Jump to content

ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాకామారెడ్డి

ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. కామారెడ్డి జిల్లాలోవున్న మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 4 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం ఎల్లారెడ్డి పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గం, ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.

వివరాలు

[మార్చు]

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం ఈ రెవెన్యూ డివిజన్ జనాభా - మొత్తం: 1,87,511 - పురుషులు: 91,988 - స్త్రీలు: 95,523 గా ఉంది.

పరిపాలన

[మార్చు]

ఎల్లారెడ్డి డివిజనులోని మండలాలు:[4]

క్ర.సం ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 ఎల్లారెడ్డి మండలం 31 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు)
2 నాగిరెడ్డిపేట మండలం 22 రెవెన్యూ గ్రామాలు
3 లింగంపేట్ మండలం 23 రెవెన్యూ గ్రామాలు
4 గాంధారి మండలం 33 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు)

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-05-01.
  3. "Revenue Divisions | District Kamareddy, Government of Telangana | India". www.kamareddy.telangana.gov.in. Archived from the original on 2022-02-15. Retrieved 2022-05-01.
  4. "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2022-05-01.