అజంపురా
అజంపురా | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°22′34″N 78°29′25″E / 17.37611°N 78.49028°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500 024 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | మలక్పేట్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
అజంపురా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు మూసి నది ఒడ్డున ఉన్న ప్రాంతం. ఇక్కడికి సమీపంలో డబీర్‌పూర్, సైదాబాద్, చాదర్ ఘాట్, మలక్‌పేట, చంచల్‌గూడ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[1] 2003 నాటికి అజాంపూరాలో 27,500 మంది జనాభా ఉన్నారు.[2] పాతబస్తీ శివారు ప్రాంతాల మాదిరిగానే ఇక్కడ కూడా ముస్లిం జనాభా ఎక్కువ ఉంది. అజంపురా చాదర్‌ఘాట్ పోలీసు స్టేషను అధికార పరిధిలోకి వస్తుంది.
సమీప ప్రాంతాలు
[మార్చు]మలక్‌పేట, తిర్మల ఆర్కేడ్, రాణిబాగ్, కాశీ ఖబర్, అష్రఫ్ నగర్ మొదలైన ప్రాంతాలు అజంపురాకు సమీపంలో ఉన్నాయి.[3]
వాణిజ్య ప్రాంతం
[మార్చు]అజంపురా ప్రాంతంలోని మసీదు-ఎ-సాహిఫా చుట్టూ అనేక దుకాణాలు ఉన్నాయి. హైదరాబాదు బిర్యాని, హలీమ్, నిహారీ, కబాబ్స్ వంటి వంటకాలు లభించే రెస్టారెంట్లు ఉన్నాయి. ముస్లిం ప్రసూతి ఆసుపత్రి, తుంబే ఆసుపత్రి వంటి అనేక ఆసుపత్రులు ఈ ప్రాంతంలో ఉన్నాయి.
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో అజంపురా నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో మలక్‌పేట మెట్రో స్టేషను, మలక్‌పేట రైల్వే స్టేషను ఉంది.[3]
ఇతర వివరాలు
[మార్చు]మస్జిద్-ఇ-సాహిఫా అజంపురాలోని ఒక పేరొందిన మసీదు. ఇక్కడ అజాంపురా చమన్/రోటరీ పార్కు, అనేక స్థానిక క్రికెట్ పోటీలు జరుగుతున్న టార్జాన్ మైదానం, రాష్ట్ర గ్రంథాలయం, కమ్యూనిటీ హాల్ కూడా ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ Dec 17, TNN / Updated:; 2012; Ist, 06:04. "Azampura road under bridge design worries officials | Hyderabad News - Times of India". The Times of India. Retrieved 2021-01-23.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link) CS1 maint: url-status (link) - ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-24. Retrieved 2021-01-23.
- ↑ 3.0 3.1 "Azampura Locality". www.onefivenine.com. Retrieved 2021-01-23.