సిరిసిల్ల రాజయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిరిసిల్ల రాజయ్య
సిరిసిల్ల రాజయ్య

సిరిసిల్ల రాజయ్య


నియోజకవర్గం వరంగల్

వ్యక్తిగత వివరాలు

జననం (1953-10-05) 1953 అక్టోబరు 5 (వయసు 69)
లింగాపూర్, కరీంనగర్ జిల్లా
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి మాధవి
సంతానం 1 కొడుకు, 1 కూతురు

సిరిసిల్ల రాజయ్య వరంగల్లు (ఎస్.సి) పార్లమెంటరీ నియోజిక వర్గం నుండి 15వ లోక్ సభకు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు.

బాల్యం[మార్చు]

రాజయ్య 1953 అక్టోబరు 5 న కరీంనగర్ జిల్లాలోని లింగాపుర్ గ్రామంలో జన్మించారు. వీరి తల్లి దండ్రులు: శ్రీమతి శాంతమ్మ, శ్రీ బక్కయ్య.[1]

చదువు[మార్చు]

వీరు ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిధ్యాలయంలో వ్యవసాయ శాస్త్రంలో పట్టా పొందారు.

కుటుంబము[మార్చు]

రాజయ్య 9., మార్చి 1974 లో శ్రీమతి మాధవిని వివాహమాడారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె కలరు.

రాజకీయ ప్రస్థానము[మార్చు]

రాజయ్య 2009 లో 15వ లోక్ సభకు ఎన్నికయ్యారు.

అభిరుచులు[మార్చు]

ప్రజా సేవ, ప్రజలతో మమేకము కావడము, పాటలు వినడము, ఆట పాటలంటే వీరికి ఇష్టమైన విషయాలు.

హత్య కేసు[మార్చు]

రాజయ్య, కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారులు ఏడేళ్ళ అభినవ్, మూడేళ్ళ కవలలు అయోన్, శ్రీయోన్‌ల మరణం కేసులో అరెస్టయ్యాడు. 2015 నవంబరు 4 తెల్లవారు జామున ఈ ముగ్గురూ రాజయ్య ఇంట్లో మంటల్లో కాలి మరణించారు. వీరి మృతిపై అనుమానాలున్నాయని సారిక తల్లి లలిత, చెల్లి అర్చనలు తెలిపారు.[2][3] సారికది అనుమానాస్పద మృతిగా పరిగణిస్తూ రాజయ్య కుటుంబీకులందరిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.[4]

ఈ కేసులో సిరిసిల్ల రాజ‌య్య‌తో పాటు ఆయ‌న కుమారుడు అనిల్‌, భార్య మాధ‌వి నిందితులు. కాగా సుదీర్ఘ విచారణ అనంతరం 2022 మార్చి 22న వరంగల్‌ కోర్టు ఈ ముగ్గురిని నిర్దోషులుగా తేల్చింది.[5]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-02-01. Retrieved 2014-01-21.
  2. డబ్బు కోసమే సారికను హత్య చేశారన్న సారిక తల్లి లలిత (సాక్షి - 4 నవంబరు 2015)
  3. మా అక్క ఆత్మహత్య చేసుకొనేంత పిరికిది కాదు అని తెలిపిన సారిక సోదరి అర్చన (సాక్షి - 04 నవంబరు 2015)
  4. రాజయ్య కుటుంబ సభ్యుల అరెస్టు (గ్రేట్ ఆంధ్రా - 04 నవంబరు 2015)
  5. "Siricilla Rajaiah: సిరిసిల్ల రాజయ్యకు భారీ ఊరట". Sakshi. 2022-03-22. Retrieved 2022-03-22.