కామారెడ్డి పెద్దచెరువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కామారెడ్డి పెద్దచెరువు
Kamareddy Pedda Cheruvu.jpeg
కామారెడ్డి పెద్దచెరువు
స్థానంకామారెడ్డి జిల్లా , తెలంగాణ
సరస్సు రకంచెరువు
ప్రవహించే దేశాలుభారతదేశం


కామారెడ్డి పెద్దచెరువు తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా కేంద్రానికి కిలోమీటర్ దూరంలో ఉంది. 1897లో నిజాం కాలంలో నిర్మించిన ఈ చెరువుకు దీనిని వారసత్వ సాగునీటి నిర్మాణ (హెచ్‌ఐఎస్) అవార్డుకు ఎంపికచేయడం జరిగింది.[1]

నిర్మాణం - సాగుబడి[మార్చు]

కామారెడ్డి చుట్టుపక్కలవున్న గ్రామాలలోని ప్రజలకు సాగు, తాగునీటి ఇబ్బందులు రాకుండా, వర్షపు నీటిని నిలువ ఉంచడానికి 1897లో ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ హయాంలో దోమకొండ సంస్థానముకు చెందిన రాజ మల్లారెడ్డి బహద్దూర్ దేశాయ్ ఈ చెరువును నిర్మించాడు.[2] 14 మీటర్ల ఎత్తుతో 175 ఎంసిఎఫ్‌టి సామర్థంతో నిర్మించిన ఈ చెరువు 858 ఎకరాల పంటకు సాగునీరు అందిస్తుంది. కామారెడ్డి, సారంపల్లి, క్యాసంపల్లె, ఉగ్రవాయి గ్రామాల పరిధిలో ఉన్న ఈ చెరువు స్థానికులకు తాగునీటి అందిస్తూ, మత్సకారులకు చేపల పెంపకంలో ఉపయోగపడుతుంది.

వారసత్వ సాగునీటి నిర్మాణంగా ఎంపిక[మార్చు]

కెనడాలోని సస్కటూన్‌లో 2018 ఆగష్టు 12నుండి 17వరకు జరిగిన 69వ ఐఈసీ సమావేశంలో తెలంగాణ నీటిపారుదలశాఖ పంపిన ప్రతిపాదనల్ని పరిశీలించి ఈ చెరువును వారసత్వ సాగునీటి నిర్మాణంగా ఎంపికచేశారు.[3]

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ (10 September 2018). "చెక్కుచెదరని నిర్మాణం.. సదర్‌మాట్". Archived from the original on 10 September 2018. Retrieved 11 September 2018. CS1 maint: discouraged parameter (link)
  2. నమస్తే తెలంగాణ (10 September 2018). "నిజాంసాగర్ కన్నా ముందటి చెరువు". Archived from the original on 11 September 2018. Retrieved 11 September 2018. CS1 maint: discouraged parameter (link)
  3. నమస్తే తెలంగాణ (10 September 2018). "సదర్‌మాట్, కామారెడ్డి పెద్దచెరువు వారసత్వ నిర్మాణాలు". Archived from the original on 10 September 2018. Retrieved 11 September 2018. CS1 maint: discouraged parameter (link)