మీర్‌పేట్
మీర్‌పేట్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°49′N 78°32′E / 17.817°N 78.533°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా |
భాష | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500 076 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
మీర్‌పేట్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు శివారు ప్రాంతం. ఇది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, ఉప్పల్ మండల పరిధిలోకి వస్తుంది. ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థ పరిధిలో వార్డు నంబరు 5గా ఉంది.[1]
సమీప ప్రాంతాలు
[మార్చు]నాచారం, హబ్సిగూడ, గాయత్రీ హిల్స్, చిలుకనగర్, హేమ నగర్ కాలనీ, సాయి రెసిడెన్సీ, న్యూ హేమ నగర్, మూసి నగర్, ఎపిక్ కాలనీ, విఎన్ఆర్ ఎన్క్లేవ్, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఏరియా మొదలైన ప్రాంతాలు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.[2]
రవాణా
[మార్చు]రైలుమార్గం
[మార్చు]ఇక్కడికి సమీపంలో మౌలాలీ రైల్వే స్టేషను, సఫిల్ గూడ రైల్వే స్టేషను ఉన్నాయి. సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను ఇక్కడికి 9 కి.మీ.ల దూరంలో ఉంది. సీతాఫల్‌మండి రైల్వే స్టేషనులో హైదరాబాదు ఎం.ఎం.టి.ఎస్ స్టేషను ఉంది.
రోడ్డుమార్గం
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మీర్‌పేట్ నుండి నగరంలోని కుషాయిగూడ, అఫ్జల్‌గంజ్, ఇసిఐఎల్, దమ్మాయిగూడ, యాప్రాల్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.
మెట్రోమార్గం
[మార్చు]ఇక్కడికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న హబ్సిగూడలో హైదరాబాద్ మెట్రో రైలు 3వ కారిడార్ లోని హబ్సిగూడ మెట్రో స్టేషను ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). హైదరాబాదు మహానగరపాలక సంస్థ. Archived from the original (PDF) on 2019-06-15. Retrieved 2021-07-11.
- ↑ "Old Meerpet Locality". www.onefivenine.com. Retrieved 2021-07-11.