రామంతాపూర్ ఖల్సా
రామంతాపూర్ ఖల్సా | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°23′31″N 78°32′18″E / 17.3919297°N 78.5383792°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ |
మండలం | హైదరాబాదు |
జోన్ | తూర్పు |
సర్కిల్ | ఉప్పల్ కలాన్ |
వార్డు | 7 |
Government | |
• Type | మున్సిపల్ |
Elevation | 494 మీ (1,621 అ.) |
జనాభా (2011)[2] | |
• Total | 40,373 |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 500 013 |
2703 | +91–40 |
Vehicle registration | టిఎస్ |
రామంతపూర్, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్ మండలంలో హైదరాబాదు నగరానికి తూర్పువైపున ఉంది. ఉప్పల్ నుండి కాచిగూడకు వెళ్ళే రహదారిలో ఉప్పల్, అంబర్‌పేట్ మధ్యనున్న ఈ ప్రాంతం1920ల ప్రారంభం నుండి బాగా అభివృద్ధి చెందింది. కొత్త నివాస భవనాల నిర్మాణం పెరగడంతో జనాభా కూడా పెరిగింది. ఇదిగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 9వ వార్డులో ఉంది.[3]
సంస్థలు
[మార్చు]ఈ ప్రాంతంలోని సంస్థలలో సిఎఫ్ఎస్ఎల్ హైదరాబాద్, సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ స్కూల్, ప్రభుత్వ హోమియోపతి కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. అరోరా పిజి కళాశాల ప్రధాన క్యాంపస్ కు ఇక్కడే ఉంది. డిడి యాదగిరి టివి స్టూడియో కూడా రామంతపూర్ ప్రాంతంలోనే ఉంది.
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో రామంతపూర్ మీదుగా బస్సులు నడుపబడుతున్నాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంల వద్ద మెట్రో రైలు స్టేషన్లు ఉన్నాయి.
అభివృద్ధి పనులు
[మార్చు]రామంతపూర్‌లో రూ.2.2 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఎస్‌టీపీ పనులకు 2022 మార్చి 11న తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖామంత్రి చామకూర మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాశ్ రెడ్డి, హైదరాబాదు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, ఇత ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Elevation for Ramanthapur, Hyderabad". Veloroutes. Retrieved 19 August 2015.
- ↑ "Delimitation of Election Wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 10 నవంబరు 2011. Retrieved 12 జూన్ 2017.
- ↑ "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 2019-06-15. Retrieved 2020-07-01.
- ↑ telugu, NT News (2022-03-11). "వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు : మంత్రి కేటీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-03-11. Retrieved 2022-03-13.
- ↑ telugu, 10tv (2022-03-11). "KTR: ఉప్పల్‌లో అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన | Uppal Development programs started by Minister KTR". 10TV (in telugu). Archived from the original on 2022-03-11. Retrieved 2022-03-13.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Web, Disha (2022-03-11). "ఉప్పల్‌లో కేటీఆర్ కీలక ప్రకటన.. వారందరికి గుడ్ న్యూస్." dishadaily.com. Archived from the original on 2022-03-11. Retrieved 2022-03-13.