మర్రి జనార్దన్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మర్రి జనార్దన్ రెడ్డి
మర్రి జనార్దన్ రెడ్డి


పదవీ కాలం
2014 - 2018, 2018 - ప్రస్తుతం
నియోజకవర్గం నాగర్ కర్నూల్‌ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం ఏప్రిల్ 8, 1969
నేరెళ్ళపల్లి, తిమ్మాజీపేట మండలం, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు జంగిరెడ్డి - అమృతమ్మ
జీవిత భాగస్వామి జమున రాణి
సంతానం ఒక కుమారుడు, ఒక కుమార్తె

మర్రి జనార్దన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున నాగర్ కర్నూల్‌ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1]

జననం, విద్య[మార్చు]

జనార్థన్ రెడ్డి 1969, ఏప్రిల్ 8న జంగిరెడ్డి - అమృతమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, నాగర్ కర్నూల్ జిల్లా, తిమ్మాజీపేట మండలంలోని నేరెళ్ళపల్లి గ్రామంలో జన్మించాడు. 1987లో బాదేపల్లిలోని జిల్లా పరిషత్ బాయ్స్ హైస్కూల్ లో పదవ తరగతి, తరువాత గ్రాడ్యుయేట్ పూర్తిచేశాడు.[2] కొంతకాలం వ్యాపారం చేశాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

జనార్థన్ రెడ్డికి జమునారాణితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

రాజకీయ విశేషాలు[మార్చు]

2012లో తెలుగుదేశం పార్టీ నుండి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. తరువాత టిఆర్ఎస్ పార్టీలో చేరాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూచుకుల్ల దామోదర్ రెడ్డి పై 14,435 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[3][4] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీపై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగం జనార్ధన్ రెడ్డి పై 54,354 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[5]

ఆయనను 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ నుండి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు.[6][7]

మూలాలు[మార్చు]

  1. "Member's Profile - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-09-05.
  2. "Marri Janardhan Reddy | MLA | Nerellapalli | Thimmajipet | Nagarkurnool | TRS". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-16. Retrieved 2021-09-05.
  3. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  4. "Marri Janardhan Reddy S/o Marri Jangi Reddy(TRS):Constituency- NAGARKURNOOL(MAHBUBNAGAR) - Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2021-09-05.
  5. "Marri Janardhan Reddy(TRS):Constituency- NAGARKURNOOL(NAGARKURNOOL) - Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2021-09-05.
  6. Namasthe Telangana (22 August 2023). "సమరానికి సై". Archived from the original on 13 November 2023. Retrieved 13 November 2023.
  7. Eenadu (14 November 2023). "ఎన్నికల బరిలో కోటీశ్వరులు". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.