ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్ల జాబితా

వికీపీడియా నుండి
(ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ జిల్లాలు

ఆంధ్రప్రదేశ్ లో 76 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. వీటికి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ) అధిపతిగా ఉంటాడు. రెవెన్యూ డివిజన్లు కేంద్రాలను ఉప జిల్లాలు అనికూడా అంటారు.

చరిత్ర

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022కు ముందు 2021 డిసెంబరు 22న ఏర్పడిన బద్వేల్ రెవెన్యూ డివిజనుతో కలిపి రాష్ట్రంలో 51 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. తొలి పునర్వ్యవస్థీకరణలో కొత్తగా 22 రెవెన్యూ డివిజన్లు ఏర్పాడ్డాయి.[1] ఆ తరువాత కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లాలో 7 మండలాలతో 2022 జూన్ 29 న కొత్తపేట కేంద్రంగా కొత్తపేట రెవెన్యూ డివిజను, వైఎస్ఆర్ జిల్లాలో 8 మండలాలతో పులివందుల కేంద్రంగా పులివెందుల రెవెన్యూ డివిజను, కొత్తగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో 9 మండలాలతో 2022 ఆగస్టు 5న రేపల్లె కేంద్రంగా రేపల్లె రెవెన్యూ డివిజను ఏర్పడ్డాయి.

అయితే తూర్పు గోదావరి జిల్లా లోని ఎటపాక రెవెన్యూ డివిజనులో ఉన్న నాలుగు మండలాలు, డివిజను కేంద్రం ఎటపాకను, పునర్వ్యవస్థీకరణలో కొత్తగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లాలో భాగంగా చేర్చి, ఎటపాక రెవెన్యూ డివిజనులో ఉన్న మండలాలు కొత్తగా ఏర్పడిన రంపచోడవరం రెవెన్యూ డివిజనులో కలిసాయి.దాని పర్యవసానంగా ఎటపాక రెవెన్యూ డివిజను రద్దై, చారిత్రాత్మక రెవెన్యూ డివిజనుగా మిగిలింది. ఆ తరువాత 2022 అక్టోబరు 25 న రంపచోడవరం రెవెన్యూ డివిజనులోని నాలుగు మండలాలతో (ఈ మండలాలు ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 కు ముందు ఎటపాక రెవెన్యూ డివిజనులో ఉన్నాయి) చింతూరు రెవెన్యూ డివిజను ఏర్పడింది.[2]

రెవెన్యూ విభాగాల జాబితా

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 76 రెవెన్యూ డివిజన్ల పట్టిక[3][4]

జిల్లా రెవెన్యూ డివిజన్ల సంఖ్య రెవెన్యూ డివిజన్ల పేర్లు
అనకాపల్లి 2 అనకాపల్లి, నర్సీపట్నం
అనంతపురం 3 గుంతకల్ (కొత్త), అనంతపురం, కళ్యాణదుర్గం
అన్నమయ్య 3 రాజంపేట, రాయచోటి (కొత్త), మదనపల్లి
అల్లూరి సీతారామరాజు 3 పాడేరు, రంపచోడవరం, చింతూరు
ఎన్టీఆర్ 3 విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త)
ఏలూరు 3 జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు
కర్నూలు 3 కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త)
కాకినాడ 2 పెద్దాపురం, కాకినాడ
కృష్ణా 3 గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త)
కోనసీమ 3 రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట (కొత్త) [5][6]
గుంటూరు 2 గుంటూరు, తెనాలి
చిత్తూరు 4 చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త)
తిరుపతి 4 గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి (కొత్త), తిరుపతి
తూర్పుగోదావరి 2 రాజమహేంద్రవరం, కొవ్వూరు
నంద్యాల 3 ఆత్మకూరు (కొత్త), నంద్యాల, డోన్ (కొత్త)
పల్నాడు 3 గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త)
పశ్చిమగోదావరి 2 నర్సాపురం, భీమవరం (కొత్త)
పార్వతీపురం మన్యం 2 పార్వతీపురం, పాలకొండ
ప్రకాశం 3 మార్కాపురం, కనిగిరి (కొత్త), ఒంగోలు
బాపట్ల 3 బాపట్ల (కొత్త), చీరాల (కొత్త), రేపల్లె (కొత్త) [7]
విజయనగరం 3 బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం
విశాఖపట్నం 2 భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం
వైఎస్‌ఆర్ 4 బద్వేల్,[8] కడప, జమ్మలమడుగు, పులివెందుల (కొత్త) [9]
శ్రీకాకుళం 3 పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 4 కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు
శ్రీ సత్యసాయి 4 ధర్మవరం, కదిరి, పుట్టపర్తి (కొత్త), పెనుకొండ

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
  2. Government of Andhra Pradesh (2022-10-25). Andhra Pradesh Gazette, 2022-10-25, Extraordinary, Part PART I, Number 1399.
  3. DOP (2023). Socio economic survey 2022-23 (PDF). Government of AP. p. 431. Archived from the original (PDF) on 2024-03-28. Retrieved 2024-03-02.
  4. "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
  5. "కొత్తపేట రెవెన్యూ డివిజన - Andhrajyothy". web.archive.org. 2022-09-06. Archived from the original on 2022-09-06. Retrieved 2022-09-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. Government of Andhra Pradesh (2022-06-29). Andhra Pradesh Gazette, 2022-06-29, Extraordinary, Part PART I, Number 1031.
  7. Government of Andhra Pradesh (2022-08-05). Andhra Pradesh Gazette, 2022-08-05, Extraordinary, Part PART I, Number 1157.
  8. Government of Andhra Pradesh (2021-12-21). Andhra Pradesh Gazette, 2021-12-21, Extraordinary, Part PART I, Number 724.
  9. Government of Andhra Pradesh (2022-06-29). Andhra Pradesh Gazette, 2022-06-29, Extraordinary, Part PART I, Number 1033.