బస్వరాజు సారయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బస్వరాజు సారయ్య
బస్వరాజు సారయ్య


శాసనమండలి సభ్యుడు
పదవీ కాలము
14 నవంబరు 2020 - ప్రస్తుతం

బిసి సంక్షేమ శాఖ మాజీ మంత్రి
పదవీ కాలము
2010 - 2014

శాసనసభ్యుడు
పదవీ కాలము
1999-2014
నియోజకవర్గం తూర్పు వరంగల్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం డిసెంబరు 5, 1955
మట్టెవాడ, వరంగల్లు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ (- 2016)
తెలంగాణ రాష్ట్ర సమితి (2016 - ప్రస్తుతం)
తల్లిదండ్రులు చేరాలు (తండ్రి)
జీవిత భాగస్వామి లక్ష్మీ
నివాసము హైదరాబాదు, తెలంగాణ

బస్వరాజు సారయ్య తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. కాంగ్రెస్ పార్టీ తరపున తూర్పు వరంగల్ శాసనసభ నియోజకవర్గం నుండి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సారయ్య, బిసి (వెనుకబడిన కులాల) సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశాడు. దక్షిణ భారతదేశంలోనే తొలి రజక ఎమ్మెల్యేగా గుర్తింపు పొందాడు.[1]

2016లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన సారయ్య 2020, నవంబరులో శాసనమండలి సభ్యుడిగా (గవర్నర్ కోటా) ప్రమాణ స్వీకారం చేశాడు.[2]

జావిత విషయాలు[మార్చు]

సారయ్య 1955, డిసెంబరు 5న వరంగల్లులోని మట్టెవాడలో జన్మించాడు. ఇతని తండ్రిపేరు చేరాలు. ఐటిఐ పూర్తిచేశాడు. సారయ్యకు లక్ష్మీతో వివాహం జరిగింది.

రాజకీయ ప్రస్థానం[మార్చు]

వరంగల్‌ మున్సిపాలిటీలో మూడుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యాడు, మున్సిపాలిటీ వైస్‌చైర్మన్‌గా కూడా పనిచేశాడు. వరంగల్ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశాడు.

1999లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పూడి రమేష్ బాబుపై 9,251 ఓట్ల తేడాతో గెలుపొంది తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. 2004లోలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుండు సుధా రాణీపై 41,167 ఓట్ల తేడాతో గెలుపొందాడు. 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటిచేసి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి వై. ప్రదీప్ రావుపై 7,255 ఓట్ల తేడాతో గెలుపొందాడు. 2010 నుండి 2014 వరకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వెనుకబడిన కులాల సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నాడు.[3]

2014లో తెలంగాణ తొలి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ చేతిలో 55,085 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 2016, ఫిబ్రవరి 23న తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాడు.

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ, తెలంగాణ (14 November 2020). "దక్షిణాదిలో తొలి రజక ఎమ్మెల్యే". ntnews. Archived from the original on 14 November 2020. Retrieved 14 November 2020.
  2. The Hans India, Telangana (14 November 2020). "Telangana Cabinet strikes balance with MLC posts". www.thehansindia.com. Archived from the original on 14 November 2020. Retrieved 14 November 2020.
  3. "Archive News". The Hindu. Retrieved 2020-11-14.