నాగర్‌కర్నూల్ మండలం
నాగర్‌కర్నూల్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1]
నాగర్‌కర్నూల్ | |
— మండలం — | |
నాగర్‌కర్నూల్ జిల్లా జిల్లా పటంలో నాగర్‌కర్నూల్ మండల స్థానం | |
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°29′00″N 78°20′00″E / 16.4833°N 78.3333°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | [[నాగర్‌కర్నూల్ జిల్లా]] |
మండల కేంద్రం | నాగర్‌కర్నూల్ |
గ్రామాలు | 23 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 74,728 |
- పురుషులు | 37,619 |
- స్త్రీలు | 37,109 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 53.49% |
- పురుషులు | 64.46% |
- స్త్రీలు | 42.14% |
పిన్‌కోడ్ | 509209 |
నాగర్‌కర్నూల్ సమైఖ్యఆంధ్రలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది . కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూల్ ని జిల్లాగా ప్రకటించారు.ఇది చుట్టుపక్క గ్రామాలకు ఈ మండల కేంద్రం ఒక పెద్ద వ్యాపార కూడలి. చుట్టుపక్క గ్రామాల ప్రజలు వారాంతమున సేద తీర్చుకొనుటకు ఇక్కడికి వచ్చి సినిమా చూసి పొతారు.ఒక్కపుడు ఇక్కడ 5 సినిమా హాళ్ళు వుండేవి. కానీ ఇప్పుడు 3 సినిమా హాళ్లు మాత్రమే ఉన్నాయి. చిన్నా పెద్ద పాఠశాలలు మొత్తము 50 దాక ఉన్నాయి.
భౌగోళిక సమాచారం[మార్చు]
నాగర్‌కర్నూల్ పట్టణం 16°48" ఉత్తర అక్షాంశం, 78°32" తూర్పు రేఖాంశంపై ఉంది.
రవాణా సదుపాయాలు[మార్చు]
మహబూబ్ నగర్ నుంచి ఈ పట్టణానికి విరివిగా బస్సు సదుపాయం ఉంది. మహబూబ్ నగర్ నుంచి శ్రీశైలం వెళ్ళు మార్గంలో 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు. దగ్గరలోని రైల్వే స్టేషను జడ్చర్ల, మహబూబ్ నగర్.
గణాంకాలు[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 74,728 - పురుషులు 37,619 - స్త్రీలు 37,109. అక్షరాస్యుల సంఖ్య 40394.[2]
లోక్‌సభ నియోజకవర్గం[మార్చు]
నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో కొత్తగా పునర్వ్యవస్థీకరణ ప్రకారం (7) వనపర్తి, గద్వాల, ఆలంపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ శాసనసభ నియోజక వర్గాలు ఉన్నాయి.
పట్టణములోని కళాశాలలు[మార్చు]
- ప్రభుత్వ జూనియర్ కళాశాల (స్థాపన:1970-71)
- వి.ఆర్.కె.మండల సహకార జూనియర్ కళాశాల (స్థాపన:1988-89)
- శ్రీనివాస పద్మావతి జూనియర్ కళాశాల (స్థాపన:1997-98)