించబడింది), వశిష్ట విద్యాలయ, విద్యాంజలి హైస్కూల్, రెయిన్బో స్కూల్, గౌతమి విద్యా ధామ్, జై భారతి స్కూల్, లిటిల్ స్కాలర్స్ స్కూల్ వంటివి ఇక్కడ ఉన్నాయి. మహిళల హిందూ కళాశాల కూడా ఉంది.
ఆరోగ్యం[మార్చు]
సెయింట్ తెరెసా ఆసుపత్రి ఈ ప్రాంతంలో ఉన్న పురాతన ఆసుపత్రులలో ఒకటి. ఇందులో ఇటీవలే మరిన్ని వార్డులను నిర్మించారు. ప్రభుత్వ ఈ.ఎస్.ఐ. ఆసుపత్రి కూడా ఇక్కడ ఉంది. ఛాతీ ఆసుపత్రి, క్షయ ఆసుపత్రి, మానసిక రోగుల ఆసుపత్రులు కూడా ఉండి, పేదలకు ఆరోగ్య సంరక్షణ అందిస్తున్నాయి.
సమీప ప్రాంతాలు[మార్చు]
సనత్‌నగర్ కు సమీపంలో చెక్ కాలనీ, బి.కె. గూడా, సుభాష్ నగర్ కాలనీ, తులసీ నగర్, జయప్రకాశ్ నగర్ కాలనీ, ఇఎస్ఐ, ఫతేనగర్ మొదలైనవి ఉన్నాయి.
చిత్రమాలిక[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ http://www.mapsofindia.com/hyderabad/localities/sanath-nagar.html
- ↑ Sanathnagar Archived 14 మే 2015 at the Wayback Machine
- ↑ ఆంధ్రప్రభ, హైదరాబాద్ (18 April 2018). "సనత్‌నగర్ : వారంరోజుల్లో కమ్యూనిటీ హాళ్లను వినియోగంలోకి తీసుకురావాలి : మంత్రి తలసాని". Retrieved 24 May 2018.[permanent dead link]
- ↑ http://myneta.info/andhra2014/candidate.php?candidate_id=1823
- ↑ http://www.sanathnagarassembly.tk/p/divisions.html[permanent dead link]
ఇతర లంకెలు[మార్చు]
