యాప్రాల్
యాప్రాల్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°30′N 78°33′E / 17.500°N 78.550°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ |
అల్వాల్ | మల్కాజ్‌గిరి |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాష | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500087 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | మల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
యాప్రాల్, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, అల్వాల్ మండలానికి చెందిన గ్రామం, ఈశాన్య సికింద్రాబాదు శివారులోని ఒక ప్రాంతం.[1] 1980ల మధ్యకాలంవరకు అల్వాల్ మున్సిపల్ కార్పోరేషన్ పరధిలో గ్రామ పంచాయితీగా ఉండేది. 2007లో అల్వాల్‌తో సహా 12 మున్సిపాలిటీలు, హైదరాబాదు పరిసరాల్లోని 8 గ్రామ పంచాయతీలు విలీనం చేయబడి హైదరాబాదు మహానగరపాలక సంస్థగా (జిహెచ్‌ఎంసి) ఏర్పడింది. అప్పటినుండి ఇది జిహెచ్‌ఎంసి (నేరెడ్‌మెట్ డివిజన్, మల్కాజ్‌గిరి సర్కిల్) లో ఒక భాగంగా ఉంది.[2]
నివాసప్రాంతంగా
[మార్చు]1980ల కాలంలో ఈ యాప్రాల్ ప్రాంతం వ్యవసాయ భూములతో, 3000ల కన్నా తక్కువ జనాభాతో ఉండేది. తరువాతికాలంలో ఇది నివాస ప్రాంతంగా మారింది.
- భాను ఎన్క్లేవ్
- సిల్వాన్ గార్డెన్స్
- గ్రీన్వుడ్ రెసిడెన్సీ
- పటేల్ గ్రీన్ పార్క్
- గ్రీన్ ఫ్రంట్
- మణి ఎన్క్లేవ్
- ప్రకృతిక్ విహార్
- జూపల్లి హోమ్స్
- తులసి గార్డెన్స్
- షైలీ గార్డెన్స్
- మహాలక్ష్మిపురి కాలనీ
- రాధా రీగల్ రోస్
- స్వర్ణాంధ్ర నగర్
- సాయికృపా కాలనీ
- ఎంప్లాయీస్ కాలనీ
- సాయి ఎన్క్లేవ్
- లేక్ మెడోస్
- రాజా కన్వెన్షన్
సమీప ప్రాంతాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో సైనిక్ పురి, కాప్రా, అల్వాల్, బొల్లారం, కౌకూర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
సంస్కృతి
[మార్చు]ఈ ప్రాంతంలోని యాప్రాల్ సరస్సు, ఇక్కడి వ్యవసాయానికి ప్రధాన నీటి వనరుగా ఉంది. అనేక దశాబ్దాలుగా, మహాంకాళి బోనాలు, మల్లన్న జాతర పండుగలు జరుపుకుంటున్నారు.
- మహాంకాళి దేవాలయం
- పోచమ్మ దేవాలయం
- రంగనాయక్ దేవాలయం
- మల్లన్న దేవాలయం
- సాయిబాబా దేవాలయం
- హనుమాన్ దేవాలయం
మూలాలు
[మార్చు]- ↑ "Yapral, Secunderabad, Ranga Reddy Locality". www.onefivenine.com. Retrieved 2021-01-30.
- ↑ "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 2019-06-15. Retrieved 2021-01-30.